*ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత..*
******🌟🌟******
ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు చేయూత అందించారు.
ఆదివారం కోడూరు శివారు నరసింహపురం గ్రామంలో ట్రస్ట్ సభ్యులు యనమదల సుబ్బారావు ఏర్పాటు చేసిన సమావేశానికి డాక్టర్ మంతెన నరసరాజు, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణ , కోడూరు ఎస్సై చాణక్య ముఖ్య అతిథులుగా విచ్చేసి 11 మంది విద్యార్థులకు 5వేల విలువగల చెక్కులు అందజేశారు. మరో మూడు చెక్కులు కూడా అందజేసారు. ఈ
గత 19 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు "రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్" అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, కార్యదర్శి మంజు సహకారంతో ఆర్థిక చేయుత అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు" 372 మంది విద్యార్థులకు" ఈ సహకారాన్ని అందించినట్లు తెలిపారు.
ఎస్సై చాణక్య మాట్లాడుతూ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇలా ప్రతి సంవత్సరం ట్రస్ట్ తరుపున తోడ్పాటు అందించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.













0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి