17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఎవరికైనా ఒకటే శిక్ష...అదేంటి...?

నేస్తం,
        ఈ సభ్య సమాజం ఎటువైపు పోతోందో తెలియడం లేదు. అంతర్జాలం, ముఖ పుస్తకాలు, వాట్స్ అప్ లు వగైరా వగైరా వచ్చాక కుటుంబ విలువలు ఎంతగాదిగజారి పోతున్నాయో చూస్తుంటే చాలా బాధగా ఉంది. విశృంఖలత్వం, విచ్చలవిడితనం ఒక్క మగవాళ్ళలోనే కాదు ఎంతో మంది ఆడవాళ్ళలో కూడా ఉన్నారు. మొగుడు ఉన్న వాళ్ళు, లేనివాళ్ళు , పెళ్ళాలు ఉన్నవాళ్ళు కూడా ఒకటి కాదు ఇద్దరు కాదు ఆడది ఐతే చాలు అన్నట్టుగా ఉన్నారు. ఆ వెధవలు సరే మరి ఈ మహాతల్లులకు ఏమైందో కాపురాలు కూలుస్తున్నారు. డబ్బుల కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా ఈ ముం.. లకు. పగలు చూస్తే పగలే కలలోకి వస్తారు. అమ్మాయిలతో స్నేహం అంటూ వాళ్ళ ఆయనలతో రాసలీలలు. వీళ్లకన్నా వేశ్య చాలా ఉన్నతమైంది నా దృష్టిలో. ఈ నా కొ.. లకు అది ఆడది ఐతే చాలు పెళ్ళాం కాకుండా. వాళ్ళ వయసు కూడా మర్చిపోతారు. రేపోమాపో కాటికి పోతున్నా. మరి అలాంటప్పుడు పెళ్ళాం ఛస్తే రెండో పెళ్ళి ఎందుకో వీళ్ళకి. నచ్చిన ఆడదానితో తిడగవచ్చు కదా. ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం ఎందుకు..?
    సొమ్ము,  పదవి ఉంటే సరిపోదు. మనిషిగా పుట్టినందుకు కనీస విలువలు ఉండాలి ఎవరికైనా. బరితెగించడం, బజారు బుద్దులు నాలుగు రోజులు దాయగలుగుతారు. పేర్లతో, సాక్ష్యాలతో బయటపెట్టడానికి ఓ క్షణం చాలు. కానీ ఇలాంటి వాళ్లకు ఆ చిన్న శిక్ష సరిపోదు. నాకు ఈ ముఖపుస్తకంలో ఎంతో మంది మంచి హితులున్నారు. అందరికి నా విన్నపం ఒక్కటే ఎవరి కొంపో కదా కాలుతుంది మనదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకోకుండా ఇలాంటి వారికి ఎలా బుద్ది చెప్పాలో చెప్పండి. ఆడ మగ తేడా లేదు ఎవరికైనా ఒకటే శిక్ష...అదేంటి...?
నా నుంచి ఇలాంటి పోస్ట్ ఇదే ఆఖరుది కావాలని కోరుకుంటున్నాను. ఈసారి రాయడమంటూ జరిగితే పేర్లు సాక్ష్యాలు కనిపిస్తాయి.  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner