11, జూన్ 2012, సోమవారం

పాము కన్నా ప్రమాదం....!!

పెట్టిన చేతిని కాటు వేసే నైజమున్న పాము కన్నా ప్రమాదకరమైన జంతువు మనిషి....పాముకి కోరల్లో మాత్రమే విషముంటుంది. మనిషి కి మాత్రం కాలి గోటి నుంచి వెంట్రుక చివరి వరకు విషమే...!! మన ఖర్మ కాలి ఇలాంటి విషపురుగుల చేతిలో పడ్డామో....ఇక చచ్చే వరకు నరకం చూడటమే...!! ఇంట్లో తిని తిండి పెట్టిన వాళ్ళనే నాశనం చేయాలనే దీక్ష తీసుకున్న వాళ్ళని ఏం చేయాలి? జీవితమిచ్చి విలువను ఇస్తే....వాళ్ళ నాశనం కోరుకుంటున్న వాళ్ళని క్షమించాలా...!! బతుకునిచ్చిన వాళ్ళ చావుని చూడాలనుకుంటే..??
చాలా జాగ్రత్త గా వుండాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది మనతోనే వున్నారు మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసత్వానికి మరో రూపం..!! ఎదుటి వాళ్ళకి చెప్పేది శ్రీరంగ నీతులు ఇంట్లో చేసేది మాత్రం...శాడిజం..!!
అందుకే మంచితనం నటించే వాళ్ళని తొందరగా నమ్మకండి...జాలి కబుర్లు చెప్పి మోసం చేస్తారు జాగ్రత్త గా వుండండి ....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Mauli చెప్పారు...

mI kOpam taggAka kAsta pAmu bomma tIsEddurU :)

సాయి చెప్పారు...

మంజు గారు నిజమే మనిషికి వళ్లంతా విషమే...
ఎందుకో కోపంగా ఉన్నట్లుంది...
మీలాంటి మంచివారికి అంతా మంచే జరుగుతుంది. ప్రశాంతంగా ఉండండి...(ఏమనుకోవద్దు)

చెప్పాలంటే...... చెప్పారు...

సాయి గారు మౌళి గారు కోపం గా ఏమి లేను నాకు అనిపించినా నిజం రాసాను అంతే అండి థాంక్యు :)

సీత చెప్పారు...

నిజం మంజు గారూ....
మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసత్వానికి మరో రూపం..!!
అక్షరాలా నిజం.మంచి పోస్ట్.....
-- సీత

జలతారు వెన్నెల చెప్పారు...

మంజుగారు, అనుభవం అయ్యేవరకు అంత తొందరగా అర్ధం కావండి ఇలాంటివి.
అనుభవించాక, బాధ తప్ప ఇంకేమి మిగలదు!

చెప్పాలంటే...... చెప్పారు...

అవును వెన్నెలా తెలిసే సరికి మిగిలేది బాదే...!!

థాంక్యు సీతా

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner