అలజడి రేపిన కలవరంలోఅప్పుడప్పుడు పలకరించే నీ పిలుపు
అలసిన మనసుకు ఆలంబన!!
అలల తాకిడికి చెల్లాచెదురైన
ఆలోచనలు మేలి ముత్యాలుగా
తీరాన్ని చేరాలంటే నీ దోసిలే
స్వాతి చినుకుల ఆల్చిప్ప!!
పడిలేచే కడలి కెరటం
గెలుపు ఓటములకు సాక్ష్యమైతే
గెలిచే వరకు ఓటమిని ఆస్వాదిస్తూ
ఓటమి పాఠంతో గెలుపు బావుటా
ఎగరేయమని ధైర్య స్తైర్యాలనిచ్చిన
నీ పలుకుల వాడి,వేడి సెగలు
అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాన్ని
గుర్తు చేస్తూనే వుంటాయి......!!




