16, నవంబర్ 2021, మంగళవారం

అగాధపు అంచుల్లో..!!


చేజారిన క్షణాలన్నీ
గుప్పెట బంధించి
పదిలంగా దాచుకోవాలనుకున్నా

గాయాల గతమైన
జ్ఞాపకాలన్నీ వెంటబడి
తరుముతూనే వున్నా

పలకరించే బంధుత్వాలు
పాతబడి పక్కకు చేరినా
పాశం జారవిడవలేకున్నా

లోగుట్టు నెరుగని మనసు
అద్దంలో ప్రతిబింబం నిజమనే భ్రమలో
మగ్గుతూనే ఉంది కాలం కలిసిరాక

అగాధాన్ని అధిగమించాలన్న ఆకాంక్ష
ఊపిరినొదలనీయక 
అక్షరాలను అడ్డుగా పరిస్తే

పరాయితనంపై ప్రేమలొలకబోస్తూ
అనుబంధాలను అధిక్షేపించే
అసురజాతికి చరమాంకమెప్పుడో..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner