1. వద్దనుకునే
బంధాలు
విదిలించుకోలేని
పాశాలు
మనసు
సున్నితమైనది..!!
2. బాధ్యత
లేదు
బంధాలు
అవసరార్థమే
కొందరు
పరాన్నజీవులు..!!
3. ఆకాశంలో చుక్కలు
చూపడం సులువే
లెక్కలేయడమే
బహు కష్టం
నీటి మీది
రాతలు..!!
4. ఆట
ఆడాలి
వేట
కొనసాగించాలి
గెలుపుదే
పైచేయి..!!
5. మాటలు
తేనె చినుకులు
మనసులు
కందిరీగలు
నైజం
బట్టబయలు..!!
6. కలలెప్పడూ
నిదురలోనే
కలతలెప్పుడూ
మెలకువలోనే
తర్కానికి
దొరకవు..!!
7. నిన్నటి
గతం
రేపటి
జ్ఞాపకం
వాస్తవం
ఈరోజు..!!
8. పిలుపులు
పెట్టుబోతలు
స్థాయి
అవసరం
వ్యక్తిత్వం
ఆభరణం..!!
9. మనసు
దిగులు
కాగితాలకు
చేరింది
అక్షరం
ఆశ్రిత పక్షపాతి..!!
10. కోట్లకు అధిపతులు
కొందరు
మనిషితనమే
శూన్యం
కుసంస్కారానికి
వయసుతో పనిలేదు..!!
11. శుభ్రత
పరిసరాల్లో
అశుభ్రత
మనసుల్లో
ఆకాశ హర్మ్యాల
సంప్రదాయం..!!
12. నిత్య సంఘర్షణ
మిగిలేవుంది
నిరంతరాన్వేషణా
క్రమంలో
యాంత్రికతే
జీవనమిప్పుడు..!!
13. అవసరార్థపు
ప్రేమలు
ఆత్మీయతల
ముసుగులు
ఆంగికం
వాచకం సరితూగాయి..!!
14. పనికిరాని
వస్తువులు
పనికిమాలిన
మనుష్యులు
అసూయకు
పరాకాష్ట..!!
15. అహంకారం
స్వభావం
ఆధిపత్యం
అరకొరగా లభించేది
సంస్కారం
జన్మతః..!!
16. విలువైన
వజ్రాలు
రాళ్ళు
రప్పలు
స్థానబలిమితో
విలువ..!!
17. కొన్ని
అవమానాలు
గెలుపుకి
పునాదిరాళ్ళు
కాలమే
సమాధానం..!!
18. మనం
ఏంటన్నది
మన
ప్రవర్తన చెబుతుంది
ఋజువు
చావు..!!
19. బంధము
అనుబంధము
తోడు
నీడా
మన
మధ్యన..!!
20. మన
ఎదుగుదల
మనకి
ముఖ్యం
క్రియ
ఏదైనా సరే..!!
21. మనసు
లేకుండా
మనిషి
వుండడు
చావుపుట్టుకలు
సరితూకాలు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి