21, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రేమంటే తెలియని....!!

నువ్వంటే  చెప్పలేనంత ఇష్టం
నేనంటే నాకిష్టం...నాకన్నా నువ్విష్టం
ఇష్టం మాత్రమె తెలిసిన నాకు...
ప్రేమ అంటే మాత్రం తెలియదు!!


దగ్గరగా ఉన్నప్పుడు  దూరం తెలియలేదు
దూరంగా ఉన్నప్పుడు దగ్గరతనం అనిపించింది...!!
మాటలాడుతూ ఉంటే తెలియని హాయి
మాటలు లేనప్పుడు వెలితిగా అనిపించింది...!!

ఇష్టపడటం తెలిసిన మనసుకి
మర్చిపోవడం తెలియడం లేదు పాపం.!!
ఇష్టం కష్టంగా ఉంటుందని తెలియని మది
కష్టాన్ని కుడా ఇష్టంగా భరించడం అదృష్టం కదూ...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

అవును. అదృష్టమే. బాగుందండీ. :)

తెలుగమ్మాయి చెప్పారు...

ఇషమైనవి కష్టమైనా అదృష్టంగానే అనిపిస్తాయేమోనండి!

చెప్పాలంటే...... చెప్పారు...

అవును....కదా...!! లిపి...

థాంక్యు శిశిరా....లిపి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner