భారమైన కాలం బరువుగా కదులుతుంటే.!!
వేదనల నిట్టూర్పు సెగలు రోదనలుగా చుట్టుముడుతుంటే..!!
నెగడు లో మండుతున్న మంటలు....
శూలాల శరాఘాతాలై గుచ్చుతుంటే...!!
శూన్యమైన ఆకాశం రేయి చందురుని కోసమో...!!
తొలిపొద్దు సూరీడు రాక కోసమో...!!
ఎదురు చూస్తూ వుంటే....!!
మారే రోజు మరో రోజో...లేక మరపు రాని రోజో...!!
తలరాతను మార్చేరోజో అని ఎదురు చూపు...!!
విధి రాత తెలియక..!!
9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బాగుంది భావం మంజు గారూ!
చిత్రానికి అతికినట్లుంది...
@శ్రీ
థాంక్యు శ్రీ
"మారే రోజు మరో రోజో...లేక మరపు రాని రోజో...!!
తలరాతను మార్చేరోజో అని ఎదురు చూపు...!!"
ఈ లైన్స్ చాలా బాగున్నాయి మంజు గారు.
థాంక్యు వెన్నెలా.....ఏమైపోయారు ఈ మద్య బానే వున్నారా ..!!
శూన్యమైన ఆకాశం రేయి చందురుని కోసమో...!!
తొలిపొద్దు సూరీడు రాక కోసమో...!!
చక్కగా వున్నాయ్ కదూ, ఈ కవితా పంక్తులు.
మీకు నచ్చితే చాలా సంతోషం భాస్కర్ గారు
వినాయక చవితి శుభాకాంక్షలు!
మేడం.. మీ పదాలు అద్భుతం..మీ దగ్గర తెలుగు నేర్చుకోవాలి..కాని నేర్పరు..ఎందుకంటే మేం కూడా మీకు లాగా రాసేస్తే ఎలా???
థాంక్యు అండి మీకు కూడా కాస్త ఆలస్యం గా
ఆలోచించే వాళ్లకు ఇంకా ఎక్కువ బాగా రాయటం వస్తుంది మీకు రాక పోవతమేంటి నాకన్నా చాలా బాగా వచ్చు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి