1. అవగతమైన అంతరంగమిక్కడ_నిత్యం మన మధ్యన మాటలు లేకున్నా....!!
2. వెలుతురు వాదులాడింది_చీకటిలో వెన్నెల చెలిమి కోసం...!!
3. తిమిరమూ తెర మరుగౌతోంది_భారాన్ని భావాలకద్ది....!!
4. మిన్నకున్నాయి తిమిరాలు_వేకువను అడ్డుకోలేక...!!
5. జలతారు వెన్నెలది_చీకట్లకు వెరవనిది...!!
6. అందంగా అమరింది మది భావమే_అల్లుకున్న అక్షరాల్లో ఇమిడిపోయి..!!
7. ఉప్పనీటి చెమ్మలే ఎక్కువ_జీవితపు చెలమలో...!!
8. మౌనం ఆలకిస్తోంది_పలకరింపులు ఏ క్షణాలకని...!!
9. కాలానికి చిక్కనివి_మనవైన క్షణాల గురుతుల గమనాలు...!!
10. సంతోషం సహపాటయ్యింది_నీ పొడుపుకథలను నే విప్పుతుంటే....!!
11. గెలుపు మౌనానిదయ్యింది_పలకరింతలొద్దని బెట్టు చేసిన మాటలకందక...!!
12. బెంగ పడినా బింకాన్ని వీడలేదు_మౌనానికి మనసివ్వాలనేమెా....!!
13. మనసు భాష మధురమే_లిపి అక్కర్లేని మౌనమది...!!
14. చిరునవ్వుల మౌనాన్ని నేను_అనునయించిన నీ ఆత్మీయతకు... !!
15. భారమైనా భరించక తప్పదు_మౌనాన్ని ఆశ్రయించిన మౌనిని...!!
16. దాగిన మధురాక్షరాలే ఇవన్నీ_మౌనాన్ని వీడిన మనసువై...!!
17. మనసు మౌనం ఒకటయ్యాయి_భావాల చేరువలో...!!
18. పరిమళించేది నీ పరిచయంలోనే_మౌనభావం మదిని తాకినప్పుడు...!!
19. ఓ చిన్న పలకరింపు_యెాజనాల దూరాన్ని దగ్గర చేస్తూ...!!
20. మందలింపులకు మాలిమి కావడం లేదు_మది కల'వరాలు...!!
21. మనసుకి నచ్చిన మౌనమే మేలు_ఆత్మీయత కానరాని మాటలకన్నా...!!
22. కలల పహరానే ఎప్పుడూ_నిదుర కొలను చుట్టూ...!!
23. చెమ్మతో నిండని చెలమే_మది రాయని భావాల కాగితంలో..!!
24. ముత్యమంటి మనసది_వన్నె తగ్గని వ్యక్తిత్వంతో మెరుస్తూ...!!
25. కినుక వహించినా కాళ్ళ బేరం తప్పడం లేదు_పసిడి నవ్వుల ముత్యాలకు..!!
26. చెలిమి సాహచర్యమది_అహాలకు అందక ఆత్మీయపు ముత్యపు చినుకుల్లో..!!
27. నవ్వులు చెదిరిపోతాయి_క్షణాల్లో తారుమారయ్యే విధిరాతకు...!!
28. తప్పని తిరోగమన జీవితమే_వెన్నాడుతున్న విషాదాల నడుమ...!!
29. అవ్యాజమైన అమ్మ ప్రేమ_ ఆవకాయ ముద్దతోనే జీవితాన్ని బోధిస్తూ...!!
30. అన్ని రుచులు అమ్మ నేర్పినవే_ప్రేమకు చిరునామాగా....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి