11, నవంబర్ 2021, గురువారం

నే చెప్పేదేటంటే..!!

                        
నేస్తం, 
         సామాన్యులకు జరగని న్యాయం కాస్తలో కాస్త న్యాయాధికారులకు, న్యాయవాదులకయినా జరిగితే సంతోషం. అధికారంలోనూ, హోదాలోనూ వుంటేనే మనుష్యులు కాదు. సామాన్యులకు కూడా న్యాయం జరిగితే బావుంటుంది. మన వ్యవస్థలో వున్న అతి పెద్ద లోపం ఇదే. అధికారానికి, డబ్బుకు చట్టం సలాము చేసినంత కాలం సామాన్యులకు న్యాయం అందని ఆకాశమే. 
        Ease అని చదవడం రాని, అర్థం తెలియని CI లు వున్నంత కాలం మన వ్యవస్థ ఇంతే. సరే పోని తెలుగయినా సక్రమంగా వచ్చా అంటే అదీ అంతంత మాత్రమేనాయే. 
“ యథా రాజా తథా ప్రజా “ అన్న ఆర్యోక్తి అక్షరాలా నిజం నేటి మన సమాజంలో. అమ్మామెుగుడు అని అందంగా పలికే రాజభాష ఇప్పుడు మనదే. ప్రజలు ఇచ్చిన అధి’కారం ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారన్నది జగ’మెరిగిన సత్యం. 
         సగటు మనిషికి అందుబాటులో లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. నీతులు, సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి, ముందు మనం ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి, అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం. మనం మాట్లాడే భాషేదయినా కాస్త అర్థం పరమార్థం వుండి, సామాన్యులకు అర్థమయితే చాలు. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు మనమెంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా. ప్రపంచం గమనిస్తూనే వుంటుంది మనల్ని, మన చర్యలను.
         చివరిగా నే చెప్పొచ్చేదేటంటే అదెచ్చా..ఓ పాటలో ఇన్న లెక్కలు, ఎక్కాలు దెల్వనోళ్ళు….అయినట్టన్న మాట..😊

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

Very good.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner