5, జూన్ 2012, మంగళవారం

ముసుగు మనిషితో..జాగ్రత్త...!!

వెధవలకి కి ఎనలేని విలువ ఇచ్చి మనమే అందరి కన్నా పెద్ద వెధవలమై పోతున్నాము....!!
కుటుంబం అంటే తెలియని వారికి ఇంటి పెద్ద పెత్తనం ఇచ్చినట్లు గా...!!
ప్రేమ ఆప్యాయతలు తెలియని వాడికి ఎంత పంచినా వ్యర్ధమే..!!
పెళ్ళాం పిల్లలు ఇల్లు అంటే తెలియని వాడికి అన్ని ఇస్తే మాత్రం లాభం ఏంటి..???
కొంత మంది డబ్బుల కోసమే బతుకుతారు... మరి కొంత మంది బయట జనాల మెప్పు కోసమే జీవితాన్ని తగలబెట్టుకుంటారు....మరి కొంత మంది ఇంట్లో వాళ్ళు ఏమైనా పర్వాలేదు బయటి వాళ్ళు నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి....నువ్వు లేక పొతే ఊరు లేదు మేము లేము అంటే చాలు ఇక పట్టపగ్గాలే వుండవు వాళ్ళ ఆనందానికి...!!
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లెక్కన అన్నమాట.... !!
ఏంటో....ఈ జనాలు పెళ్ళాం పిల్లలు కూడా నమ్మని ఇలాంటి వాళ్ళ బతుకులు మరి ఏ తీరం చేరతాయో..!!
కొంత మందేమో... ఎవరు ఎలా పోయినా నాకేంటి నేను నా పెళ్ళాము/మొగుడు పిల్లలు బాగుంటే చాలు దానికోసం ఏ గడ్డి కరిచినా పర్వాలేదు అమ్మని నాన్నని విడగోట్టినా సరే నా అవసరం గడిస్తే చాలు అనుకుంటారు...!! మరో రకం వాళ్ళేమో.... మాటలు కోటలు దాటిస్తారు పని జరగదు....మనమేమో ఆ మాటల మత్తులో పడి మనకు మాట ఇచ్చారు కదా చేస్తారులే అనుకుంటాము ... కాని ఎన్ని ఏళ్ళు ఎదురు చూసినా అంతే చూడటమే మిగులుతుంది....!!
అంతా నేను చూసుకుంటాను అని చెప్తారు కాని మనం ఎప్పుడు పోతామా అని చూస్తారు...!!
అన్నట్టు అస్సలు వాళ్ళను మర్చి పోయాను నేనే గొప్ప అందరూ తప్పులే చేస్తారు నేను మాత్రమే అన్ని సరిగ్గా చేస్తాను అందరూ నా కాళ్ళ దగ్గరే వుండాలి అనుకుంటారు....!!
మొత్తం మీద అందరి దగ్గరా ఒక్కటి మాత్రం సమానం డబ్బుల కోసమే ఈ అందరి కృషి....అది ఎలా అయినా ఓ కే నే...!!
కాని చెప్పే మాట ఒక్కటే డబ్బులకి
అందరూ విలువ ఇస్తున్నారు కాని నేను మాత్రం వాటిని లెక్క చేయను అని...!!
వాళ్ళ మస్సాక్షి కి తెలుసు నిజం ఏంటో..!!
మరి కొందరేమో....ముందొక మాట వెనుక ఒక మాట చెప్తారు... ...!! వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్ ..!!
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా రకాలు....
ఈ మేక వన్నె పులులు..!!
మీకు తెలుసు కదా ఇవి అన్ని...!!
ఎక్కడో ఓ చోట తగిలే వుంటారు ఇలాంటి రకాలు....లేదా తగులుతారు జాగ్రత్త మరి....!!

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Is this from your personal experience?

జలతారు వెన్నెల చెప్పారు...

మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు.

చెప్పాలంటే...... చెప్పారు...

Why not andi..??
పేరు చెప్పని ....నా సొంత అనుభవాలే కానక్కర లేదు చూస్తూనే ఉన్నాము కదా కొన్ని నాకు అనుభవాలే....-:)

నిజానికే ఇబ్బందులు వెన్నెల గారు

భాస్కర్ కె చెప్పారు...

andharu vedhavalenantaru, good.

చెప్పాలంటే...... చెప్పారు...

నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళని మాత్రమే అంటున్నానండి అందరిని కాదు మంచి వాళ్ళని మాత్రం కాదు

aasha చెప్పారు...

సాటి మహిళగా మేటి ఆలోచన చేసి మనసును మీటేసార౦డీ...

చెప్పాలంటే...... చెప్పారు...

-:) thank u aasha...

sss చెప్పారు...

ఆయన గురించి బగా రచావు

చెప్పాలంటే...... చెప్పారు...

sss గారు మీరు పొరపాటు పడుతున్నారు ఇక్కడ ఆయన ఆవిడ కాదు అందరి గురించి రాశాను... ఉంటారు అన్ని రకాల వాళ్ళు ......ప్రపంచం కదా అంగీకరించాలి అందరిని.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner