15, డిసెంబర్ 2012, శనివారం

సంఘర్షణ...!!

ఎందుకలా వదిలేసి వెళ్ళిపోయావు...??
నచ్చలేదనా...!! అర్ధం కాలేదనా...!!
చెప్పాపెట్టకుండా అలా వెళిపోతే....ఎలా..!!
ఆద్రత తో దగ్గరకు తీసుకుంటావనుకుంటే...!!
అక్కరలేదని పోతున్నావు...!!
పక్కనే ఉన్నా దూరం బోలెడు....!!
అంతరమో...!! అహమో..!!
అడ్డుగోడగా ఉంది మధ్యలో..!!
మారని నేను..మారిన విలువలతో....నువ్వు..!!

నీ సాన్నిహిత్యం లో సన్నిహితం దూరమైంది నాకు...!!
అందుకే ఈ తెలియని అంతరంగపు సంఘర్షణ...!!

14, డిసెంబర్ 2012, శుక్రవారం

జీవిత పుస్తకం...!!

నాకు నేనే ఒక అర్ధం కాని వింత పుస్తకాన్ని...!! అలాంటప్పుడు ఎదుటి వారు నాకెలా అర్ధం అవుతారు..??
నేను వాళ్ళకెలా తెలుస్తాను...!! తెలియాలని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది..!!
నాలోనూ ఆవేశం..కోపం..ద్వేషం..బాధ..సంతోషం....ఇలా అన్ని భావావేశాలు ఉన్నాయి. ముఖచిత్రం బావుందని పుస్తకం తెరిస్తే ముందుగా ముందు మాటల్లో సంక్షిప్తంగా కాస్త తెలుస్తుంది మనసు తెలిసిన వాళ్లకి...!! ముందు మాటల్లో గొప్పగానే పొగడ్తలుంటాయి కాక పొతే అన్నీ నిజాలు కాదేమో...!! అలా అనిపించడానికి కారణం మన గురించిన నిజాలు మనకి తెలుసు కదా..!!
ఎంత మంచి పుస్తకమైనా అందరికి నచ్చాలని లేదు....అలానే పొగడ్తలకు చోటున్నట్టే విమర్శలకు స్థానముంటుంది...!! పుస్తకంలో మొదలు పెట్టిన ప్రతి పేజి బావుండాలనే అందరికి నచ్చాలనే అనుకుంటాము...కాకపొతే దేవుడే అందరికి మంచివాడు కాదు కదా....ఇక మనమెంత...!!
కొన్ని పేజీలు ఖాళీగా వదిలేద్దామని అనుకుంటే కుప్పలు తెప్పలుగా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాల పుటలు దొంతర్లుగా వచ్చి చేరతాయి....మరి కొన్నేమో మనం ఎంత అందంగా నింపుదామన్నా అలా ఖాళీగానే ఉండి పోతాయి ఎప్పటికి...!!
పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....!!
ఎంతో అందంగా మొదలైన  పుస్తకం లోని మొదటి పేజి అలా అలా పేజీలు పెరుగుతున్న కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ....కలల్ని...ఆలోచనల్ని..కాలంతో పాటుగా మోసుకుంటూ...మర్చిపోలేని పేజీలను దాచుకుంటూ...అక్కరలేని పేజీలను వదిలేస్తూ...అలా పయనిస్తూ చివరికి చివరి పేజీలోకి వస్తే.....!!
ఏముంది కధ సుఖాంతం...!! 

13, డిసెంబర్ 2012, గురువారం

గమనిక....!!



నిన్న నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన కవిత అపురూపం 12-12-12 12:12:12 కి.....
ఒక్కరు గమనించారు...సంతోషం...!!
అన్నట్టు ఆ టపా నా 350 వ టపా అండి...అబ్బో చాలా రాసేశాను కదూ....!!
ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు....!!

12, డిసెంబర్ 2012, బుధవారం

అపురూపం...!!

ఏమైందో ఏమో తెలియడం లేదు కాని...
నీతోనే ఉన్న నా మనసు నాతొ మాటాడనంది...!!
నాతొ అలుకో మరి..నేనంటే అ ఇష్టమో...!!
సరే అని నీతో పంచుకుందామంటే....
నీ మనసు నీ మాట వినదాయే....!!
అది నాదగ్గరుంది...!!
ఏమిటో...నేను నీ దగ్గర...!!
నువ్వు నా దగ్గరా....!!
మరి ఇద్దరం కలిసేదెన్నడో...!!

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఇదీ బావుంది....!!

చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో....
నిట్టూర్పో..
నిస్సహాయతో...
ఏదో తెలియని...
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో....!!
ఏకాంతంతో సహవాసమో....!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే...!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే.....
మెల్లగా తడిమి వదలి పోయింది....
నీ జ్ఞాపకాలతో నన్నుండమని....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner