1. మనసును చదవడం నేర్చుకున్నా_భాషలకతీతంగా ఉండాలని...!!
2. మదిని తాకిన భావనలే_అక్షరాలకు చేరికవుతూ....!!
3. పరిపూర్ణం పరిహాసమాడుతోంది_అల్ప సంతోషాలనందిస్తున్న విధిని చూస్తూ...!!
4. కాలం రాల్చిన కలలు_జ్ఞాపకాల క్రీనీడలుగా...!!
5. పొరపాటేమి లేదు_గ్రహపాటంతే ఈ జీవితం...!!
6. ఎన్ని యుగాల నిరీక్షణకైనా సిద్దమే_క్షణాల నీ సమక్షం కొరకు...!!
7. అక్షరాయుధం చాలు_గెలుపు సోపానమధిరోహించడానికి...!!
8. ఓ క్షణం చాలదూ_యుగాల కాల నిరీక్షణకు తెర దించడానికి....!!
9. మనసైన మమకారమది_గుప్పెడు గుండెెలో పదిలపర్చుకున్నానందుకే...!!
10. పగటిదెంత దొడ్డ మనసో_రాతిరికి సగభాగమీయడానికి...!!
11. భ్రమ కాదు వాస్తవమే_అద్దం చూపింది నీలోని నన్నే..!!
12. భావాలను మౌనం ఆవహించింది_మనసాక్షరాలపై కినుక వహించి...!!
13. ఓటమి విజయమిది_నీ గెలుపులో నన్ను చూసుకుంటూ...!!
14. నెమలీక నెయ్యం నాకు వద్దు_చేయందించే చెలిమి చాలు...!!
15. మౌనం మాటాడుతునే ఉంది_మనసు తెలుపుతూ...!!
16. ఛీత్కారాలకు తావెక్కడ_చెలిమి చేరువయ్యాక...!!
17. అక్షరాలకూ అతిశయమే_భావాలను అందంగా అల్లుకుంటున్నందుకు...!!
18. ఆద్యమైనది అంకురమే_తెర మరుగున ఉన్నా ఉనికి పరిచితమే...!!
19. హాలాహలమూ అమృతమే_మధనాలన్నీ మధురాలై చేరితే...!!
20. శాశ్వత ముద్రలే కొన్ని_సైకత రేణువులైనా చెదరక...!!
21. ఆత్మీయతల నెలవే ఆ చెలిమిది_చిరాకు పరాకులకు చోటులేదక్కడ...!!
22. ప్రతి కవితా పదాల సంపదే_కతల వెతల సమాహారమై అలరిస్తూ...!!
23. వెతలకు వెలితినిచ్చింది_ఆత్మీయమైన అక్షరాల చెలిమి...!!
24. కంటికెగసిన మింటిధార_మనసు మర్మమును దాయనేర్చునా...!!
25. దాగని కన్నీళ్ళే ఇవి_మనసును చలువ పందిళ్లుగా మార్చుతూ....!!
26. చేవ్రాలు చెరగకుంది_గతజన్మ బంధాన్ని తలపిస్తూ....!!
27. నవ్వులన్నీ నువ్వున్న క్షణాలవే_అది గతమైనా వాస్తవమైనా....!!
28. మనదైనదే జీవితం_ మనసు నవ్వులన్నీ జీవాన్ని నింపుకున్న క్షణాల్లో....!!
29. చెదిరిపోని అనుబంధమిది_అపురూపమైన జ్ఞాపకంగా పదిలమై...!!
30. మాసిపోదు జ్ఞాపకమెప్పుడూ_
గతమైనా వాస్తవమై వెన్నాడుతునే.... !!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి