8, జూన్ 2012, శుక్రవారం

అ...మాయకత్వం..!!

అందమైన జీవితం లో నుంచి పెళ్లి అనే మలుపు తో అత్తింటి నుంచి ఆరు నెలల్లో అరవై ఏళ్ల జీవితం చూసిన కొన్ని సత్యాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న జీవిత సుడిగుండాలు.....కొన్ని ....!!
అందుకే అమ్మ నాన్నలకు తెలియకుండా వాళ్లకు ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయే అమ్మాయిలూ మీరు వెళ్లి పోయే ఒక్క క్షణం ముందు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీమీదే ప్రాణాలు పెట్టుకు బతుకుతున్న ఇంట్లో వాళ్ళ గురించి క్షణం లో ఒక వంతు ఆలోచించండి ...ప్రేమించడం తప్పు కాదు కాని అపాత్రదానం చేయకండి అది సినిమాల్లో చూసే హీరో ఇజం కాదు నిజ జీవితం అలా వుండదు నాకు తెలిసి చూసిన జీవితాలే అందుకు సాక్ష్యం ....!!
ఇంట్లో వాళ్లకి ఇష్టం లేక పోయినా సొమ్ము చదువు లేక పోయినా మాట కోసం జీవితాన్ని ఫణంగా పెడితే మిగిలింది చేజారిన జీవితం తిరిగిరాని కాలం.
పెళ్లి చేసి మూడు రోజులకే డబ్బుల లెక్కలు చెప్పిన ఘనులు ఒకరు ....బాద్యత లేకుండా తిరిగే తమ్ముడిని దారిలో పెట్టడం చేతకాక మరదలి మీద పడి...మనుష్యులు పైకి నటిస్తూ లోపల అసలు రూపం వేరేగా ఉంటుందన్న నిజాన్ని చెప్పి లోకం పోకడ ఇంతే అని చెప్పిన పుణ్యాత్మురాలు. చెప్పేవి మాత్రమే నీతులు ఆచరణలో మాత్రం వుండవు. పేరుకి మాత్రం అమ్మ నాన్న లేక పొతే చెల్లెళ్లకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాద్యతలు పంచుకున్నాను అని అందరి దగ్గరా చెప్పుకోడం....
పసి పిల్లాడితో బైటకి గెంటిన అతి జాలి కల ఇల్లాలు....!!
అమెరికా వెళ్ళడానికి వదిన సాయం తీసుకుని వాళ్ళ ఇంట్లోనే
కుటుంబం మొత్తం వుండి లక్షలకు లక్షలు తిని అడిగితే ఒక్క పైసా ఇవ్వనక్కర లేదని అన్న వదినకు విడాకులు ఇప్పించడానికి అవిరామంగా కృషి చేసిన తమ్ముడు తమ్ముడి పెళ్ళాము.....
చెల్లెలి పెళ్లి చేస్తే అది వద్దని గొడవలు గొడవలు చేసి డబ్బులు వదిలించి వీళ్ళ జీవితాన్ని నాశనం చేసిన మరో పుణ్యాత్మురాలు.....
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వుంటాయి కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి
తప్పటగుడు ...తప్పుటడుగు వేయవద్దు....
రంగులు మార్చే ఊసరవెల్లులు...జాలి కబుర్లు చెప్పి మోసం చేసే వాళ్ళు వుంటారు జాగ్రత్త ...!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భాస్కర్ కె చెప్పారు...

mee aavedana andhriki artham kavalani korukuntunnanandi,
maya artham kavalente ilantivi inka, inka ravalandi.

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి కాక పోయినా కొందరికయినా అర్ధమైతే బావుండని వుంది ...థాంక్యు అండి...

సీత చెప్పారు...

nice and intresting too...!!
these type of articles helps for self assessment.manju gaaru another very nice article 4m U. :) :).i liked it very much

జలతారు వెన్నెల చెప్పారు...

అనుభవజ్ఞులు చెప్పిన ఏ మాటైనా వినాల్సిందే! పెద్దల మాట చద్దనం మూట అని ఊరికే అనలేదు కదండి మన పెద్దలు. పెళ్ళి విషయం లో ఒకప్పుడు అనేవారు, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి మరీ పెళ్ళిల్లు కుదర్చాలి అని...ఈ కాలం లో అలా వీలవ్వకపోయినా..మీరు చెప్పిన కొన్ని చేదు అనుభవాలన్ని చదివాక, ఈ సామెతలు ఎందుకు పుట్టాయో బాగా అర్ధం అవుతున్నాయి..మంచి పోస్ట్ మంజు గారు. కొద్ది మందైనా అర్ధం చేసుకుని జాగ్రత్తపడితే అంతే చాలు

Sai చెప్పారు...

చాలా చాలా మంచి పోస్టు మంజు గారు..... awareness create చేసిదిగా ఉంది.. ధ్యాంక్యూ...

చెప్పాలంటే...... చెప్పారు...

కొంత మందైనా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడతారని....thank you vennela , sai seeta....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner