23, ఫిబ్రవరి 2017, గురువారం

ఎందుకు తెలుసుకోలేక పోతున్నామో...!!

రాహిత్యానికి సన్నిహితం సాహిత్యం. సాహిత్యానికి చుట్టమైంది అక్షరం. రాహిత్యంలో కొట్టుమిట్టాడే మదిని సేద దీర్చేవి
అక్షర భావాలు. అలుపెరగని అక్షరాలు ఆయుధాలుగా మారాలన్నా, అలసిన మనసులకు ఆలంబన కావాలన్నా ఒక వారధి (మాధ్యమం) అవసరం. అది ఆవేదన చెందే మనసులకు ఊరట ఇస్తుంది అనే ఆశతో చాలామంది ఈ మాధ్యమాల ద్వారా తమ వేదన, బాధ చెప్పుకుంటూ ఉంటారు. కొందరేమో వ్యాపారాల కోసం అది వస్తువుల వ్యాపారం కానియ్యండి, మనుష్యుల మనసులతో కానియ్యండి ఇలా వారి వారి మాటల చాతుర్యంతో కథలల్లేస్తూ మగవారైతే ఆడవారి సానుభూతి, ఆడవారైతే మగవారి సానుభూతి బకెట్ల కొద్దీ పొందేస్తూ అతి మంచివారిలా నటించేస్తూ ఉంటారు. రాయడానికి, బొమ్మలు పెట్టడానికి మనకో మాధ్యమం దొరికిందని సంబర పడిపోతూ నీతులు అదే పనిగా వల్లే వేస్తూ చరిత్ర(హీనులమని తెలిసినా)కారుల్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. నీతి, న్యాయం అందరికి ఒకటే అని తెలుకోలేం. ఓపిక, డబ్బు ఉందని కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే రేపటి రోజున " తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది" అని ఎందుకు తెలుసుకోలేక పోతున్నామో...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner