తెచ్చిపెట్టుకున్న నవ్వులు
పెదవంచున పలుకులు
ఈనాటి పలకరింతలు
రాబడి రాయబారాలు
లెక్కల పంచాయతీలు
అలవాటైన ప్రహసనాలు
రమ్మని పిలిచే ఆహ్వానాలు
ఆమాటునే పో పొమ్మనే చెణుకులు
స్థితిగతుల సత్సంబంధాలు
మర్చిపోయిన గతాలు
లేవనుకుంటున్న జ్ఞాపకాలు
చెరపలేని సాక్ష్యాల మిగులుతగులు
నటించేస్తున్న బాంధవ్యాలు
జీవించేస్తున్న జీవచ్ఛవాలు
ఇవే ఇప్పటి అనుబంధాలు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి