19, జూన్ 2012, మంగళవారం

ప్రయాణాల్లో పాడు గోల....!!

ఏమిటోనండి ఒక్కోసారి ప్రయాణం అంటేనే భయం వేస్తోంది ....మొన్ననే విశాఖపట్టణం మా అన్న కొడుకుది నిశ్చితార్ధం వుంటే వెళ్ళాము వెళ్ళేటప్పుడు వెతలే వచ్చేటప్పుడు వెతల్ వెతల్...!! వెళ్ళేటప్పుడు రెండు సీట్లు వేరే బోగీలో వచ్చాయి నేను మా పిన్ని వెళ్ళాము వెళ్ళేసరికే ఖాళి లేదు అడిగితే మావి అన్నారు రిజర్వేషన్ అని చూపిస్తే మాది అదే అన్నారు తీరా చూస్తే వెయిటింగ్ లిస్టు ....హన్నా..చూసారా వాళ్ళ తెలివి...కాకపొతే మా సీట్లు మాకు ఇచ్చేసారు లెండి...!!
అంతకు ముందు ఒకసారి హైదరాబాదు నుంచి వస్తుంటే ఇలానే వెయిటింగ్ లిస్టు లో ఒక పెద్దావిడ బానే చదువు కుంది కాని కంపార్టుమెట్ మొత్తం చెప్పినా వినకుండా నా సీటులోనే కూర్చుంది అడిగితే టి.సి చెప్తే కాని కుదరదంది. విజయవాడ వరకు టి.సి రాలేదు నోరు వున్న వాళ్ళదే రాజ్యమని ....!!
విశాఖ నుంచి తిరుగు ప్రయాణం లో కోణార్క్ లో బెర్తులు తీసుకుంటే అందరమూ ఉన్నాము కదా అనుకుంటే అన్ని చెక్ చేసి టి.సి వెళ్ళగానే ఒక పది మంది కాళ్ళ దగ్గర కింద పేపర్లు వేసుకుని బెర్తుల మద్యలో పడుకోవడము ఇద్దరు అర్ధరాత్రి ఒంటిగంటకు ఆ టైములో లైట్ వేసి టి.సి సీటులో కూర్చుంటే అడిగినందుకు పెద్దగా గొడవ. టి.సీ ని పోలీసుని పిలిస్తే వాళ్ళు ఏదో చెప్పి ఇలా ఇరవై ఆరు చూడాలి అన్నారు ...మరి వాళ్ళు జీతం తీసుకునేది అందుకే కదా....ఆడిగితే గొడవ ఊరుకుంటే ఎన్నిపోతాయో తెలియదు....వాళ్ళు వాళ్ళు అందరూ ఒకటేనేమో...ఎవరి వాటాలు వాళ్లకి అందుతాయి కదా..!!
ఇలా ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు మనకు మరో అపరిచితుడు రావాలో లేక మనమే అపరిచితుడిలా మారాలో....!!
ఆ టైం లో నాకు మాత్రం అపరిచితుడే గుర్తు వచ్చాడు....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జ్యోతిర్మయి చెప్పారు...

సివిక్ సెన్స్ తక్కువైపోతోంది..

చెప్పాలంటే...... చెప్పారు...

అవును జ్యోతి గారు....థాంక్యు

the tree చెప్పారు...

genaral comp ekkaledu elano,
aa anubhavalu maari goppavi.

సాయి చెప్పారు...

నిజమే నండీ ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు..

చెప్పాలంటే...... చెప్పారు...

రెండు మూడు సార్లు ఆ అనుభవము అయిందండీ భాస్కర్ గారు...

నిజమేనండి సాయి గారు బయటికి వెళ్తేనే ఇబ్బందులు అన్ని చూడాలి కదా!!

జలతారు వెన్నెల చెప్పారు...

:((

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner