నేస్తం,
అందలం ఎక్కాలన్నా, అధఃపాతాళానికి పడిపోవాలన్నా మనకు ఉండాల్సింది ఏముటన్నది తెలుసుకోవాలి ముందు. ఈ ప్రపంచంలో ఏ గుర్తింపుకైనా అర్హత అవసరమే. వ్యవస్థకు కావాల్సింది వ్యక్తిత్వమూ కాదు, విలువలు కాదు. వ్యక్తిగా గుర్తింపు అర్హతతోనే వస్తుంది. ఆ అర్హత ఇప్పుడు అధికారం, డబ్బు అనే వాటితో బలంగా ముడిబడి పోయింది. భజనకు పెద్ద పీట వేయడం, వారినే సంఘ సేవకులుగా గుర్తించడం, దశాబ్దాల తరబడి వారినే అందలాలు ఎక్కించడం, అధికారం మారినా అనుయాయుల పేర్లు మారకపోవడం అందరు గమనించదగ్గ విషయం.
మన సమాజంలో వున్న ఏ వ్యవస్థను తీసుకున్నా నిజమైన ప్రతిభకు గుర్తింపు తక్కువనే చెప్పాలి. మొన్నటికి మెున్న మా టివి వారి సూపర్ సింగర్ జూనియర్స్ లో ఫినాలే చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు బహుమతి మీకు నచ్చినవారికి ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయండి. దానిలో ఆక్షేపణలేం వుండవు. కాలంనాడు బాలు గారి పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో కూడా ఒకసారి ఇలానే మాకనిపించింది బ్లాగులో రాస్తే, ఆ తర్వాత ఎపిసోడ్లా లో ఆయన మమ్మల్ని తిట్టారు, కాని ఆ తర్వాత మరెప్పుడు ఆయనను వేలెత్తో చూపాల్సిన అవసరం ఎవరికి రాలేదు. ఫినాలే లో అందరికి ఒకే పాట ఇచ్చి వారు పాడిన దానిని బట్టి విజేతను నిర్ణయించవచ్చు కదా! నాకు కనీసం ఆ పాట పాడిన పిల్లవాడి పేరు కూడా గుర్తులేదు, కాని వాడు పాట పాడిన విధానం అంతా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే వుంది. నా మాట అబద్ధమనుకుంటే మీరూ ఆ పాటని విని అప్పుడు చెప్పండి. “ తాళికట్టు శుభవేళ “ పాట.
లాస్ట్ రౌండ్ లో పిల్లలకు వారిచ్చిన పాటలను బట్టే విజేత ఎవరో మనకు తెలిసిపోతుంది.
సంగీతమైనా, సాహిత్యమైనా, రాజకీయమైనా మరే ఇతర వ్యవహారాలైనా, విజేతలు ఎవరన్నది ఎంత పారదర్శకంగా వుంటుందో కొత్తగా మనమిప్పుడు చర్చించుకోవాల్సిన విషయమేం కాదు. మనకు తెలిసిన వాస్తవాలు అన్నీ. డాక్ట’రేట్లకు, పురస్కారాలకు ఉండాల్సి అర్హతలు మనకు తేటతెల్లమే కదా!
https://youtu.be/P5W_RaHFN0Y
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి