12, జనవరి 2026, సోమవారం

జీవన మంజూష 01/26




 నేస్తం,

         సమస్యకు భయపడుతుంటే, అది మనల్ని ఎక్కువగా భయపెడుతుంది. ఒక్కసారి సమస్య నుండి పారిపోవాలన్న ఆలోచనను వదిలి, దానికి ఎదుర్కోవడానికి సిద్ధపడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కారణాలు లేని భయాలు మన జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మన అసహనాన్ని ఇతరుల మీద చూపించడం కూడా పెద్ద మానసిక సమస్యే. సమస్య ముందుగా మనిషి బలహీనతపై దాడి చేస్తుంది. మానసిక స్థితి బలంగా వుంటే, సమస్య భయపెట్టదు. పరిష్కారం చూపెడుతుంది

          ఈరోజుల్లో ఎవరి జీవితాలు వారివి. ఎవరి సమస్యలు వారికున్నాయి. గడిచిన కాలాన్ని మనకు జ్ఞానం అందించిన గురువుగా భావిస్తే, తరువాతి జీవితాన్ని చాలావరకు సంతోషంగా గడపగలం. ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలు మనిషిని మానసిక బలవంతుడిగా చేస్తాయి. ఓటమి మనకు మనవారెవరో, పరాయివారెవరో కూడా చూపిస్తుంది. ఓటమి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గెలుపు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాలక్రమంలో మరొకరి గెలుపు మనల్ని ప్రపంచం మర్చిపోయేలా చేస్తుంది. మన గెలుపు ప్రపంచానికి గుర్తుండి పోవాలంటే గెలుపు అనితరసాధ్యం కావాలి

           నలుగురికి మంచి చేసే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా మనం మాత్రమే ఎదగాలనుకుంటే, పర్యవసానం తెలిసినా దానిని గుర్తించనట్లుగా నటించడం మన మానసిక బలహీనత. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాని చెడు చేయకుండా వుండటమే మంచి చేసిన దానికన్నా గొప్ప విషయం. సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులో వున్న ఈనాడు ప్రపంచంలో మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. మన పక్కనే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వాటికి మన స్పందన ఏమి వుండదు. కాని ప్రపంచంలో మూలనో జరిగిన సంఘటనకు మాత్రం అతిగా స్పందించేసి, మనం గొప్ప మానవతావాదులమని చాటుకుంటుంటాం

           రోడ్డు మీద మనిషి చావుబతుల్లో వుంటే మనకెందుకని పక్క నుండి వెళ్లిపోయే మనకు సూక్తిముక్తావళి చెప్పే నైతికత వుందంటారా! కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించని మన మనస్తత్వానికి మనం మందు వేసుకోవాలో ముందు తెలుసుకోవాలి. ముందుగా మన ఇంటి, చుట్టుపక్కల సమస్యలకు స్పందించి, తరువాత ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం. ఏమంటారు మరి?


మలుపు సమీక్ష

  



           జీవితపు మదిలో మలుపుల సమ్మేళనమే మలుపు


       ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు. అవి తీపిచేదుల కలయికలు. అనుభవాలను, అనుబంధాలను అందరు అక్షరీకరించలేరు. అనుభవాలకు అనుబంధాలను జత కూర్చి చక్కని కథలుగా మన ముందుకుమలుపుకథల సంపుటిని తీసుకువచ్చారు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథలు చదువుతుంటే చాలా వరకు అవి మనకు జరిగిన అనుభవాలో లేక మన చుట్టూ వున్న సమాజంలో మనకు ఎదురుపడిన సంఘటనలో అని అనిపించక మానదు. సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే తీరులో కథలన్నీ వున్నాయి


        జీవితంలో బాధల వెంట సంతోషాలు వుంటాయని తెలిపే కథమలుపు”. 

కాలం మారితేకథ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానాన్ని తెలిపిన కథ.

టెక్నాలజీ పెరగడం మంచిదో కాదో అంటూ నిర్ణయాన్ని పాఠకులకు వదిలేసిన కథజాతకం”.

అప్పగారి పాపోడుపల్లెటూరి ఆత్మీయతను మనసుతో చూపించిన కథ.

ఓటమి నేర్పిన సత్యంతో గెలుపు ఎంత తృప్తినిస్తుందో చిన్నపిల్లలతో చెప్పించిన కథస్నేహంచాలా బావుంది.

వస్తువులతో పాటుగా మనిషి శరీరానికి అప్పుడప్పుడురిపేరుఅవసరమే.

హృద్యమైన మనసు ఆర్తి, ఆర్తనాదము కలిస్తే  “కంటి నీరుకథ.

అవసరానికిఎవరు మనవాళ్ళో తెలిపిన స్నేహితుల కథ.

మనుమరాలి ప్రేమకథలో అమ్మమ్మ మనసును తెలిపారు.

ఇల్లాలి తెలివి ఇంటికి వెలుగు అని నిరూపించిన కథకమల”.

పదిమందికి వరంగా మారిన అంతర్లీన శక్తినిశబ్దాల శాంతిలో వినవచ్చు.

రేపటి ప్రశ్నకథ మనలోని చాలామంది కథే. ఈనాటి సమాజానికి అవసరమైన కథ.

జీవితంలో ఏది జరిగినాకర్మానుసారమేఅన్న మాట నిజంగా నిజం.

గురువుల ప్రవర్తన పిల్లలతో ఎలా వుండాలనేదితల్లి ఆవేదనకథలో బాగా చెప్పారు.

మారాల్సిన దృశ్యంఅనుబంధాల బాధ్యతలను సవివరంగా చెప్పిన కథ.

నిజాయితీకి దక్కిన విలువైన గౌరవాన్నినిజాయితీ నిడివికథలో చూడవచ్చు.

ప్రాధాన్యతకథ నిజంగా ప్రాధాన్యతే అమెరికా పిల్లలకు, ఇండియా తల్లిదండ్రులకు.

ఆత్మవిశ్వాసమేఆయుధంగా మారి నలుగురిని ఆదర్శప్రాయమైన జీవితమేఆయుధంకథ.

ఇలానే మరి కొన్ని కథల సమాహారమే మలుపుకథా సంపుటి.


మానవత్వం అంటే ఏమిటో తెలియజెప్పిన కథనిబంధన”.

     చివరిగా తమ యాభై ఏళ్ల అనుబంధాన్నిజ్ఞాపకాల సంతకం”, “Journey of Life” అంటూ చిన్న కవితే అయినా మెుత్తం జీవిత సారాన్ని చెప్పేసారు

      డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు తన అనుభవాలను, మన అనుభవాలను ఏర్చికూర్చి సమాజానికి అవసరమైన విషయాలను, చాలా వరకు సమస్యలకు ముగింపులను కూడా సవ్యదిశగానే చూపించారు. ప్రతి సమస్యకు సాధ్యమైనంత వరకు మంచి పరిష్కారాలను సూచించారు. మనిషి మానసిక భావోద్వేగాలను ప్రతి కథలోనూ హృద్యంగా మలిచారు. 27 కథలతో వెలువడినమలుపుకథా సంపుటి విలువైన పుస్తకం. అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక అభినందనలు.




9, జనవరి 2026, శుక్రవారం

పదిహేడు వసంతాలు

       2009 జనవరిలో ఊపిరి పోసుకున్న నా బ్లాగుకబుర్లు కాకరకాయలులో డిసెంబర్ 4 మెుదటి రాత అంతర్జాలంలో పురుడు పోసుకుంది. గత పదహారు సంవత్సరాలుగా కబురు కబురు అంటూ దాదాపు 2489 పోస్టులు బ్లాగులో ప్రచురితమయ్యాయి. ప్రచురితం కానివి 50 పై చిలుకే వున్నాయి. ఇప్పటి వరకు 15 పుస్తకాలు ముద్రితమయ్యాయి

       మొత్తానికి పదిహేడు వసంతాల నా బ్లాగుకబుర్లు కాకరకాయలుకి వున్న లెక్కల జాబితా చూసి సంతోషమనిపించింది. అడపాదడపా ఎలా రాసినా ఆదరిస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు


       

      



8, జనవరి 2026, గురువారం

ఒంటరి కల..!!

 

అడుగుల తడబాటు అర్థమౌతున్నా

ఆపలేని పయనంలో

సాయంగా వచ్చి చేరిన తాయిలాలివి


నిన్నల్లో జారిపోయిన గతాన్ని

రేపటి భవితలో అందిపుచ్చుకోవాలని

ఆశపడే మనసు తపన


కాలానికి తెలిసిన కథే అయినా

చరిత్ర పుటల్లో 

ఛిద్రమైన చరితే ఇది


పోగొట్టుకున్న చోటునే

మెుదలైన దేవులాటలో

గెలవాలన్న ఆరాటం


ముగింపు వెదికే ప్రయత్నంలో

అసంపూర్ణంగా మిగిలిన 

ఓ ఒంటరి కల


చాలా రోజుల తర్వాత రాసిన కవిత.అప్పుడప్పుడు కింద నుండి పైకి రాయడం అలవాటు..ఇది అలా రాసినదే..!!

5, జనవరి 2026, సోమవారం

ముచ్చట్లు..!!

“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా చాలా చాలా నచ్చింది. 

దానిలో “మనం సినిమా తీస్తున్నామని అనుకుంటాం కాని అప్పుడప్పుడు సినిమా మనల్ని తీస్తోంది”అని ఓ రచయిత అంటాడు..అలాగే రాతే మనతో రాయించుకుంటుంది. అప్పుడే దానిలో జీవం వుంటుంది.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner