26, ఏప్రిల్ 2022, మంగళవారం

జీవన మంజూష మే2022

నేస్తం,

         జీవితంలో మార్పు సహజమేఅది వ్యక్తుల మీదవ్యవస్థ మీద  విధంగా ప్రభావంచూపుతుందన్నది మనకు తెలియదుకొన్ని మార్పులు సమాజ పురోభివృద్ధికితోడ్పడుతుంటేమరికొన్ని మార్పులు వ్యవస్థ మూలాలను దెబ్బ తీస్తున్నాయిఉదాహరణకుసాంకేతిక మార్పులు మనిషి బుద్ధికుశలతకు గీటురాళ్ళుగా మారుతుంటేపాశ్చాత్యఆధునిక పోకడలు మన కుటుంబ వ్యవస్థ మూలాలను దెబ్బ తీస్తోందిమనిషి విజ్ఞానంఅంతరిక్షానికి పయనిస్తుంటేమానవ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతోందీనాడుపూర్వకాలం విజ్ఞానం మనిషి వికాసానికి దోహదపడితేఈనాటి మేధస్సు అణుయుద్ధాలకుఆజ్యం పోస్తూసహజసిద్ధమైన ప్రకృతిని పరిహసించడమే కాకుండా , మానవజాతి వికృతచేష్టలకు సాక్ష్యంగా నిలుస్తోంది

     మితిమీరిన స్వేచ్ఛఅవసరానికి మించిన ధనం కొందరికుంటేఆకలి కడుపులఆక్రందనలు కొందరివియుగాలు మారుతున్నా  అంతరాలలో మార్పు లేదుఅలాగేఆడమగ మధ్యన అహంలో కూడా మార్పేం లేదురాతియుగం నుండి  ఆధునికయుగం వరకు ఆధిపత్యపు పోరు అలాగే ఉందిఅది కుటుంబ పరంగానైనాసామాజికపరంగానైనారాజకీయ పరంగానైనా అధికారం పెత్తనం చెలాయిస్తూనే వుందివిలువలతోబతికేవారికి  సమాజమిచ్చిన బిరుదు చేతగానితనం చేతగానితనమే కొందరి పాలిటవరంగానూమరికొందరి పాలిట శాపంగానూ మారిపోయింది

           మతాన్నోకులాన్నో ద్వేషిస్తే మనకేం ఒరుగుతుందిఅదే వాటిలో మంచిని మనంగ్రహించ గలిగితే మరో నలుగురికితద్వారా సమాజానికి కాస్తయినా మేలుచేసినవారమౌతాముఈమధ్యన మతద్వేషం బాగా ప్రబలిపోతోందిమనకు రాయడంబాగా వచ్చని మన భారతీయ సనాతన ధర్మాలనుపురాణఇతిహాసాలను ఇష్టంవచ్చినట్టుగా అవహేళన చేస్తూఅదే తమ గొప్పతనంగా భావిస్తున్నారు కొందరుమనకుఅమ్మ నేర్పిన సంస్కారాన్ని మర్చిపోతున్నామని గుర్తించకుండాపనికిమాలిన సమూహాలునెత్తికెత్తుకుంటున్నాయని గొప్పలు పోతున్నారుఇలా కులమతాలను అవహేళన చేయడంవలన మీకు ఒరిగేదేమిటిమీ చదువు నేర్పిన విజ్ఞత ఇదేనామనం ఒకటి అంటేఎదుటివారు నాలుగు అనగలరు అన్న విషయం మర్చిపోతే ఎలా!

            సెక్షన్లుచట్టుబండలు మనకే తెలుసునన్న అహంకారంతో విర్రవీగితే అన్ని సెక్షన్లుమనకన్నా బాగా తెలిసిన అజ్ఞాతశక్తి ఒకటుందిమనకన్నా బాగా రాయడం  శక్తికితెలుసుమనం నమ్మినానమ్మకున్నా మన అహానికి విరుగుడు  శక్తి ప్రయోగిస్తుందిఅవార్డులురివార్డులు కొందరికి ఎలా వచ్చాయన్నది అందరికి తెలుసుకనీసంవాటికయినా విలువనిచ్చి మీ రాతలను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించండికాదూకూడదు మేమిలాగే రాస్తామంటే మూల్యం చెల్లించక తప్పదుమార్పు మంచికోసమవ్వాలి కాని నలుగురు మనల్ని అసహ్యించుకునేలా మన రాతలు ఉండకూడదన్నసత్యాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదివ్యక్తులుగా మీకున్న విలువమిగులుతుంది.




23, ఏప్రిల్ 2022, శనివారం

గుర్తుకొస్తున్నాయి పుస్తక సమీక్ష..!!

మా ప్రసాద్ బాబాయ్ పుస్తకం “ గుర్తుకొస్తున్నాయి ” ఆవిష్కరణ సందర్భంగా నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు రాసుకున్నా. కాని అక్కడ అప్పటికి అనిపించిన మాటలే చెప్పేసాను…నేను మాట్లాడటం చాలా తక్కువ. సాగర్ శ్రీరామ కవచం అంకుల్ యాతన పుస్తకానికి, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంకుల్ వాకిలి తెరవని వాన పుస్తకానికి నాలుగు మాటలు మాట్లాడాను. పుస్తక సమీక్ష చేయడం ఇదే మెుదటిసారి…

నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు ఇక్కడ మీ అందరి కోసం…

సభకు నమస్కారం.

ముఖ పుస్తకం ఎవరెవరికి ఏమేమి చేస్తోందో నాకు తెలియదు కాని నా వరకు నాకు ఎందరినో ఆత్మీయులను, ఆత్మబంధువులను ఇచ్చింది. అలాంటి ఆత్మబంధువులలో ఒకరు మా డాక్టర్ ప్రసాద్ బాబాయి. నా రాతలను సదా ప్రోత్సహిస్తూనే వుంటారు. వారి పుస్తకాన్ని సమీక్షించడం నా శక్తికి మించిన పనే. అయినా శ్రీమతి రావి శారద గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇలా మీ అందరి ముందుకు వచ్చాను.


“ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం గురించి నాలుగు మాటలు…..

       శూన్యంతో సహవాసమూ మంచిదే అని చెప్పడానికి ఓ గొప్ప సాక్ష్యమే డాక్టర్ డి ప్రసాద్ గారు రాసిన “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం. 

182 పేజీలతో 101 భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం గురించి చెప్పడానికి నాకున్న అర్హత సరిపోదు, కాని ఈ పుస్తకాన్ని చాలాసార్లు చదివిన అనుభవంతో ఓ నాలుగు మాటలు మీ అందరితో చెప్పాలనే ఈ చిన్న ప్రయత్నం. 

అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్తమమైనదని మన పెద్దలు చెప్పిన మాట. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం మన డాక్టర్ ప్రసాద్ గారు. తన చిన్నతనం నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో రాసారు. 

     ప్రతి మనిషికి మంచో చెడో ఏదైనా కానివ్వండి జ్ఞాపకాలన్నవి సహజమే. కొందరు వాటిని అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు ఏదోక సమయంలో నలుగురితో చెప్పేస్తారు. ఆ ఒకానొక సమయమే కరోనా రూపంలో ప్రసాద్ గారితో శూన్యంతో స్నేహం చేయించి, పాత కాలంనాటి మనకు తెలియని ఎన్నో సంఘటనలను మన కళ్ళ ముందుంచింది “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకంగా.

     నిదురలో తాతయ్య కలతో మెుదలైన చిన్ననాటి జ్ఞాపకాల కబుర్ల నుండి చదువు, ఆటలు, పాటలు, నాటకాలు, గురువుల నుండి నేర్చుకున్న మంచి సంగతులు, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నాన్న చేసిన ప్రయత్నాలు, మారిన ఊర్లు, తమ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అమ్మానాన్న చేతుల మీదుగా వేడుకగా జరగాల్సిన సీతారాముల కళ్యాణం, నాన్న హఠాన్మరణంతో మోపలేని దుఃఖంతో సొంత ఊరికి పయనం, అదే సమయంలో వ్యాపారంలో నాన్న స్నేహితుని మోసం ఇలా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు మన మనసులను తడుతూ, మన జ్ఞాపకాలనూ గుర్తు చేస్తాయి. పొలాలు, పంటలు, చెరువు, కాలువలు, గేదలు ఇలా చిన్ననాటి తీపి జ్ఞాపకాల గుభాళింపులు బోలెడు ఈ పుస్తకంలో ఉన్నాయి. వేరుసెనగ మెుక్కలను కాయలతో కాల్చి, ఆ కాయలు తినడమనే అనుభూతి, అలా తిన్నవాళ్ళకే తెలుసు. ఇలా సహజసిద్ధమైన పల్లెటూరి తినుబండారాలు అన్నీ గుర్తుకొచ్చాయి ఈ పుస్తకం ద్వారా. 

       హైస్కూల్ చదువు, విహారయాత్ర విశేషాలు, తర్వాత లయోలా కాలేజ్ లో చదవడం, తర్వాత తనకిష్టమైన వెటర్నరీ డాక్టర్ కోర్సు కోసం తిరుపతిలో అప్లై చేయడం, చదవడం, స్నేహితులతో సరదాలు, టూర్లు, స్నేహితుడి పెళ్లికి వెళ్తూ, జేబులో డబ్బులు పోగొట్టుకోవడం వంటి కబుర్లు, తాను కలిసిన పెద్దల వివరాలు, చరిత్రలోని గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి వంటి పెద్దలు, ఇందిరాగాంధీ గారి జీవిత విశేషాలు, ఆమె చివరి ప్రసంగ వివరాలు, ఆమె మరణం గురించి, కాకాని వెంకటరత్నం గారు, వావిరాల గోపాల కృష్ణయ్య గారు, పిన్నమనేని కోటేశ్వరరావు రావు గారు, ప్రసిద్ధ రచయిత మో గారు ఇంకా తాను కలిసిన  ఇతర రాజకీయ నాయకుల గురించి చాలా బాగా రాసారు. ఉద్యోగ అనుభవాలు, నిజాయితీకి దక్కిన గౌరవాలు, ట్రాన్స్ఫర్ల మీద తిరిగిన ఊళ్లు, పిల్లల చదువులలో ఒకే సంవత్సరం మారిన నాలుగు స్కూల్స్, కోళ్ళఫారమ్ లో కోళ్ళు మాయమవటానికి అక్కడి కాపలా అతను అనుకుని అతనిని ఉద్యోగం నుండి తీసేయబోతే, అతని మీద నమ్మకంతో కోళ్ళు మాయమవడానికి ఎలుకలు కారణమని కనిపెట్టి, వారి కుటుంబానికి అండగా నిలబడటం, వెనుక వీరి “ కనబడేదంతా నిజమూ కాదు, ఒప్పుకున్నదంతా వాస్తవమూ కాదన్న నమ్మకమే. ఉప్పెన సమయంలో చేసిన సహ్య కార్యక్రమాలు, నోరు లేని జీవాల కోసం హాస్పిటల్స్ కట్టించడంలో తన వంతుగా సహాయ సహకారాలు అందించడం, వాటికి మంచి వైద్యం అందడం కోసం పడిన తాపత్రయం ఇలా చెప్పుకుంటూపోతే డాక్టర్ గారి మంచి పనులు బోలెడు ఈ పుస్తకం నిండా మనకు కనిపిస్తాయి. నీతి నిజాయితీలకు మరో రూపం డాక్టర్ ప్రసాద్ గారు.

       ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా పశు వైద్య సంబంధిత సందేహాలకు సమాధానాలు, రైతుల కోసం ఈనాడులో రాయడం వంటి రచనా వ్యాసంగాలతోపాటు అనేక కార్యక్రమాలు చేయడం, విజయ డైరీ మిల్క్ యూనియన్ లో పని చేయడం కూడా చేసారు. ఆత్మీయుల మరణ వార్త విని సొంత ఊరు వెళ్ళి వస్తూ గత జ్ఞాపకాలనెన్నంటినో పలకరించి వచ్చారు. 

“ మన ఊరు, మన మట్టి, మన గాలి అలాగే ఉంటాయి. మనమే వస్తుంటాం…పోతుంటాం. “. ఎం త నిజం ఈ మాట. 

      వీరి అబ్బాయికి పూణే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ కోసం వెళ్ళి అక్కడ తండ్రి లేని మరొకరికి ఇవ్వడం, తర్వాత మద్రాసుతో లో జాయిన్ చేయడం, అక్కడ మరో తమిళ్ డాక్టర్ గణేశ్ గారి పరిచయం, వారితో అనుబంధం వీరి మంచి మనసును తెలియజేస్తాయి. ఇక స్నేహం విషయానికి వస్తే వీరి స్నేహనుబంధం షష్టిపూర్తి దిశగా పయనిస్తోంది. యూరపు, అమెరికా, కెనడా దేశాలను సందర్శించి అక్కడ తాను చూసిన ప్రదేశాలను,అనుభూతులను కూడా చాలా బాగా వివరించారు ఈ పుస్తకంలో. 

          అనుబంధాలకు, అభిమానాలకు ఆనాటి తాతల తరం నుండి ఈనాటి మనుమల తరం వరకు వీరి కుటుంబ సంబంధాలే సాక్ష్యం. చాలా సాదా సీదాగా కనిపించే డాక్టర్ ప్రసాద్ గారు శూన్యాన్ని చైతన్యవంతం చేసేసి  తన జీవిత అనుభవ సారాన్ని, సమాజ పోకడలను, పరిసరాలను, పరిస్థితులను కూలంకషంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎన్ని ఒడిదుడుకులెదురైనా మెుక్కవోని ఆత్మవిశ్వాసంతో మూగజీవాల కోసం నిరంతరం శ్రమించారు. వీరి కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి అనడం కన్నా ఆ అవార్డులకే వన్నె వచ్చిందనడం సబబు. 

         ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివితే మన జ్ఞాపకాలను కూడా మరోసారి వెమరువేసుకోకుండా ఉండలేము. మా హింది టీచర్ రత్నకుమారి గారు అన్నట్టు “ ఓ చెడు ఓ మంచి కోసమే “ అని మరోసారి నిరూపితమైంది ఈ “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం ద్వారా. ఇంత బాగా రాసిన డాక్టర్ ప్రసాద్ గారికి శుభాభినందనలు. ఈ పుస్తకం వెలుగులోనికి రావడానికి సహకరించిన తెర వెనుక పెద్దలు రావి దంపతులు జయలక్ష్మి నారాయణ. శారద గార్లకు మనఃపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ సదవకాశమిచ్చిన శ్రీమతి రావి శారద గారికి కృతజ్ఞతలు. 

        

ఫోటోలు తీసి వెంటనే పంపిన వసుధారాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

సంపాదకీయం

సంపాదకీయం

జీవితంలో మరిచిపోలేని సంఘటన ఏమిటని ప్రభాకర్ జైనీ గారు అడిగారు. బహుముఖ ప్రజ్ఞావంతులైన డాక్టర్ ప్రభాకర్ జైనీ గారి అక్షరాల సంపాదకత్వంలో, ప్రముఖ కార్టూనిస్టు, చిత్రకారులు మూధవన్ గారి చేతిలో రూపుదిద్దుకున్న ఈ వారం సినీవాలి ఆన్ లైన్ వారపత్రికపై నా చిత్రం రావడం నా జీవితంలో అపురూప క్షణాలే. 
       నా తెలుగును హేళన చేసిన ఎందరికో ఇది నా సమాధానం. ఊహ తెలిసిన నాటినుండి పుస్తకాలు చూడటం, చదవడం అలవాటైన నాకు ఇలా నా చిత్రం ముఖచిత్రంగా రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా వుంది. ఈ అరుదైన కానుకనిచ్చిన తెలుగుభాషకు, డాక్టర్ ప్రభాకర్ జైనీ గారికి, మాధవ్‌ని గారికి, రాజా రామ్మోహన్ గారికి, నా ఆత్మీయులకు, నా అక్షరాలను అభిమానించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

విజయ సమీక్ష కాలం వెంబడి కలానికి

“ కొన్ని బంధాలు గతజన్మ సంబంధాలనుకుంటా…” 

ఈ ప్రేమరాక్షసితో నా అనుబంధం కూడా అలాంటిదే…నా “ కాలం వెంబడి కలం “ పుస్తకానికి తన అనుభూతిని ఎంత బాగా చెప్పిందో చూడండి. థాంక్యూ…..సోమచ్ విజయా😍😍 Vijaya Lakshmi


కాలం వెంబడి కలం మదిమదిని కదిలించే (మంజు)మాయాజాలం.


అమ్మచేతి స్పర్శలా అనిపించింది కాలంవెంబడి కలం పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే....కనులు ఆగలేదు చదువుతుంటే, మనసు మాత్రం ఒక్కోచోట చాలాసేపలాగే ఆగి ఆగి ముందుకు వెళ్ళింది.గతాలు అందరివీనూ,అక్షరాలూ అందరివీ.స్వగతాక్షరాలుగా మారేవి మాత్రం కొందరివే.గతాన్ని వర్తమానంతో కలబోసి భవిష్యత్ తో ముడివేసి ఒక బలమైన పునాదిని జీవితమిచ్చిన అనుభవాలతో ఏర్పరుచుకోవటం ఎలాగో ఈ కాలం వెంబడి కలం లో మనకు  కనిపిస్తుంది.

జీవితానుభవాలు రాయాలంటే చాలా చాలా ధైర్యం కావాలి.అందులోనూ మహిళలు తమ తమ స్వగతాన్ని రాయాలంటే ఎంతో నిబ్బరత స్ధైర్యం ఉంటేనే అది వీలవుతుంది.కవితాలయంలో మంజూగారి కాలం వెంబడి కలం వారం వారం చదివేటప్పుడు చాలా సార్లు అనిపించేది అమ్మో ఎలా రాస్తున్నారు ఇలా అని.అడగాలంటే అర్హత సరిపోదనిపించింది.ఒక ఆరునెలల తర్వాత మా మధ్య ఏర్పడిన అక్షరానుబంధ చనువుతో ఓసారి అడిగేసాను.మేడం,ఇలా అందరి పేర్లతో సహా వ్యక్తులను,వ్యక్తిత్వాలను బాహాటంగా రాస్తున్నారు... ఎవరూ మిమ్మల్ని ఆక్షేపించటం లేదా తిట్టడం లేదా దూరమవటం లేదా..మీకు భయమేమీ అనిపించటం లేదా అని.ఒక్కమాటే అన్నారు. "అవన్నీ నిజాలు.నిజాలు రాయటానికి భయమెందుకని."...నిజమే...నిజాలే అవి.కానీ నిజాలను నిజంగా నిక్కచ్చిగా రాయాలంటే చెప్పాలంటే అది అందరికీ చేరుతుందా మేడం అంటే... చేరేవాళ్ళకు చేరుతుంది మారేవాళ్ళు మారతారన్నారు.

                 అందరికీ తెలిసిన లోకరీతే...ఎదుటివారిని అనటం ,మనమెలాగున్నా మనలో లోటుపాట్లు ఎన్నున్నా.

ఎవరినో అన్నా కూడా నన్నేనేమో అనుకొనే బూడిద గుమ్మడికాయ చందా మనుషులు కోకొల్లలు. అలాంటి వారి స్పందనలకు ప్రతిస్పందనలకు నెరవకుండా వారి మనసు అనుభవాలను రాయటం మంజూగారికి సుసాధ్యం అయింది.

పుస్తకం ఆసాంతం ఒక జీవితమలా కళ్ళముందు కదలాడుతూ చాలా సార్లు కన్నీటి చెమరింతను, ఇంకొన్ని సార్లు పెదాలపై చిరునవ్వు ని అందించేసింది.గుండె భారమోతూ అంతలోనే తేలికయింది.

మంజూగారి జీవితానుభవాలను కానీ వాస్తవ సంఘటనలనుగానీ ప్రస్తావించే అర్హత వయసు లేదు నాకు. అందుకే పుస్తకం చివరిలోని ఒక్కపేరాను మాత్రం ప్రస్ఫుటంగా చెప్పదలుచుకున్నాను.ఈ కొన్ని లైనులు చదివి అర్ధం చేసుకుంటే చాలు కాలం వెంబడి కలంలోని ఆంతర్యం అందరికీ చేరినట్టే.

""జీవితం ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంత ప్లాన్ ప్రకారం బతికేద్దామన్నా మన చేతిలో ఏదీ ఉండదు. సమస్య లేని జీవితమూ లేదూ అలా అని ప్రతి సమస్యా పెద్దదీ కాదు. సమస్యకు భయపడకుండా బతకడం మనం అలవాటు చేసుకోవాలంతే. ఏ సమస్యా లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంటే కూడా బావుండదు కదా. పెద్దలన్నట్టు జీవితం సప్త సాగర గీతం. గెలుపోటముల సంగమం. భయపెట్టే సునామీలూ ఉంటాయి. ఆహ్లాదపరిచే అలల ఆనందాలూ ఉంటాయి. చీకటి వెలుగుల సయ్యాటే జీవితం. జీవితంలో ప్రతి పరిచయం ఓ అనుభవ పాఠమే మనం నేర్చుకోవాలంతే. మంచి చెడుల సమతూకం మనకు తెలియాలంతే. కాదూ కూడదంటే మనం ఏకాకుల్లా ఎడారి జీవితాలకు అలవాటు పడిపోవాలంతే.""""

ఎంత బాగా చెప్పారు కదా.సమస్యలు అందరీవీనూ పరిష్కారం దిశలో వెళ్ళగలిగే వారు కొందరే.ఎదురొడ్డి  నెగ్గుకొచ్చి నిలబడేవారింకొందరు.కష్టాలు కలతలు కడగండ్లంటూ కుమిలేవారు మరికొందరు.అన్నింటికీ కావాల్సింది మనోఃనిబ్బరత స్ధైర్యం. అది కోల్పోతే జీవితం సంద్రాన మునకే.తెలుసుకుంటే సప్తసాగరగీతమే.

శుభాభినందనలు మంజూమేడం ఒక్కరొక్కరుగా కనిపించిన బంధాల దారపు పోగులను చివరకు చక్కటి అనుబంధపు తాడుగా పేని మీ వ్యక్తిత్వాన్ని ఇంకా గొప్పగా మలచుకున్నందుకు.

..............ప్రేమతో మీ విజయ.


21, ఏప్రిల్ 2022, గురువారం

జీవన మంజూష ఏప్రియల్

నేస్తం,

          కష్టం మనది కానప్పుడు మనమంతగా దాని గురించి పట్టించుకోము. అదే బాధ మనదైనప్పుడు ఎవరో రావాలి, సాయమందించాలని ఎదురుచూస్తాం. ఎదుటివాడి కష్టం మనకు చేరనప్పుడు మన బాధ వారెవరైనా తీర్చాలని అనుకోవడం సబబు కాదు కదా! రోజులెప్పుడూ ఒకేలా వుండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతూ వుంటాయి. మన పెద్దలు ఎప్పుడో చెప్పనే చెప్పారు కదా లక్ష్మీదేవి చంచల స్వభావురాలని. అందుకనే ఆవిడ చోట స్థిరంగా వుండదు ఎప్పుడూ. ఈరోజు మనింట్లో వుంటే రేపటి రోజున మరొకరింట్లో వుంటుంది. ఇప్పుడు మనతో లక్ష్మీదేవి వుంది కదా అని మనం మనిషితనాన్ని మర్చిపోతున్నాం

          పొదుపు, దుబారా వలన కొంతమంది మనుష్యులకు విలువనిస్తూ వుంటారు. నువ్వేదో పొదుపరివని, ఇతరులు ఖర్చుదారులని అనుకుంటే పొరబాటది. ఎవరి అవసరాల ప్రాముఖ్యత వారిది. నీకు నీ వరకు నీ కుటుంబం బావుంటే చాలనుకుంటే సరిపోదు. కుటుంబమంటే భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. వారితో అనుబంధమున్న పెద్దలు కూడా మన కుటుంబమే అని గుర్తుండాలి. ఈరోజు మనం సంపాదిస్తున్నామని అహం ప్రదర్శిస్తే, సంపాదన వెనుక మన అమ్మానాన్నల కష్టం ఎంతుందో గుర్తుకే రాదు. పిల్లలను పెద్దవారిని చేయడంలో అమ్మానాన్నల బాధ్యతెంతుందో, అపరవయసులో వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు అంతే వుంటుంది. రక్త సంబంధాలు కూడా అవసరాకు మాత్రమే అనుబంధాలుగా మారిపోయాయి ఈనాడు

             కొన్ని రోజులు అందలాలెక్కామని సంతోష పడితే సరపోదు. ఆనందం కలకాలం అలాగే వుండదని గుర్తెరగాలి. చాలామంది అనుకుంటారు తమ పెంపకం చాలా గొప్పదని. తల్లీదండ్రి తమ పిల్లలు తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవాలని కాని, ఇంటి నుండి పిల్లలు వెళిపోవాలని కోరుకోరు(ఇది తలిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది). విషయంలో ఎవరూ చెడ్డవాడు కాదు. వారి వారి చుట్టూ వున్న పరిస్థితుల ప్రభావం. సంఘటనలలో ఇతరులు తామేదో గొప్పవారన్నట్టుగా అనుకుంటూ, వీరిని హేళన చేస్తుంటారు. ఈరోజు ఇంటి సంఘటన రేపు మన ఇంటిదే కావచ్చునేమోనన్న ఆలోచన క్షణ మాత్రమైనా రాదు. ఉద్యోగాలు చేయండి. ఊళ్లు ఏలండి కాని కనీసం మనిషిగా ఆలోచించండి. నోరుంది కదాని మాట తూలకూడదు. మనకి పిల్లలున్నారుగా. అదే బాధ రేపు మన ఇంటి తలుపు తడితే మన స్థితి ఏమిటన్నది కాస్తయినా ఆలోచించాలి కదా. మనం పిల్లల్ని మాత్రమే కనగలం వారి నుదుటిరాతను రాయలేం

            తెలివిగలవారు తమ పిల్లలు తప్పు చేసినా సమర్థించుకోగలరు. కొందరు ఏమి లేకపోయినా కుటుంబాన్ని అల్లరి చేసుకుని, తామే అందరికి చులకన అయిపోతారు. మన అనుకున్నవారే హేళన చేయడంలో ముందుంటే, మనసు బాధను పంచుకోవడానికెవరు లేక మానసికంగా కుంగిపోతూ, శారీరక అనారోగ్యాల పాలౌతున్నారు ఎందరో. ()హింసావాదులూ, మానవతామూర్తులు మీకో విన్నపం. ఎదుటివారి కష్టంలో మీరు పాలుపంచుకోనకపోయినా పర్లేదు కాని వారిని మీ మాటలతో, చేతలతో మానసికంగా హింసించి బతికున్న శవాలుగా మార్చకండి. మీ బంధం డబ్బుతోనే ముడిబడిన వుందని అందరు అలానే వుండరు. డబుతోనే అన్నీ దొరుకుతాయన్న భ్రమను వీడండి. కాస్తయినా మనిషిగా ఆలోచించండి



11, ఏప్రిల్ 2022, సోమవారం

అనుబంధాల విలువలు..!!

“ కొన్ని సంతోషాలకు వెల కట్టలేము

కొన్ని పరిచయాలు గతజన్మ సువాసనలు

అలాంటి పరిచయమే ఈజన్మలో మాది…”


మా బాబాయి రాకతో నిన్నటి సాయంత్రం సంతోషంతో నిండిన మా మనసులు…ఫోటో తీసుకోవడం కూడా మర్చిపోయాను😍

థాంక్యూ సోమచ్ బాబాయ్…


అమృత ధారలు కురిసిన వేళ:

           ...............

1957...... శ్రీరామ నవమి రోజు..

   నాన్నగారు హఠాత్తుగా కాలం చేసిన రోజు...

అప్పటినుండి ప్రతి సంవత్సరం ఆ రోజంతా నిర్వేదంగా విషాదంగా నిర్లిప్తంగా గడిపేయటం అలవాటయిపోయింది...

నిన్న అదే పరిస్థితిలో ఉండగా మంజూ మెసేజ్...

"బాబాయ్ మీ ఇంటి అడ్రెస్ చెప్పండి అర్జంట్ గా.."అని... చాలాసార్లు ఇలాగే జరిగింది.తను వస్తాననడం...నేను ఏదో రకంగా దాట వేయడం ...

నేను రెండుమూడు సార్లు ఏవో ఫంక్షన్లకు రమ్మనడం...తను తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాలేకపోవడం....

:లేదమ్మా నేను బయటకు వెడుతున్నాను ..' అని రిప్లయ్ ఇచ్చినా :ఫరవాలెదు..నేను వస్తాను' అని తన రిప్లై. అక్కడికీ ఫోన్ చేసి ఆపడానికి ప్రయత్నం చేసాను. తను" తగ్గేదేలే" అని డిక్లేర్ చేసింది.

ఇక తప్పక సాయంత్రం వస్తానని చెప్పాను..అట్లా అని వాగ్దానం తీసుకుంది.

సాయంత్రం ఆరుగంటలకు బయట చల్లబడి మలయ సమీరాలు, లోపల మనసులో మౌన సమీరాలు  వీస్తున్న వేళ మంజు అనబడే ఒక మహా కవయిత్రి ...రచయిత్రి ఇంట్లో అడుగు పెట్టాను...

గుమ్మంలో రాఘవేంద్ర, మంజు...ఇంట్లో మంజు నాన్న గారు,అమ్మమ్మ గారు,అమ్మగారు ఏంతో ఆప్యాయంగా ఆహ్వానించారు..

నాకెందుకో కొత్త చోటుకి వెళ్లామనే ఫీలింగే రాలేదు.

చాలా రోజులకు సొంత ఇంట్లోకి వెళ్లిన అనుభూతే కలిగింది. భావ సారూప్యతే మంజు నాన్న గారిని నన్ను క్షణాలలో కలిపేసింది.ఆయన గొప్ప సాహిత్యాభిమాని... వక్త...మానవతా వాది.

ఆమె తండ్రి మేధోసంత్తిని తల్లి మనిషితనాన్ని పుణికి పుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఇక ఆమె మొదటి పాఠకురాలు  అభిమాని ఆమె అమ్మమ్మ గారే నని విని ఆశ్చర్యపోయాను.

 ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకున్నామో....ఎన్ని అనుభవాలు పంచుకున్నామో .....గంటలు క్షణాలుగా...మారిపోయిన అనుభూతి..

          మరోసారి కలుద్దాం అని సెలవు తీసుకోబోయాను...."అప్పుడేనా.. బాబాయ్.." అని ఎంతో ఆశాభంగం తో కూడిన  భావనతో అంది మంజు..

"ఒక్క నిమిషం  ..." అని గబ గబా 

తను రాసిన  తొమ్మిది అపూర్వ పుస్తకాల అమృత  ధారలను నా దోసిట్లో కురిపించింది...ఎంతో ఆర్ద్రంగా... 

మంజు..మంజు యనమదల...తెలుగు అక్షర సరస్వతి....సాహిత్యాకాశపు ధృవతార..

డా. డి. ప్రసాద్.


.

4, ఏప్రిల్ 2022, సోమవారం

గుపెడు గుండె సవ్వడులు

Prasad Doddapaneni బాబాయ్ మీ ఆత్మీయతాక్షరాలు మాకు ఎనలేని ఆశీస్సులు🙏


గుప్పెడు గుండె సవ్వడులు....

........తిరుపతి వేంకట కవులు

          పింగళి కాటూరి       వంటి వుద్దండ జంట కవుల  వరవడిలో  ఈనాటి వర్ధమాన ఆధునిక జంట కవులు మంజు--వాణి లు ఆవిష్కరించిన "గుప్పెడు గుండె సవ్వడులు " సాహితీ ప్రియుల గుండెలలో మంజీర నాదాలు సవ్వడి చేస్తాయనటంలో అతిశయోక్తి లేదు.

రసతప్త హృదయుల గుండెలలో వియోగాలు , విరహాలు ,వేదనలు, నిర్వేదనలు ,పరివేదనల సంవేదనలు సృష్టించే అలజడులు ...కల్లోలాలు...  అత్యంత తీవ్రంగా ఉంటాయి....ముఖ్యంగా బుద్ధి జీవుల సున్నితమైన హృదయాలలో.....

సాధారణ వ్యక్తులను అవి అంతగా ప్రభావితం చేయ లేక పోయినా ,  మనిషితనం మూర్తీభవించిన కారణ జన్ములలో సాగర మధనం నుండి ఉద్భవించిన అమృతం వలె గొప్ప కవిత్వాలు ఆవిర్భవిస్తాయి...

అటువంటి అమృత  ధారలే 

మంజు వాణీల గుండె సవ్వడుల అక్షర మంజీర నాదాలు....

ప్రతి వాక్యం గుండెలో తాకుతుంది...అందరిలోనూ మానస వీణ ను తట్టి నవరసాల రాగాలను పలికిస్తుంది....

ఇది మంజు వాణి ల యజ్ఞ ఫలం..

 తాము కొవ్వత్తి లా కరిగి పోతూ సాహితీ లోకానికి అందించిన వెలుగు రేఖలు..

.... జంట నారీ మణులకు ఆత్మీయ అభినందనలు...

......ప్రసాద్.


మంచుపూలు పుస్తక సమీక్ష

మనసుపూలు మంచుపూలు..!


         “ తరిగే సమయంలో

            కరిగే జ్ఞాపకానివే…”

ఎంత అందమైన భావుకత ఇది. కవిత్వం రాయడానికి బరువైన పదాలు, సంక్లిష్టమైన సమాసాలు అవసరం లేదని పై వాక్యాలు బుుజువు చేస్తున్నాయి. సబ్బినేని పద్మజ దివిసీమలోని మారుమూల పల్లెటూరు నుండి వచ్చినా అందమైన పల్లెటూరు స్వచ్ఛమైన మనసును తన భావాలలోమంచుపూలుకవితా సంపుటిలో చూపించారు. “ హృదయ విపంచిగా తన కవిత్వపు అడుగులను మెుదలుబెట్టి మనసు పారదర్శకతను అక్షరాల్లోనికి ఒంపిమంచుపూలుకవితా సంపుటిని మన ముందుకు తీసుకువచ్చారిప్పుడు

         మోక్షానికి మార్గాన్ని తెలుసుకుని, దైవానికి ఆత్మ నివేదనగా తన మెుదటి కవితను ఆరంభించి మానవ భవబంధాల నుండి విముక్తిని కోరుతూ దైవత్వానికి, మానవజన్మకు మధ్యనున్న సన్నని అడ్డుతెరను చక్కని భావుకతతో చెప్పడంలోనే కవయిత్రి మనసు మనకు తేటతెల్లమవుతుంది. మోక్షానికి, విముక్తి కి మధ్యన మానవజన్మ ఊగిసలాటను కవితలుగా అక్షరీకరించారు. జీవితంలోని అన్ని అనుభవాల అనుభూతులను మంచుపూలుకవితా సంపుటిలో మనం చూడవచ్చు

            ప్రేమ, విరహం, ఆరాధన, మగువ అంతరంగాలు, ఆలోచనలు, కోరికలు, కోపాలు, ఆశలు, ఆశయాలు, ఆక్రోశాలు , అసహనాలు ఇలా మనిషి మనసులోని అన్ని పార్శ్వాలను అతి సుళువైన పదబంధాలలో తనదైన ఆత్మాశ్రయ శైలిలో అందంగా రాశారు. సమాజంలోని అసమానతలను, తరిగిపోతున్న మనిషి విలువలను కూడా మనకు గుర్తుచేసారు. తనలోని అమ్మనే కాకుండా, దేశభక్తిని, సైనికులపై తనకున్న నమ్మకాన్ని ఇప్పటి వరకు ఎవరూ పోల్చని విధంగా దైవంతో పోల్చి చెప్పడం అభినందించదగ్గ విషయం. తాను రైతుబిడ్డనని గుర్తెరిగి రైతు కష్టాన్ని అక్షరాలకు అందించారు. భావ కవుల ఆరాధనను, నిరీక్షణను, ప్రకృతి అందాలను, చందమామ, సూరీడులను, జ్ఞాపకాలను ఇలా అన్ని అనుభూతులను అక్షరబద్ధం చేసారు.

             వచన కవిత్వంలో వచ్చిన మంచుపూలుకవితా సంపుటి చదువరులకు పంటికింద రాయిలా కాకుండా స్వచ్ఛమైన మనసు భావాలను పంచుతుందని మనసారా కోరుకుంటూ..మరిన్ని మృదుభావాల భావకవితలు తన నుండి ఆశిస్తూ.. సబ్బినేని పద్మజకు హృదయపూర్వక అభినందనలు.


             


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner