1, నవంబర్ 2021, సోమవారం

నేనెవరో..!!

అవును..
నేనో సంతోషాన్నే
ఎప్పుడూ

వేదనలెన్ని చుట్టుముట్టినా
చెదరని చిరునవ్వుతో
కనబడుతూ

బాధలెన్ని దరిజేరినా
బాంధవ్యాలను అంటిపెట్టుకుని
బతికేస్తూ

గాయాలెన్నయినా
జ్ఞాపకాలుగా మలిచేసుకున్న గతంగా 
ఉండిపోతూ

ఆరంభమేదైనా
అరకొరగా మిగిలిన ఆత్మీయతలలో
కొట్టుమిట్టాడుతూ

అక్కరకు రాని చుట్టరికాలకు
తిలోదకాలివ్వలేని నిస్సహాయతకు
బందీగా

మనసుకు మాలిమైన
లక్షణాలనెరిగిన అక్షరాలతో
ఆటలాడుకుంటూ

విషాదాన్ని
వినోదంతో నింపేయాలనుకునే
ఆశావాదినో..అవకాశవాదినో.!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner