8, ఫిబ్రవరి 2026, ఆదివారం

వనజ గారి పోస్ట్




 మంజు యనమదల గారు పరిచయం అక్కర్లేని పేరు. అవనిగడ్డ లో తాను చదువుకున్న స్కూల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పూర్వ విద్యార్థిగా వుండి ఇప్పుడు ముఖ్య అతిథిగా వెళ్ళడం ఎవరికైనా సంతోషకరమైన విషయమే కదా! ఈ మధ్య నే తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ రాసాను. మరలా ఈ కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం కల్గింది. మంజు యనమదల గారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ..  ఆమె రచనా ప్రస్థానం గురించి .. వివరాలు.


ఆమె చదువుకున్నప్పుడు.. ఆ స్కూల్ పేరు “శిశు విద్యా మందిరం, అవనిగడ్డ” లో 2 నుండి 6 వరకు అక్కడ చదివారు. ఇప్పుడు అదే స్కూల్ “విద్యా విహార్” గా రూపాంతరం చెందింది. 


పేరు: మంజు యనమదల 

చదువు: ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. 

అమ్మానాన్న : యనమదల సుబ్బారావు సామ్రాజ్యం గార్లు 

అర్ధ భాగం: యార్లగడ్డ రాఘవేంద్ర రావు గారు 

పిల్లలు: మౌర్యచంద్ర, శౌర్యచంద్ర

   

మెుదటిగా ఆహ్వానం సాహిత్య పత్రికలో కవిత ముద్రితమైంది. 


2009లో ఏదో రాద్దామని “కబుర్లు కాకరకాయలు” బ్లాగ్ మెుదలుబెట్టాను అంటారు. అప్పటినుండి ఇప్పటి వరకు 2500 పోస్టులు రాశారు.. కవితలు, ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు, రెక్కలు, వ్యాసాలు ఇలా కొన్ని సాహితీ ప్రక్రియల్లో ఆమె రాతలు కొనసాగుతున్నాయి.. 


మంజు యనమదల గారి  ముద్రిత రచనలు


అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు (కవిత్వం)

సడిచేయని (అ)ముద్రితాక్షరాలు ( మంజు మనసు ముచ్చట్లు)

చెదరని శి(థి)లాక్షరాలు ( కవిత్వం)

గుప్పెడు గుండె సవ్వడులు (జంట కవిత్వం) (మంజు వాణి)

5.   అంతర్లోచనాలు ( మంజు మనసు ముచ్చట్లు)

6.   ఏ’కాంతా’క్షరాలు ( ఏక్ తారలు)

7.   అక్షర స(వి)న్యాసం (కవిత్వం)

8.   కాలం వెంబడి కలం..అక్షరాలతో అనుబంధం (స్వగతం)

9.   అక్షర విహంగాలు (రెక్కలు)

10. రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు (రెక్కలు) ( మంజు వాణి విజయ)

11. మూల్యాంకనం (కవిత్వం)

12. అవ్యక్తం(వ్యాసాలు)

13. అక్షరాలతో అనుబంధాలు(యనమదల వారి వంశవృక్షం)

14. జీవన మంజూష ( నవ మల్లెతీగలో ముద్రితమైన వ్యాసాలు )

15. గాలివాటం(రెక్కలు)


ఆమె రాతలకు మెచ్చి  ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు “కావ్యశ్రీ” పురస్కారాన్ని, 

సుధీక్షణ్ ఫౌండేషన్ వారు “ఉత్తమ కవయిత్రి” పురస్కారం,” గిడుగు పురస్కారం” అంతర్లోచనాలు పుస్తకానికి,

 “విశిష్ట పురస్కారం” కవితాలయం నుండి, 

లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ వారు “ఐడియల్ఉమన్ అవార్డ్ 2021” కి గాను అందించారు. ఆంధ్రాఆర్ట్స్ అకాడమీ మరికొన్ని సంస్థలు సంయుక్తంగా అందించిన “ 2021 ఉగాది పురస్కారం”, శ్రీశ్రీ కళాపీఠం వారి జాతీయ ప్రతిభా పురస్కారం తెలుగు తేజం, నారీరత్న(ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2024), మరెన్నో ఆత్మీయ సత్కారాలు లభించాయి.. మల్లెతీగ సాహిత్య మాస పత్రికలో జీవన 'మంజూ'షకాలం, గోదావరి వార్తా పత్రికలో బోలెడు పుస్తక సమీక్షలు, మనం, ఆంధ్రప్రభ, గో తెలుగు డాట్ కాం, ఆంధ్రా ప్రవాసి, రవళి, తెలుగు సంస్కృతి విశాఖ, ఇంకా మరెన్నో అంతర్జాల పత్రికలలో  రచనలు ప్రచురితం. 


క్రిందటేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ “ఉగాది పురస్కారం” లభించింది. 


23 జనవరి 2008న స్థాపించిన “ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నారు. 


ఇది మంజు యనమదల గారి రచనా ప్రస్థానం.


మంజు యనమదల గారికి అభినందనలు  శుభాకాంక్షలు అందిద్దాం..

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner