30, అక్టోబర్ 2012, మంగళవారం

పదవీ విరమణ పండుగ....!!

ఎంతగా అనుకున్నానో.....వెళ్ళాలని....కాని వెళ్ళలేక పోతున్నాను ...నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీలత టీచర్ గారి రిటైర్మెంట్ పండుగకు....చాలా బాధగా వుంది...ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ రమ్మని పిలిచినా వెళ్ళలేని పరిస్థితి..... ఒక్కోసారి అంతే..మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము....
టీచర్ గారు పాటలు బాగా పాడే వారు పెద్ద పుస్తకంలో బోలెడు పాటలు ఉండేవి.... డాన్సు కుడా బాగా నేర్పించేవారు. ఒకసారి పాటల పోటికి వెళ్తానంటే నాకు నచ్చిన పాటను నేర్పించి పంపారు...కాక పొతే నాకు బహుమతి రాలేదనుకోండి....అక్కడా రాజకీయాలే కదా....!! అయినా నాకన్నా బాగా పాడారులెండి...-:)...!!
మేము కొంత మందిమి టీచర్ గారి దగ్గరే పడుకునే వాళ్ళము..అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం అలా చూసిందే గోపాలరావు గారి అమ్మాయి......మిలటరీ హోటల్ లో బిరియాని భలే వుండేది...ఎప్పుడన్నా తినేవాళ్ళం..!! కృష్ణాష్టమికి  కృష్ణుడిని భలే అలంకరించి పూజలు చేసే వాళ్ళం...పెద్ద కృష్ణుడి బొమ్మ వుండేది ఆవిడ దగ్గర...!!
తరువాత కూడా...చాలా రోజులకి టీచర్ గారి దగ్గరకు వెళ్తే  అచ్చం మా అమ్మాయి కూడా   నీ లానే  అల్లరి చేస్తోంది అని ముద్దుగా తిట్టారు....ఆ మద్య చిన్నప్పటి నేస్తాలు అందరమూ కలిసినప్పుడు టీచర్స్ అందరిని కూడా  పిలిచి మాకు తోచినట్లుగా గౌరవించాము....ఆరోజు నన్ను ఎప్పుడు చూస్తానా అని వుందని అందరితో అన్నప్పుడు భలే సంతోషం వేసింది...
ఎందరినో....మంచిగా తీర్చిదిద్దిన మా శ్రీలత గారు మళ్లి జన్మలో కూడా టీచర్ గానే పుట్టాలని వుందని మాలాంటి వారే తనకు శిష్యులుగా కావాలని చెప్పారు....మేమందరం(విద్యార్ధులు) తన ఆస్థి అని గొప్పగా చెప్పుకున్నారు....ఇంతకన్నా మాకు మాత్రం ఏం కావాలి...
రేపు పదవీ విరమణ చేస్తున్న ప్రియాతి ప్రియమైన శ్రీలత టీచర్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇంకా మాలాంటి ఎందరినో తయారు చేయాలని ఎప్పటికి మీ చిరునవ్వు అలానే వుండాలని కోరుకుంటూ ప్రేమతో....మీ ప్రియ శిష్యురాలు                                                                                                                                                          

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భాస్కర్ కె చెప్పారు...

గురువుని మంచి జ్ఞాపకంగా గుర్తుచేసుకోవడం కంటే విద్యార్థి నుంచి ఏ ఉపాధ్యాయుడైనా కోరుకునేది ఏముంటుంది,..ఇది చూస్తే మీ టీచర్ ఎంత ఆనందపడుతుందో కదా....

చెప్పాలంటే...... చెప్పారు...

అవునండి భాస్కర్ గారు వీలున్నప్పుడు చూపిస్తాను థాంక్యు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner