సంకల్పం గొప్పదైతే అది సానుకూలమవడానికి మానవ ప్రయత్నానికి దైవమూ సహకరిస్తుందని చరిత్ర చెప్పిన విషయం. ఓ మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఆ మనిషి పెరిగిన వాతావరణం, కుటుంబ మూలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విద్యావంతులైన తల్లితండ్రుల పరిరక్షణలో, బాబాయి పిన్నిల సంరక్షణలో పెరిగి ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా, అత్యున్నత పదవినలంకరించినా, తాను పుట్టిన మూలాలను మరిచి పోకుండా పుట్టిన ఊరికి, తానున్న అమెరికాలోకి భారతీయులకు తన సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలందుకుంటున్న తానా అధ్యక్షుడు శ్రీ లావు అంజయ్య చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు.
కృష్ణాజిల్లా పెద అవుట్ పల్లిలో లావు సాంబశివరావు, శివరాణి దంపతులకు జన్మించిన లావు అంజయ్య చౌదరి తండ్రి ఉద్యోగ నిమిత్తం బాబాయి, పిన్ని లావు రంగారావు, కోటేశ్వరమ్మల దగ్గర చిన్నతనంలో పెరిగారు. ప్రాధమిక విద్యాభ్యాసం గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ గౌతమ్ రెసిడెన్షియల్ కాలేజ్ లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ బళ్ళారిలోని విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లోనూ, ఎమ్ టెక్ గుల్బర్గాలోనూ పూర్తి చేసారు. తరువాత వివాహం, అమెరికా పయనం, ఉద్యోగం, పిల్లలు వగైరా బాధ్యతలతో సతమతమౌతున్నా కూడా తనలోని సేవా దృక్పధం నిలకడగా ఉండనీయలేదు. దాని పర్యవసానమే అంచెలంచెలుగా ఎదిగిన అంజయ్య చౌదరి లావు తానా అద్యక్ష పదవి.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ముందుగా ఉన్నతమైన మనసుండాలి. సమాజ హితం కోరుకునే మంచి మనసుతో పాటుగా, కష్టంలో వున్న పదిమందికి ఏ ప్రతిఫలం ఆశించకుండా సాయపడే గుణముండాలి. పదవులను, పేరుని, ప్రతిష్టను ఆశించకుండా తనకు చేతనైన రీతిలో పదిమందినీ కలుపుకుంటూ ఆపదలోనున్న వారిని ఆదుకుంటూ తన మంచి మనసును చాటుకున్నారు. పరాయి దేశంలో ఇబ్బందులు పడే వారి కోసం, అనుకోకుండా ప్రమాదాలకు గురైన వారిని వారి స్వస్థలాలకు చేర్చడంలో చాలా కృషి చేసారు.
ప్రతి ఒక్కరికి ఆహారం, విద్య, వైద్య సదుపాయాలు అందించాలన్న సదుద్దేశ్యంతో పలు సంస్థలతో కలిసి తన సేవలను విస్తృతపరిచారు. దశాబ్దం పైగా తన సేవలతో తానా సంస్థలో తానా టీమ్ స్క్వేర్ డైరెక్టర్ గా మెుదలుబెట్టి అనేక పదవులు అందుకుంటూ ఈనాడు తానా అధ్యక్షుడిగా ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఏకైక తానా అధ్యక్షుడు, మన తెలుగువాడు, కృష్ణాజిల్లా బిడ్డడు లావు అంజయ్య చౌదరి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఖరీదైన కాన్సర్ మహమ్మారి బారి నుండి సామాన్యులను ఆదుకోవడానికి, కాన్సర్ పై అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను అమెరికా, భారతదేశంలో తానా సంస్థ చేయడంలో ప్రముఖపాత్ర వహించారు. అన్ని రకాలుగా తన సొంత ఊరిని అభివృద్ధి చేయడంతో పాటు, పిల్లలకు, వికలాంగులకు, వృద్ధులకు అవసరాలకు సాయపడడంతో పాటుగా మరెన్నో ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా నిర్వహిస్తూనే వున్నారు.
ఉన్నత శిఖరం చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. సమాజసేవకు కుటుంబం కూడా సహకరించాలి. వీరి విజయం వెనుక కాకుండా వీరి విజయంలో జత కలిసిన సతీమణి నటాషా గొట్టిపాటి. కన్న తలిదండ్రులనే పట్టించుకోకుండా అనాధలుగా వదిలివేస్తున్న ఎందరో ప్రవాసులు, స్వదేశీయులుకు కనువిప్పుగా లావు అంజయ్య చౌదరి గారు తను పుట్టిన ఊరికి చేస్తున్న సేవలు చెంపపెట్టు. మెుక్కవోని ఆత్మవిశ్వాసంతో సమాజ హితానికి పని చేస్తున్న శ్రీ లావు అంజయ్య చౌదరిని అత్యున్నత తానా అధ్యక్ష పదవి వరించడం ప్రాంతాలకతీతంగా ప్రపంచ తెలుగు వారికందరికి గర్వకారణం. ప్రపంచ చరిత్రలో తానా అధ్యక్షుడిగా తనదంటూ ప్రత్యేక ముద్ర వేయాలని, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని హృదయపూర్వకంగా నవ మల్లెతీగ కోరుకుంటోంది.
Rare tribute to goodness "Tana presidency"
History has shown to humanity the true power of positive thinking. The environment in which a man grows up and family origins play a major role in shaping a man's personality. Heartfelt congratulations to TANA President Shri Lau Anjayya Chowdhury, who not only grew up in the care of his educated parents, but also in the care of his uncle's higher education, and despite his high rank, has not forgotten his origins, but has rendered his services to the Indians in his homeland, America.
Born to Lau Sambashivarao and Shivarani couple in Krishnajilla Peda Out Palli, Lauu Anjayya Chowdhury grew up as a child near Babai, Pinni Lauu Rangarao and Koteshwarammala for the sake of his father's job. He completed his primary education at Gannavaram St. John's High School, Intermediate Vijayawada Gautami Residential College, Electronics and Communications Engineering at Vijayanagar Engineering College, Bellary and M.Tech Gulbarga. Later, despite his marriage, travel to America, job, children, etc., his sense of service could not be sustained. The result was the gradual rise of Anjayya Chaudhary to the presidency.
To climb high peaks one must first have a high mind. In addition to a good mind that seeks the good of society, it should have the quality of helping ten people in need without expecting any reward. He expressed his good mind by supporting those in danger by combining ten in a conscious way without expecting positions, name and prestige. For those who are in trouble in a foreign country, a lot of effort has been put into repatriating those who have been accidentally injured.
He has expanded his services in collaboration with various organizations with the good intention of providing food, education and medical facilities to everyone. It is no exaggeration to say that Lavu Anjayya Chaudhary, the son of our Telugu, Krishnajilla, is the only TANA President to have received many accolades from around the world today as the TANA Team Square Director, beginning with his services as TANA Team Square Director for over a decade. TANA has been instrumental in launching a number of cancer awareness programs in the United States and India to help the general public recover from the costly cancer epidemic that is gripping the world. In addition to developing his hometown in all sorts of ways, he continues to run other service programs to help children, the disabled, and the elderly in need.
To reach the top peak you have to face many ups and downs. The family should also contribute to community service. His wife Natasha Gottipati, who was paired in their success, was not behind their success. Lau Anjayya Chowdhury's services to his hometown have been tarnished by the plight of many expatriates and natives who are left as orphans, ignoring their parents. It is a matter of pride for all the Telugus of the world, regardless of region, that Mr. Lau Anjayya Chowdhury, who has been working for the good of the society with utmost confidence, has been elevated to the post of President of the Supreme Court. Nava Malletiga sincerely wants to make a special mark for himself as President of TANA in the history of the world and to stand as an ideal for future generations.
Thanks to Google
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి