30, జూన్ 2012, శనివారం

ధరణి మనసు...!!

కదిలించే కధల్లో వినిపించే వ్యధలెన్నో....!!
మనసుతో చూడు మాటలెన్నో వినిపిస్తాయి...!!
కనిపించని కన్నీరు ఏరులై పారుతోంది...!!
కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చినా...
తడవని భూదేవి మండే సూర్యుడికి
భయపడి ఎండి బీటలు బారినా....
వర్షం కోసం ఆకాశం వైపు చూడటానికి కూడా...
తటపటాయిస్తోంది...!!
తన మీద ఆధార పడిన జీవితాలెన్నో...
అతలాకుతలమౌతుంటే...!!
చూడలేక ...ఏమి చేయలేక...
సతమతమౌతూ...వరుణుడి
కరునారుణ వీక్షణాల కోసం
పడిగాపులు కాయటం తప్ప..!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

the tree చెప్పారు...

anthe nandi, antha kante emi cheyagaladandi dharani,
good one , keep writitin.

శ్రీ చెప్పారు...

వాన రాకడ...ప్రాణం పోకడ...
ఇవి మనకెప్పటికీ తెలియనివే...
వరుణుని కరుణకై వేచి ఉండడమే తప్ప
ఏమీ చేయలేని స్థితి,,,
బాగా వ్రాసారు వసుంధర వ్యథ...
@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శ్రీ , భాస్కర్

సీత చెప్పారు...

మంజు గారు......
చక్క గా చెప్పారండీ...!!చాలా బాగుంది

జలతారు వెన్నెల చెప్పారు...

సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, వర్షం పడుతుంది అంటారు కదా?
కొంచెం మనకున్న గొప్ప సంగీత కళాకారులందరిని సమావేస పరిచి గాన సభలు నిర్వహిస్తే?
బాగుందండి మీ కవిత.

చెప్పాలంటే...... చెప్పారు...

ఈ కలియుగం లో అది సాధ్యమంటారా వెన్నెలా..!! థాంక్స్

థాంక్యు సీత

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner