1. సంద్రమంత సంతోషమే_గగనమంత చెలిమి సొంతమయ్యిందని...!!
2. భాషతో పనేముంది_మనసే నీదైనప్పుడు....!!
3. వెంటాడే ఈ జ్ఞాపకాలు_వేదించే మదికి నివేదించే నివేదనలే..!!
4. మనసూ మౌనవిపంచే_ముసిరిన భావాలను సుస్వరాలుగా సరిచేస్తూ...!!
5. నిశీధికి వీడ్కోలిచ్చేది జ్ఞాపకాలే_గుప్పెడు గుండెకు ఆలంబనగా....!!
6. అల్లుకుపోవడం అక్షరాలకలవాటే_ఆత్మీయత వాటి చుట్టమట...!!
7. సోయగాల చంద్రుని స్వాగతిస్తున్నాడు_రవి రాజసంగా వీడ్కోలు తీసుకుంటూ...!!
8. మదిని తడిమే అనుభ(భా)వాలు చాలు_అక్షరాల్లో ఊపిరి పోసుకోవడానికి...!!
9. గాయమైంది ఓ గుండెకు_ప్రణయం మిగిల్చిన విషాదానికి...!!
10. మదిని తడిమే మౌనాలెన్నో_అక్షరాలకు ఆయువునిస్తూ..!!
11. పొడిబారిన మనసు తడే_ఆత్మీయతనద్దుకున్న ఈ అక్షరాలది..!!
12. భరించనలవి కానిదే ఈ నిశ్శబ్ధం_జ్ఞాపకమెాపలేని భారమైనప్పుడు...!!
13. జ్ఞాపకాలు గుభాళిస్తూనే ఉన్నాయి_బతుకు భారాన్ని తేలికజేస్తూ...!!
14. సవ్వడి మిన్నకుంది_మౌనంలో మనసు సడి వినాలని....!!
15. కల్లోల పరిచింది కలహమే_ఏమరుపాటుకు గురైన మనసుని...!!
16. ప్రతిపక్షపు అక్షరాలు గోలెడుతున్నాయి_తీర్మానంలో తికమకలున్నాయట...!!
17. రెండు పక్షాలకు సర్దుబాటే ఎప్పుడూ_పాలితులు పట్టించుకోనంత వరకు..!!
18. కాలమూ హితమౌతోంది_నీతో నిశ్శబ్ధంగా సంభాషిస్తున్నందుకు...!!
19. విడివడని బంధం మనది_తడబడిన అడుగుకు ఆసరానిస్తూ...!!
20. కాలంతో కలిసిపోవాలనుకున్నా_గగనంలోనైనా సేదదీరాలని....!!
21. మనసు ముడి వీడకుంది_మూడుముళ్ళ బంధం ఎగతాళి కాకూడదని..!!
22. బాధ్యతలెక్కువ బంధానికి_మనసు మాయకు లోబడదందుకే...!!
23. పేగుబంధానికి ప్రేమెక్కువ_ముడులను విడివడనీయకుండా....!!
24. ఆత్మీయత అరుదైనదే_మది స్పందన స్వచ్ఛమైనదైనప్పుడు...!!
25. మెాహం సమ్మెాహనమైంది_విడలేని బంధం మనదని తెలిసి..!!
26. మర్మమెరుగనిదే అమ్మదనం_జీవాన్ని నింపి జీవితాన్నిస్తూ...!!
27. మనసుకలవాటైనట్టుంది_అక్షరాల నిషాలో మునిగి తేలడంలో...!!
28. కలంతో కలిసిన బంధమది_సిరాతో తప్పని సిగపట్లు అక్షరాలకు....!!
29. అనుబంధాలలా అడ్డుపడుతుంటాయందుకే_మనసారాటానికి ఆయువునిస్తూ...!!
30. ముగిసిన కథగా మిగలాలనుకున్నా_సశేషం కాకుండా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి