31, అక్టోబర్ 2012, బుధవారం

ఏదో తెలియని బాంధవ్యం....!!

కదిలి పోతున్న కాలంతో పాటుగా...
నేను..నాతోపాటుగా...నువ్వు...!!
గాలి వాటంగా సాగే జనాలు మనతో పాటు...!!

వదలి పోనని మారాము చేసే జ్ఞాపకాలు...
సుతిమెత్తగా తాకే సుకుమార కుసుమాలు...!!
చివరి వరకు వెంట ఉండే పరిమళాలు....!!

సంద్రంలో అలజడి ఏంటో...!!
ఆకాశం వర్షించడం ఏంటో....!!
కలవని రెండు అంతరాల మధ్య....
ఏదో తెలియని బాంధవ్యం....!!

అచ్చంగా మనలానే కదూ...!!

30, అక్టోబర్ 2012, మంగళవారం

పదవీ విరమణ పండుగ....!!

ఎంతగా అనుకున్నానో.....వెళ్ళాలని....కాని వెళ్ళలేక పోతున్నాను ...నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీలత టీచర్ గారి రిటైర్మెంట్ పండుగకు....చాలా బాధగా వుంది...ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ రమ్మని పిలిచినా వెళ్ళలేని పరిస్థితి..... ఒక్కోసారి అంతే..మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము....
టీచర్ గారు పాటలు బాగా పాడే వారు పెద్ద పుస్తకంలో బోలెడు పాటలు ఉండేవి.... డాన్సు కుడా బాగా నేర్పించేవారు. ఒకసారి పాటల పోటికి వెళ్తానంటే నాకు నచ్చిన పాటను నేర్పించి పంపారు...కాక పొతే నాకు బహుమతి రాలేదనుకోండి....అక్కడా రాజకీయాలే కదా....!! అయినా నాకన్నా బాగా పాడారులెండి...-:)...!!
మేము కొంత మందిమి టీచర్ గారి దగ్గరే పడుకునే వాళ్ళము..అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం అలా చూసిందే గోపాలరావు గారి అమ్మాయి......మిలటరీ హోటల్ లో బిరియాని భలే వుండేది...ఎప్పుడన్నా తినేవాళ్ళం..!! కృష్ణాష్టమికి  కృష్ణుడిని భలే అలంకరించి పూజలు చేసే వాళ్ళం...పెద్ద కృష్ణుడి బొమ్మ వుండేది ఆవిడ దగ్గర...!!
తరువాత కూడా...చాలా రోజులకి టీచర్ గారి దగ్గరకు వెళ్తే  అచ్చం మా అమ్మాయి కూడా   నీ లానే  అల్లరి చేస్తోంది అని ముద్దుగా తిట్టారు....ఆ మద్య చిన్నప్పటి నేస్తాలు అందరమూ కలిసినప్పుడు టీచర్స్ అందరిని కూడా  పిలిచి మాకు తోచినట్లుగా గౌరవించాము....ఆరోజు నన్ను ఎప్పుడు చూస్తానా అని వుందని అందరితో అన్నప్పుడు భలే సంతోషం వేసింది...
ఎందరినో....మంచిగా తీర్చిదిద్దిన మా శ్రీలత గారు మళ్లి జన్మలో కూడా టీచర్ గానే పుట్టాలని వుందని మాలాంటి వారే తనకు శిష్యులుగా కావాలని చెప్పారు....మేమందరం(విద్యార్ధులు) తన ఆస్థి అని గొప్పగా చెప్పుకున్నారు....ఇంతకన్నా మాకు మాత్రం ఏం కావాలి...
రేపు పదవీ విరమణ చేస్తున్న ప్రియాతి ప్రియమైన శ్రీలత టీచర్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇంకా మాలాంటి ఎందరినో తయారు చేయాలని ఎప్పటికి మీ చిరునవ్వు అలానే వుండాలని కోరుకుంటూ ప్రేమతో....మీ ప్రియ శిష్యురాలు                                                                                                                                                          

29, అక్టోబర్ 2012, సోమవారం

నేను - అహం - దేవుడు

కొందరికి నేను  అన్న అహం చాలా ఎక్కువగా వుంటుంది....
కొందరేముంది అందరమూ అనుకుంటాము...నాకు నేను గొప్ప అని అది మామూలు విష్యం.
కాకపొతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలా కొద్ది మందికి నేను అన్న అహంకారం అహంతో మిళితమై పోయి ఉంటుంది...మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!!
దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!!

గుడికి వెళ్లి వచ్చినంత మాత్రాన మనం పవిత్రులమై పోము...వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం కాము...ఎన్ని సార్లు గుడికి వెళ్ళాము అని కాదు ఎంత బాగా దేవుని దర్శించుకున్నాము...మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాము..మనం చేసే పని వల్ల కాని, మన మాటల వల్ల కాని ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధ పడుతున్నారేమో అని మాత్రం ఆలోచించం...వయసు తో పాటు కొంత మందికి బుద్ది పెరుగుతుంది...మరి కొంతమందికేమో...మందగిస్తుంది....!! మన గొప్ప మనం డబ్బా కొట్టుకుంటే ఎలా..!! నలుగురూ డప్పు కొడితే...బావుంటుంది కదూ..!!

నా వరకు నేను అనుకుంటాను నేను చాలా బాగా నా బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తున్నానని...కాని లోటుపాటులు ఎన్ని వున్నాయో....నాకు తెలియదు కదా...!! బాధితులకు తెలుస్తుంది...!! కాకపొతే ఏంటంటే...ఈ రోజుల్లో అన్ని బంధాలు బాధ్యతలు డబ్బుతో మాత్రమె ముడి పడి వున్నాయి...అది ఏ బంధమైనా కానివ్వండి..డబ్బే మూలం...!!
అయినా దేవుడే అందరికి మంచివాడు కాదు..అలాంటప్పుడు మనం మాత్రం ఎంత వరకు మంచిని డబ్బిచ్చి కొనుక్కోగం చెప్పండి..?? -:)
పుడుతూ ఏమి తీసుకురాము...పోతూ ఏమీ తీసుకువెళ్ళలేము...అయినా ఎందుకో అహాన్ని వీడలేము...అదే మన బలహినతేమో..!! మహాత్ములకు మనకు మధ్య తేడా అదే కదా...-:)...!!

గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు కోపం తెచ్చుకోకండి ఎవరూ...!!
కాస్త ఆలోచించండి అంతే..!!

28, అక్టోబర్ 2012, ఆదివారం

బతుకు పయనానికి....అన్వేషణ.

ఆట ఆట దేవుడు మనతో ఆడే ఆట
పరుగు పరుగు కాలంతో పరుగు
ముడి ముడి జీవితంతో ముడి
జీవితం జీవితం ప్రతి క్షణం పోరాటం

ఆటలో ఓడినా  పరుగు ఆపినా
ముడి విడిపోయినా జీవితంలో....
మిగిలేది ఓటమే...ఒంటరితనమే...!!
దైవం ఆడే చదరంగంలో...గెలుపోటములు
దైవాధీనాలే....!!

అయినా పోరాటం తప్పదు....జానెడు పొట్టకు...
బతుకు పయనానికి....కాలంతో...పరుగు...!!

గులక రాళ్ళున్నా...గులాబి ముల్లు గుచ్చుకున్నా...
మల్లెల సౌరభానికి ఎంత దూరమైనా....
పయనాన్ని సాగిస్తాం...రేపటి మీద ఆశతో...
ఈ రోజు నిరాశని మర్చిపోయి...!!
ఇదే సగటు మనిషి జీవన విధానం.!! 

పుట్టినరోజు పాపాయి.....!!

         ప్రియాతి ప్రియమైన ప్రియకు
           పుట్టినరోజు శుభాకాంక్షలు          
                       ప్రేమతో
                    అమ్మ  నాన్న 
              నాయనమ్మ  తాతయ్య
             అత్త   సుబ్బారావు తాత
               పెదనాన్న మంజమ్మ
                 మౌర్య  శౌర్య  తేజ 

26, అక్టోబర్ 2012, శుక్రవారం

న్యాయ పీఠాధిపతి

ఓ  మరణం మరో పుట్టుకకి నాంది
రెప్ప మూస్తే మరణం రెప్ప తెరిస్తే జననం
రెంటికి తేడా రెప్పపాటే...!! సారూప్యం ఏడుపే....!!
పుడుతూ ఏడుస్తాం...పోతూ....ఏడిపిస్తాం...!!
కోపం..ద్వేషం..ఇష్టం..కష్టం...అన్నీ...
ఈ రెప్పపాటు జీవితం కోసమే...!!
ఎవరైనా తల  వంచాల్సింది చావు ముందే...!!
వయసు తో పని లేదు...గొప్పా  బీదా తేడా లేదు
అందరూ సమానమే...అందరికి సమ న్యాయమే..!!
సరియైన న్యాయ పీఠాధిపతి  మరణమే...!!

25, అక్టోబర్ 2012, గురువారం

గుర్తు వచ్చిన మధుర క్షణాలు....!!

నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు....ఓ రెండేళ్ళ పాపాయి నాకు మంచి నేస్తం....!! ఆడినా పోట్లాడినా ఎక్కువగా నాతోనే...మా ఎదురు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకేమో అమ్మాయిలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి....పసిపిల్లలను కుడా అబ్బాయిలను ఎత్తుకునేదాన్ని కాదు....-:)  పాపాయి వాళ్ళ అమ్మ..అబ్బాయిలు అస్సలు ఇష్టం లేదు కదా మరి నీకు అబ్బాయిలైతే ఏం చేస్తావు అంటే నీకిచ్చేస్తాను  అన్నా..!!    
ఈ రెండేళ్ళ పాపాయి వాళ్ళ అక్క చదివే పాఠాలు విని గడ గడా చెప్తూ భలే హుషారుగా ఉండేది...అందరు అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుంటే  పాపాయి నా దగ్గరకే వచ్చేది...అసలు విష్యం ఏంటంటే మొన్ననే ఆ పాపాయికి బుల్లి పాపాయి పుట్టింది...నా నేస్తం ఇప్పుడు పాపాయి కాదులెండి పెద్దది అయిపొయింది...స్కూలులో పాఠాలు చెప్పే పంతులమ్మ కూడా..!!
చూడటానికి ఇంటికి వెళ్తే అనిపించింది నాతో ఆడి పోట్లాడిన ఆ పిల్లేనా అని..!! రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయా అనిపించింది....నేను  తెలిసిన మా  వాళ్ళు కూడా నన్ను ఇలానే అంటూ వుంటారు....నేను
కూడా బానే అల్లరి చేసేదాన్ని , పోట్లాదేదాన్ని..కబుర్లు కూడా బాగా చెప్పేదాన్ని...!! మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ వుంటారు...బొమ్మలు ఎన్ని వున్నా ఇంకా కొనమంటే నేను వాళ్ళను తిడితే మా అమ్మ వెంటనే నువ్వు నీకు  నచ్చిన బొమ్మ ఇచ్చే వరకు ఊరుకోలేదులే....ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో బొమ్మ చూసి అదే కావాలని పేచి పెట్టి మరీ బొమ్మ తీసుకున్నావు...దాన్ని వెంటనే పాడుచేసావు...మరి వాళ్ళనెందుకు తిడతావు అని నా మీద పోట్లాటకు వస్తుంది... ఇక నా కొడుకులకు పండగే మా అమ్మ నన్ను తిడుతూ వుంటే..!!
చిన్నప్పటి కబుర్లు ఇలా ఎవరైనా గుర్తు చేస్తూ వుంటే భలే బావుంటుంది కదూ.....!! 

21, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రేమంటే తెలియని....!!

నువ్వంటే  చెప్పలేనంత ఇష్టం
నేనంటే నాకిష్టం...నాకన్నా నువ్విష్టం
ఇష్టం మాత్రమె తెలిసిన నాకు...
ప్రేమ అంటే మాత్రం తెలియదు!!


దగ్గరగా ఉన్నప్పుడు  దూరం తెలియలేదు
దూరంగా ఉన్నప్పుడు దగ్గరతనం అనిపించింది...!!
మాటలాడుతూ ఉంటే తెలియని హాయి
మాటలు లేనప్పుడు వెలితిగా అనిపించింది...!!

ఇష్టపడటం తెలిసిన మనసుకి
మర్చిపోవడం తెలియడం లేదు పాపం.!!
ఇష్టం కష్టంగా ఉంటుందని తెలియని మది
కష్టాన్ని కుడా ఇష్టంగా భరించడం అదృష్టం కదూ...!!

19, అక్టోబర్ 2012, శుక్రవారం

తికమక





ఎవరింటికైనా వెళ్ళినా మనమే సర్దుకుపోవాలి.....!!
మన ఇంటికి  ఎవరైనా వచ్చినా మనమే సర్దుకోవాలి...!!
ఈ తికమక ఏమిటో మరి..??
మీకెవరికైనా అర్ధమైతే చెప్పరూ....!!!

18, అక్టోబర్ 2012, గురువారం

వింతైన వి..చిత్రం...!!

అర్ధం కానిది ఆకాశం
అంతేలేనిది సముద్రం
ఆ ఆకాశం ఈ సముద్రం కలిస్తే...??
ఎప్పటికి నిజం కాదు ఈ ఊహ...!!
అయినా అందమైన నిజం కాని వాస్తవమే...!!
కలవని మనసుల మద్య దూరం తరగదు...!!
కలిసున్నా మనుష్యుల మద్య అంతరమే...ఎప్పటికి..!!
అనంతమైన ఆకాశం...అవదే లేని కడలి...
ఎప్పటికి కలుసుకోలేవు....కాని...
కలిసినట్లు కనిపిస్తాయి....!!
అదే ఈ  సృష్టి లోని వింతైన వి..చిత్రం...!!

16, అక్టోబర్ 2012, మంగళవారం

దూరంగా ఉంటావెందుకు..??

చెప్పలేని మాటలు మౌనరాగాలైతే..
ఎదలోని వెతలు వెలికి రాకుంటే...
సడి లేని గుండె గూటిలో.... నీ గురుతు గా...
చిరు మువ్వల సవ్వడి ఎక్కడి నుంచో....!!
అక్కడా..ఇక్కడా...ఎక్కడా... అని వెదుకులాటలో....
విసిగి వేసారి పోతుంటే...!!
అందెల సడి అలవోకగా వినిపిస్తూనే వుంది...!!
నువ్వు నా చేరువలోనే ఉన్నావని తలపిస్తూ...!!
అయినా కానరాని నీ జాడ కోసం....
జగమంతా జల్లెడ పడుతుంటే...!!
దోబూచులాడుతూ....
దగ్గరే వుంటూ....దూరంగా ఉంటావెందుకు..??

13, అక్టోబర్ 2012, శనివారం

ఎర్ర బస్సు ఎక్కొచ్చిన నేను....కూడా!!


ఎర్ర బస్సెక్కి ఇంజనీరు అయిపోదామని వచ్చేసి మొత్తానికి ఇంజనీరునైపోయి....అలానే నాన్న ఫ్రెండ్ నరసరాజు అంకుల్ పుణ్యమా అని టికెట్ కుడా అంకులే తీసుకుంటే ఎయిర్ బస్సు ఎక్కి అమెరికాకి కుడా ఎల్లోచ్చేసాను...కాకపొతే అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది ఎర్ర బస్సెక్కిన మనమేనా ఇన్ని చేసింది అని బోల్డు ఆశ్చర్యం కుడా వేసేస్తూ వుంటుంది....చెన్నైలో విమానం ఎక్కాను అని తెలియకుండా ఎక్కేసాను.. విమానం కిటికీ లో నుంచి  ఆకాశం చూడటం తో మొదలు పక్కన అమ్మాయి సాయం తో మొత్తానికి అమెరికాలో కాలు పెట్ట్టాను...అన్నయ్య ఎయిర్పోర్టు కి వచ్చి కార్ సీట్ బెల్టు పెట్టుకోవడంతో మొదలు ఇంటికి తీసుకు వెళ్లి ఆన్ని చెప్పడం స్టేట్ ఐడి కోసం తీసుకు వెళ్ళడం.. ఎస్కలేటర్ ఎక్కడానికి దిగడానికి మన్మధుడు లో బ్రమ్మానందం లా కాస్త పడుతుంటే...అన్న కూతురు సుమీ నవ్వడం...నా కోసం వాళ్ళు తెలుగులో కస్టపడి మాట్లాడటం ..భలే బావుండేది...ఒక వారం తరువాత కంపెని గెస్ట్ హౌస్ కి పంపడం కావాల్సినవి కొని పెట్టి....కాక పొతే అసలైన బియ్యం మర్చిపోయాము కొనడం...ఒక్కళ్ళమే వుండటం భయం భయం గా....హాల్లో సోఫాలో పడుకుని బ్లైండ్స్ లో నుంచి చూడటం నిద్ర లేకుండా....పొద్దున్నే ఎండ చూసి  అబ్బో ఎండా అని సంబరపడి తీరా ఎండలోకి వెళ్తే చలి...!! మొదటగా ఒక ఆమె వచ్చింది ఎంతసేపు ఫోను వదలకుండా వుండేది...నాకేమో ఏమిలేదు తరువాత ఒక ఫామిలి వచ్చారు....బానే వుంది వాళ్ళతో...వాళ్ళ కోసం వచ్చి నాకు ఫ్రెండ్స్ అయ్యారు సిరి సీతారాం. కాక పొతే మొదటి ఆమెతో పడలేక అన్నయ్యకు ఫోన్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఒక పది రోజుల్లో మొత్తానికి చికాగో వెళ్ళాను....అన్నట్టు మొదటగా అమెరికాలో కాలు పెట్టింది వాషింగ్టన్...బాల్టిమోర్ అన్న వాళ్ళ ఇల్లు..పారాడైం కంపెనీ గెస్ట్ హౌస్ లో కస్టాలు...అవసరానికి డబ్బులు ఇచ్చిన నరసరాజు అంకుల్ ...  అది అక్కడికి.
అమెరికా వెళ్ళిన తరువాత నేను ఒక్కదాన్నే అని అనుకోకుండా నన్ను భయపడనీకుండా రోజు ఫోను చేసి మాట్లాడిన సతీష్...నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి తెసుకు వెళ్లి కంపర్ట్ కొని పెట్టిన కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ...విని రమేష్  యశోద  అన్నయ్య వాళ్ళ ఇంట్లో కలవడం...థాంక్స్ గివింగ్ కి  సిరి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తే అన్నయ్య వచ్చి ఇంటికి తెసుకువెళ్ళడం...తరువాత చికాగో ప్రయాణం నాకు కొత్త అని ఫ్లైట్ గెట్ వరకు వచ్చి ఎక్కించిన సుమీ కృష్ణ....పది అడుగుల స్నో లో చికాగో లో కాలు పెట్టడం కాబ్ ఎక్కడం పాపం నేను మోయలేను అని కాబ్ డ్రైవర్ నా సూట్కేస్లు తేవడం ...ఏమి తెలియని నేను అలా అలా కాస్త కాస్త అలవాటు కావడం....
చికాగో లో హెచ్ ఎన్ సి లో ట్రైనింగ్ పీపుల్ సాఫ్ట్ లో...వినయ్ గారు మంజుల గారు బ్రమ్మయ్య కైలాష్ షన్ముఖ్ మూర్తి ఇంకా కొంత మంది పరిచయాలు...నా పుట్టిన రోజుకి కొద్ది పరిచయం లోనే కేకు తెచ్చి సెలబ్రేట్ చేసిన అందరు...అది ఐయ్యాక కార్సన్ సిటి లో మొత్తానికి ఉద్యోగం వచ్చింది వి సి ++ లో లెండి....చికాగో నుంచి ప్రయాణం మద్యలో ఫ్లైట్ మిస్ ఐయ్యి ఒంటారియో లో వుండటం ఆకలికి ఏమి తినాలో తెలియని పరిస్థితి లో పిజా తినడం ...మరుసటి రోజు రెనో లో దిగి కాబ్ లో కార్సన్ సిటి కి వెళ్ళడం ...అబ్బు రూము లో నాలుగు రోజులు సంపత్ ఇంట్లో మద్యానం భోజనాలు ..కోక్ అలవాటు లేని నేను టిన్ బాగ్ లో అలానే వుంచడం ...సంధ్య శ్రీనివాస్ శ్యాం పరిచయాలు...తరువాత కాలే కుటుంబం తో ఒక నెల రోజులు షేర్ చేసుకుని ఉండలేక మల్లి వేరే రూము లోకి మారి పోవడం రోజు సంపత్ జీప్ లో వెళ్ళడం మద్యానం మా ఇంట్లో భోజనం ఇలా బానే వుండేది. కైలాష్ ఫ్రెండ్ నాకు ఫోను లో హెల్ప్ చేసేవాడు వి సి ++ లో....కొత్తగా వెళ్ళినప్పుడు కొద్ది పరిచయం లో డబ్బులు కావాలేమో అని కుడా అడిగిన మొదటి వ్యక్తీ కైలాష్..!!

మరి కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా.....

9, అక్టోబర్ 2012, మంగళవారం

నాతొ నువ్వున్న క్షణం

నాతొ నువ్వున్న క్షణం సజీవం
https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcQYmxhyH-aKLJeCl-tKayCsNGpfsjUhTcR6pFnqKOGfOjGxu5PE0gనువ్వు లేని మరుక్షణం ....
 ఓ మధుర జ్ఞాపకం...!!
నిజం కాని స్వప్నాన్ని......
కలలోనైనా బ్రతికించాలి  అన్న తపన
వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే
జీవితాన్ని మర్చిపోవాలేమో...!!
మన మద్య మౌనం మాటలైనా
ఒక్కోసారి నిశ్శబ్ధదం కుడా వరమే...!!
నీకు అక్కర లేని నేను నాకు వద్దు.....
అందుకే నాకోసం నువ్వు వచ్చే క్షణం కోసం...!!





  
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner