30, డిసెంబర్ 2021, గురువారం

శిక్ష ఎవరికి..?

నేస్తం, 

      జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. అలాగే నమ్మి మోసపోవడమూ సహజమే. అలా అని నమ్మకుండానూ వుండలేం. ఇలా నమ్మి డబ్బులు ఇచ్చో లేదా మధ్యన వుండి ఇప్పించిన పాపానికో తమ ఆస్తులు అమ్మి పెళ్ళాం బిడ్డలను రోడ్డున పడేసిన వారు కొందరైతే, కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకున్న వారు ఎందరో. అప్పు ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఇద్దరు బానే వున్నారు. మధ్యలో నాశనమైంది మరో కుటుంబం. 

     దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి పెళ్ళాం బిడ్డలకు ఏ లోటు లేకుండా చేసి చచ్చే వెధవలు కొందరు. రాజకీయ కక్షలతో హత్య గావించబడేవారు మరి కొందరు. వీరికి అప్పు ఇచ్చినవారు, ఇప్పించినవారు  రోడ్డున పడ్డారు. వీరి పెళ్ళాం మాత్రం హాయిగా మూడు కోట్లతో గవర్నమెంటు ఉద్యోగం చేసుకుంటోంది. మరి కొందరేమో చాలా తెలివిగా కమీషన్ తీసుకుని అటు వారిని ఇటు వారిని వెధవలను చేసి, వీరు మాత్రం చాలా హాపిగా హాలిడే ట్రిప్ కి విదేశాలు తిరుగుతూ బతికేస్తుంటారు, తమకేం సంబంధం లేనట్టుగా. మనం ఎటు చూసుకున్నా నష్టపోతోంది మధ్యలోని వారే. 

        ఇంట్లో పెళ్ళాం బిడ్డల అవసరాలు పట్టవు గాని ప్రజా సేవకులు కొందరు. ప్రపంచం తమని మంచి ఉత్తముడిగా గుర్తించాలన్న ఆరాటం వీరిది. కుటుంబం తిండి ఖర్చులు లెక్కలు వేసుకుంటారు కాని తాము తగలేసే పుణ్యకార్యాలకు(పేకాట, తిరుగుళ్ళు, తాగుబోతులకు, చావులకు, దినవారాలకు వగైరా..)ఎంత ఖర్చు అయ్యిందో తెలియని అమాయకులు పాపం. ఎక్కడెక్కడ తిరిగేది, ఎవరికెంత తగలేసింది ఇలాంటివన్నీ గుట్టే. కొందరు పెద్ద మనుష్యులేమో ఆడపిల్లకు పెట్టాల్సింది పోయి తరతరాల నుండి ఆడపిల్లల సొమ్ము తిని బతికేస్తూ నీతులు మాత్రం వల్లిస్తారు. మరి కొందరేమో ఎలుక మీద పిల్లికి , పిల్లి మీద ఎలుకకి చాడీలు చెప్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుంటారు. పెళ్ళాం బిడ్డల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడిన దాఖలాలు చరిత్రలో లేవు.

        ఎవరికి వారు అందరు నీతిమంతులే. తమ బండారం బయట పడనంత వరకు. ఆ ఇంటికి ఈ ఇల్లు, ఈ ఇంటికి ఆ ఇల్లు మధ్యన దూరం ఒకటే. బంధమైనా, చుట్టరికమైనా, స్నేహమయినా ఇచ్చిపుచ్చుకోవడంలోనే వుంటుంది. డబ్బుతో అన్నీ దొరకవని తెలియాలి. రక్త సంబంధాలే అంటరాని బంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో మనిషితనం కొరవడటంలో ఆశ్చర్యం లేదులెండి.


వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు మధ్యలో ఉండి అప్పు ఇప్పించిన పాపానికి బలైన కుటుంబం వీరు. వీరి చావుకు శిక్ష ఎవరికి వేస్తుంది న్యాయస్థానం?

19, డిసెంబర్ 2021, ఆదివారం

జీవన మంజూష జనవరి 2022

నేస్తం,

           ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాంఒంటరిగానే పోతాంమహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందోగమనించండితనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధిచేయమన్నాడటదాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదాఎంతసంపాదించినావిశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేముఉత్తి చేతులతోవెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకివుంచి సమాధి చేయమన్నాడు

      మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయపడుతూనే వుంటాంఅవసరాలకు డబ్బులు కావాలికాని మన అవసరమే డబ్బుగామారిపోయింది ఈనాడుప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయిందినైతికవిలువలు నశించి పోతున్నాయినాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకునిమర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోందిఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్నఅనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.

        ఒకే ఇంటిలో ఉంటున్నాఅపరిచితులుగా భార్యాభర్తలుపిల్లలుమిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోందికుటుంబ సంబంధాలలోనాఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనాలేదా మూలాలను మరచిఅందలాలనుఅందుకున్న మనిషి ఆలోచనలదాఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతినిసాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాంకనీసం హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలోఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారుప్రపంచంలో ఎవరినోమనముద్దరించనక్కర్లేదుమన చుట్టు జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగామిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు

        ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండాతడబడి తడబాటుకుగురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమోమనిషి సాయమో చేయగలిగితే చాలుకదా..!!




16, డిసెంబర్ 2021, గురువారం

గుర్తుకొస్తున్నాయి...




" గురుతులు కావివి..గుండెను తట్టి లేపే జ్ఞాపకాలివి.... "
     " మన ఊరు, మన మట్టి, మన గాలి అలాగే ఉంటాయి. మనమే వస్తుంటాం, పోతుంటాం ".
ఈ మాట చదివిన ఎవరికైనా ఓసారి మనసు భారంగా కాకుండా ఉంటుందా చెప్పండి? మనం ఎంత దూరంగా వెళ్లినా ఏదోక సమయంలో జ్ఞాపకాలు మనసు తలుపు తట్టకుండా ఉండవు. అవి మనకు నచ్చినవైనా సరే. బాధించేవైనా సరే. ఈ భూ ప్రపంచంలో జ్ఞాపకాలు లేని మనుష్యులు అరుదుగా ఉంటారేమెా. అలాంటి వారిని వదిలేస్తే ప్రముఖ పశు వైద్యులు డాక్టర్ డి. ప్రసాద్ గారు రాసిన " గుర్తుకొస్తున్నాయి.." పుస్తకం చదువుతుంటే ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు ప్రతి ఒక్కరికి ఏదోక పేజిలో తమ జ్ఞాపకాలు గుర్తుకు రాక మానవు అనడంలో ఏమాత్రం అతిశయెాక్తి లేదు. 
    సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి అప్పటి రోజులలోనే మూగజీవాలపై ఉన్న ఆపేక్షతో ప్రజా  వైద్యునిగా కాకుండా పశు వైద్యునిగా అకుంఠిత దీక్షతో తన చదువును కొనసాగించి, ఎన్నో మూగజీవాలకు తన సేవలందించి, వైద్యరంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టి, నిజాయితీ విలువను ఆకాశంలో నిలిపి, మానవత్వాన్ని చాటిన డాక్టర్ డి ప్రసాద్ గారు ఎందరికో మార్గదర్శకులు నేడు. 
      " గుర్తుకొస్తున్నాయి...నా జ్ఞాపకాలు " అంటూ తన చిన్ననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనలను మన కనుల ముందు కనిపించేటట్లుగా రాయడమే కాకుండా, దానికి పుస్తక రూపమివ్వడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకు స్వతంత్రం రాక ముందు నుండి జరిగిన ఎన్నో విషయాలను, తర్వాత తర్వాత వచ్చిన మార్పులను, చేర్పులను, చరిత్రలోని ఎన్నో మనకు తెలియని విషయాలను, ఎందరో మహానుభావులను, వారితో తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 
    చిన్నతనంలోనే నాన్న మరణంతో మెుదలైన మెాసాన్ని ఓ పాఠంగా తీసుకున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి తాను నమ్మిన న్యాయాన్ని గెలిపించారు. చిన్నతనంలోని చదువును, నాటకాలను, ఆటలను, పాటలను, ఆనాటి అనుబంధాలను, స్నేహ పరిమళాలను, ఉపాధ్యాయులను, గురువులను, స్పూర్తినందించిన నాయకులను, వారి ఉపన్యాసాలను వివరించడమే కాకుండా తాను సందర్శించిన యూరోపియన్, అమెరికా, కెనడా దేశాలను, అక్కడి విశేషాలను, వింతలను, భిన్న మనస్తత్వాలను చక్కగా అక్షరీకరించారు. 
        తన వృత్తిలో తనకెదురైన సవాళ్ళను ఎదుర్కుంటూ, నలుగురిని కలుపుకుని సమాజానికి, మూగజీవాలకు ఎలా మంచి చేయవచ్చో చేసి చూపించి, నలుగురికి ఆదర్శంగా నిలిచారు. చేసే వృత్తి పట్ల అంకితభావముంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. వీరి విజయ ప్రస్థానం ఎందరికో మార్గదర్శకం. ఎన్నో వ్యాసాలు రాసిన అనుభవంతో వెలువడుతున్న ఈ " గుర్తుకొస్తున్నాయి...(నా జ్ఞాపకాలు )" అందరి మనసు తలుపులను తప్పక తడుతుందని చెప్తూ....నాకూ నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

అతి కొద్ది పరిచయంతోనే ఆత్మీయబంధమైన బాబాయికి హృదయపూర్వక శుభాకాంక్షలతో.. 

మీ
మంజు

రణ నినాదం...!!

రాజకీయ రాక్షసక్రీడకు
ఆహుతి అవుతున్న 
ప్రజా సంపదలెన్నో

స్వప్రయెాజనాలకు 
కన్నతల్లినే కాలరాస్తున్న
కిరాయి బిడ్డలెందరో

ఎన్నో ఉద్యమాల పోరాటంతో
ఎందరో మహాత్ముల
త్యాగఫలమీ ఆంధ్రరాష్ట్రం 

స్వార్థాల చీకటి కోరల్లో
ఉచితానుచితాల మాయలో
పన్నుల భారాన్ని మరచినారు జనులు

విభజన పాలకుల 
మెాసపు మాటల్లో పడకండి
విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కని మరువకండి

నివేదనలు పనికిరావు
నినాదమై నినదించాలి
మన హక్కు మనకే సొంతం కావాలి

ప్రైవేటీకరణకు కాదు ప్రజలసొమ్మంటూ
పాలకుల నియంతృత్వానికి 
చరమగీతం పాడుతూ
రణ నినాదమే జననినాదంగా
పోరుబాటగా సాగుతూ
ఆంధ్రుడి ఆత్మగౌరవం 
ఉక్కు విశాఖను కాపాడుకోవడం
మన అందరి బాధ్యతగా
సమిష్టి పోరాటంతో 
సమైక్యంగా కాపాడుకుందాం
రండి కదలిరండి ఆంధ్రులారా
గొంతెత్తి పలకండి 
నలుదిక్కులు పిక్కటిల్లేలా
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ
పరాయి సొత్తు కానివ్వమంటూ...!! 

12, డిసెంబర్ 2021, ఆదివారం

మంచితనానికి దక్కిన అరుదైన గౌరవం “ తానా అధ్యక్ష పదవి “

   సంకల్పం గొప్పదైతే అది సానుకూలమవడానికి మానవ ప్రయత్నానికి దైవమూ సహకరిస్తుందని చరిత్ర చెప్పిన విషయం. మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి మనిషి పెరిగిన వాతావరణం, కుటుంబ మూలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విద్యావంతులైన తల్లితండ్రుల పరిరక్షణలో, బాబాయి పిన్నిల సంరక్షణలో పెరిగి ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా, అత్యున్నత పదవినలంకరించినా, తాను పుట్టిన మూలాలను మరిచి పోకుండా పుట్టిన ఊరికి, తానున్న అమెరికాలోకి భారతీయులకు తన సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలందుకుంటున్న తానా అధ్యక్షుడు శ్రీ లావు అంజయ్య చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు.

       కృష్ణాజిల్లా పెద అవుట్ పల్లిలో లావు సాంబశివరావు, శివరాణి దంపతులకు జన్మించిన లావు అంజయ్య చౌదరి తండ్రి ఉద్యోగ నిమిత్తం బాబాయి, పిన్ని లావు రంగారావు, కోటేశ్వరమ్మల దగ్గర చిన్నతనంలో పెరిగారు. ప్రాధమిక విద్యాభ్యాసం గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ గౌతమ్ రెసిడెన్షియల్ కాలేజ్ లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ బళ్ళారిలోని విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లోనూ, ఎమ్ టెక్ గుల్బర్గాలోనూ పూర్తి చేసారు. తరువాత వివాహం, అమెరికా పయనం, ఉద్యోగం, పిల్లలు వగైరా బాధ్యతలతో సతమతమౌతున్నా కూడా తనలోని సేవా దృక్పధం నిలకడగా ఉండనీయలేదు. దాని పర్యవసానమే అంచెలంచెలుగా ఎదిగిన అంజయ్య చౌదరి లావు తానా అద్యక్ష పదవి.

        ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ముందుగా ఉన్నతమైన మనసుండాలి. సమాజ హితం కోరుకునే మంచి మనసుతో పాటుగా, కష్టంలో వున్న పదిమందికి ప్రతిఫలం ఆశించకుండా సాయపడే గుణముండాలి. పదవులను, పేరుని, ప్రతిష్టను ఆశించకుండా తనకు చేతనైన రీతిలో పదిమందినీ కలుపుకుంటూ ఆపదలోనున్న వారిని ఆదుకుంటూ తన మంచి మనసును చాటుకున్నారు. పరాయి దేశంలో  ఇబ్బందులు పడే వారి కోసం, అనుకోకుండా ప్రమాదాలకు గురైన వారిని వారి స్వస్థలాలకు చేర్చడంలో చాలా కృషి చేసారు

        ప్రతి ఒక్కరికి ఆహారం, విద్య, వైద్య సదుపాయాలు అందించాలన్న సదుద్దేశ్యంతో పలు సంస్థలతో కలిసి తన సేవలను విస్తృతపరిచారు. దశాబ్దం పైగా తన సేవలతో తానా సంస్థలో తానా టీమ్ స్క్వేర్ డైరెక్టర్ గా మెుదలుబెట్టి అనేక పదవులు అందుకుంటూ ఈనాడు తానా అధ్యక్షుడిగా ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఏకైక తానా అధ్యక్షుడు, మన తెలుగువాడు, కృష్ణాజిల్లా బిడ్డడు లావు అంజయ్య చౌదరి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఖరీదైన కాన్సర్ మహమ్మారి బారి నుండి సామాన్యులను ఆదుకోవడానికి, కాన్సర్ పై అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను అమెరికా, భారతదేశంలో తానా సంస్థ చేయడంలో ప్రముఖపాత్ర వహించారు. అన్ని రకాలుగా తన సొంత ఊరిని అభివృద్ధి చేయడంతో పాటు, పిల్లలకు, వికలాంగులకు, వృద్ధులకు అవసరాలకు సాయపడడంతో పాటుగా  మరెన్నో ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా నిర్వహిస్తూనే వున్నారు

      ఉన్నత శిఖరం చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. సమాజసేవకు కుటుంబం కూడా సహకరించాలి. వీరి విజయం వెనుక కాకుండా వీరి విజయంలో జత కలిసిన సతీమణి నటాషా గొట్టిపాటి. కన్న తలిదండ్రులనే పట్టించుకోకుండా అనాధలుగా వదిలివేస్తున్న ఎందరో ప్రవాసులు, స్వదేశీయులుకు కనువిప్పుగా లావు అంజయ్య చౌదరి గారు తను పుట్టిన ఊరికి చేస్తున్న సేవలు చెంపపెట్టు. మెుక్కవోని ఆత్మవిశ్వాసంతో సమాజ హితానికి పని చేస్తున్న శ్రీ లావు అంజయ్య చౌదరిని అత్యున్నత తానా అధ్యక్ష పదవి వరించడం ప్రాంతాలకతీతంగా ప్రపంచ తెలుగు వారికందరికి గర్వకారణం. ప్రపంచ చరిత్రలో తానా అధ్యక్షుడిగా తనదంటూ ప్రత్యేక ముద్ర వేయాలని, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని హృదయపూర్వకంగా నవ మల్లెతీగ కోరుకుంటోంది


Rare tribute to goodness "Tana presidency"

      History has shown to humanity the true power of positive thinking. The environment in which a man grows up and family origins play a major role in shaping a man's personality. Heartfelt congratulations to TANA President Shri Lau Anjayya Chowdhury, who not only grew up in the care of his educated parents, but also in the care of his uncle's higher education, and despite his high rank, has not forgotten his origins, but has rendered his services to the Indians in his homeland, America.

       Born to Lau Sambashivarao and Shivarani couple in Krishnajilla Peda Out Palli, Lauu Anjayya Chowdhury grew up as a child near Babai, Pinni Lauu Rangarao and Koteshwarammala for the sake of his father's job. He completed his primary education at Gannavaram St. John's High School, Intermediate Vijayawada Gautami Residential College, Electronics and Communications Engineering at Vijayanagar Engineering College, Bellary and M.Tech Gulbarga. Later, despite his marriage, travel to America, job, children, etc., his sense of service could not be sustained. The result was the gradual rise of Anjayya Chaudhary to the presidency.

        To climb high peaks one must first have a high mind. In addition to a good mind that seeks the good of society, it should have the quality of helping ten people in need without expecting any reward. He expressed his good mind by supporting those in danger by combining ten in a conscious way without expecting positions, name and prestige. For those who are in trouble in a foreign country, a lot of effort has been put into repatriating those who have been accidentally injured.

        He has expanded his services in collaboration with various organizations with the good intention of providing food, education and medical facilities to everyone. It is no exaggeration to say that Lavu Anjayya Chaudhary, the son of our Telugu, Krishnajilla, is the only TANA President to have received many accolades from around the world today as the TANA Team Square Director, beginning with his services as TANA Team Square Director for over a decade. TANA has been instrumental in launching a number of cancer awareness programs in the United States and India to help the general public recover from the costly cancer epidemic that is gripping the world. In addition to developing his hometown in all sorts of ways, he continues to run other service programs to help children, the disabled, and the elderly in need.

      To reach the top peak you have to face many ups and downs. The family should also contribute to community service. His wife Natasha Gottipati, who was paired in their success, was not behind their success. Lau Anjayya Chowdhury's services to his hometown have been tarnished by the plight of many expatriates and natives who are left as orphans, ignoring their parents. It is a matter of pride for all the Telugus of the world, regardless of region, that Mr. Lau Anjayya Chowdhury, who has been working for the good of the society with utmost confidence, has been elevated to the post of President of the Supreme Court. Nava Malletiga sincerely wants to make a special mark for himself as President of TANA in the history of the world and to stand as an ideal for future generations.

Thanks to Google

         


11, డిసెంబర్ 2021, శనివారం

ఏక్ తారలు..!!

 1.  ఆత్మీయ పలకరింపు చాలు_ఆకాశమంత ఆనందం పంచడానికి..!!

2.   తడబాటు తప్పటగులే అన్నీ_కాలమిచ్చిన నజరానా కన్నీళ్లనుకుంటూ..!!

3.  కలల వరాలే కొన్ని_అందని ఆకాశాన్ని అరచేతిలో పెడుతూ..!!

4.   కథలన్నీ కాలానికెరుకే_ముగింపు తెలియనిది మనిషికే..!!

5.   పదము పదమూ పేర్చుతునే వున్నా_మనోఫలకాన్ని తెలపాలని..!!

6.  కనుమరుగయ్యా_కల’వరించని కనుపాపల్లో..!!

7.   యుగాల నిరీక్షణకు సమాధానం_నీలో నేనుగా నిలిచిన క్షణాలు..!!

8.   పంచుకున్న జ్ఞాపకాలివి_పెంచుకున్న బంధానికి సాక్ష్యంగా..!!

9.    ఉనికి ప్రశ్నార్థకమౌతూనే వుంది_ఏ కాలంతోనూ సంబంధం లేనట్టుగా..!!

10.   మనసు రాగం మౌనవించింది_కనుకొలుకుల్లో తారాడుతూ..!!

11.   పిలుపు వినబడని మనోధ్యానమది_తలపులన్నీ నీవైన క్షణాలలో..!!

12.   పిలుపుకందని ధ్యానమది_మది మౌన సరస్సులో నీ ప్రతిబింబమై..!!

13.  విశేషముందని చెప్తోందో సశేషం_అణువులో బ్రహ్మాండాన్ని నింపుతూ..!!

14.  మనిషికిదో మాయజాతర_అల్లుకున్న పాశాలను విప్పుకోలేక..!!

15.  చూడనిదంటూ ఏముంది_కడలి కన్నుల్లో కాపురముంటుంటే..!!

16.   బీటలు బారింది మబ్బులు కాదు_ముక్కలౌతున్న మనసు నకలది..!!

17.   స్వప్నాలకు సమయం తెలియలేదట_రెప్పల మాటున కొలువు దీరినందుకు..!!

18.  ఎన్ని పున్నములను చూసానో_విరిసీ విరియని నీ చిరునవ్వుల్లో..!!

19.   భరించడమూ ఇష్టమే_నీ తలపుల తీయదనాన్ని..!!

20.  కాలం పలకరించెళిపోయింది_మన మధ్యన మౌనం రాజ్యమేలుతోందని..!!

21.   గాటిన బడుతున్నాయి మనసులు_కాలానికి అలవాటు పడుతూ..!!

22.   పాత రెక్కలనే అటుఇటా పేర్చుతోంది_కోల్పోయిన జ్ఞాపకాలను వెదుకుతూ..!!

23.   కొన్ని పరిచయాలింతే_చిత్రంగా చేరికవుతూ..!!

24.   చుట్టేసిన శూన్యంతోనే బంధాలన్నీ_ఆది అనంతాల కలబోత మనసైనప్పుడు..!!

25.   చీకటి కాగితంపై వెలుగు రేఖలు_కలం చెక్కిన కాలపు అక్షరాలు..!!

26.   అదేంటో దూరమెప్పుడూ దగ్గరే_తీరం చేరని అలలా..!!

27.  గుప్పెడు గుండెకెంత ధైర్యం కావాలో_జ్ఞాపకాల అర తెరవాలంటే..!!

28.   వెలుతురు కలగా ఉదయించు_చీకటి కాన్వాసుపై..!!

29.   అలకదీర్చు అక్షరాలివి_చీకటి చుట్టానికి వెలుతురు తాయిలమందిస్తూ..!!

30.   మాటలెందుకో మన మధ్యన_రాయబారమక్కర్లేదంటూ..!!

10, డిసెంబర్ 2021, శుక్రవారం

జీవన మంజూష జనవరి 2022

నేస్తం,

          ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం. మహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందో గమనించండి. తనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధి చేయమన్నాడట. దాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదా. ఎంత సంపాదించినా, విశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేము. ఉత్తి చేతులతో వెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకి వుంచి సమాధి చేయమన్నాడు

      మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయ పడుతూనే వుంటాం. అవసరాలకు డబ్బులు కావాలి. కాని మన అవసరమే డబ్బుగా మారిపోయింది ఈనాడు. ప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయింది. నైతిక విలువలు నశించి పోతున్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకుని మర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోంది. ఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్న అనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.

        ఒకే ఇంటిలో ఉంటున్నా, అపరిచితులుగా భార్యాభర్తలు, పిల్లలు మిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోంది? కుటుంబ సంబంధాలలోనా! ఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనా! లేదా మూలాలను మరచి, అందలాలను అందుకున్న మనిషి ఆలోచనలదా! ఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతిని సాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాం. కనీసం హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారు. ప్రపంచంలో ఎవరినో మనముద్దరించనక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగా మిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు

        ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తడబడి తడబాటుకు గురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమో, మనిషి సాయమో చేయగలిగితే చాలు కదా..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner