1. మనవైన క్షణాలే_మనసు భారాన్నంతా దించేస్తూ..!!
2. సునామీలా చుట్టేసింది_నీ ప్రేమ వెల్లువై ఉప్పొంగుతూ..!!
3. మనసుకన్నీ ఓదార్పులే_గాయాలనుపశమింపజేసే చెలిమి తోడైతే..!!
4. మనిషిలోని మనసు మార్పది_ఓదార్చిన చేతిని అను(వ)మానిస్తూ...!!
5. ఏ భవిష్యత్తు ఊతమిచ్చిందో_చెక్కిట ఆభరణమైంది చిరునవ్వు సొట్ట...!!
6. గోముఖ వ్యాఘ్రాలుంటాయి మరి_జీవితంలో జాగరూకత అవసరమే..!!
7. అక్షరాల అమరికకు దాసోహమవ్వాల్సిందే_ఏ పద సౌందర్యమైనా...!!
8. మాలిమి అలవాటైన వనమాలి_అక్షర వనానికి వన్నెలద్దుతూ...!!
9. జ్ఞాపకాలు వెంటబడుతున్నాయి_వర్తమానానికి అర్జీ పెట్టుకోవడానికేమెా...!!
10. ఆరాధనంతా అక్షరాలను అలముకుంది_పద ప్రవాహమై ప్రవహిస్తూ..!!
11. పదక్రాంతులే కొందరు_అక్షరాల్లో ఒలికిన ప్రేమకు...!!
12. దోసెడు పద పారిజాతాలు చాలు_గుప్పెడు గుండెలోని ఆరాధన చూపడానికి..!!
13. తులాభారానికే భారమయ్యింది_మనసు జార్చిన కన్నీటిని తూకమేడానికి..!!
14. ఆయువుదేముంది అరక్షణమే_జీవించడంలోనే చాకచక్యమంతా...!!
15. ముందుకే పోతానంటోంది మనోధైర్యం_భయపెట్టే గతాన్ని గదమాయిస్తూ..!!
16. నీ మౌనాన్ని వినడమెా వ్యసనమైంది_ఊరడించే ఊహలను వెదుకుతూ...!!
17. అణుకువతో అందిపుచ్చుకోవడమే_సమయం మనదికాకున్నా..!!
18. గత జ్ఞాపకాల్లో బతికేస్తుంటాం_వాస్తవం భయపెడుతుంటే..!!
19. వర్తమానానికో హెచ్చరిక_వాస్తవమెప్పుడూ...!!
20. విషాదమూ ఓ వరమే మరి_స్వగతంలో గతాన్ని స్మరిస్తూ..!!
21. తరాజూ తల్లడిల్లింది_కన్నీటినెలా తూకమేయాలో తెలియక..!!
22. నీలిఛాయ వెంటే ఉంది_చితి మీదకు చేరినా మాయమవకుండా..!!
23. వేటగాడికి ఏ గాలైనా ఒకటే_గాయపరచడమాతని వృత్తి కనుక...!!
24. స్వేచ్ఛను హరించింది వర్తమానం_జ్ఞాపకాలను మాయం చేస్తానని భయపెడుతూ...!!
25. స్వాతిశయమూ ఎక్కువే అక్షరాలకు_తమను కాదని భావాలు మనలేవని...!!
26. మౌనం వినిపించాలనుకుంటోంది_కాసిని మాటలు అరువివ్వవూ...!!
27. చూపాలనుకుంది నిన్నే_పరిచయమున్న అక్షరాల్లో...!!
28. మౌనం దాచేసింది_మనసు మాటలన్నీ..!!
29. అంతిమయాత్రే తుది ఫలితం_జీవితపు తప్పొప్పుల పరీక్షలో..!!
30. విలాపమూ విలాసమైంది_మనిషితనం మరచిన మదాంధులకు..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి