29, అక్టోబర్ 2012, సోమవారం

నేను - అహం - దేవుడు

కొందరికి నేను  అన్న అహం చాలా ఎక్కువగా వుంటుంది....
కొందరేముంది అందరమూ అనుకుంటాము...నాకు నేను గొప్ప అని అది మామూలు విష్యం.
కాకపొతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలా కొద్ది మందికి నేను అన్న అహంకారం అహంతో మిళితమై పోయి ఉంటుంది...మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!!
దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!!

గుడికి వెళ్లి వచ్చినంత మాత్రాన మనం పవిత్రులమై పోము...వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం కాము...ఎన్ని సార్లు గుడికి వెళ్ళాము అని కాదు ఎంత బాగా దేవుని దర్శించుకున్నాము...మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాము..మనం చేసే పని వల్ల కాని, మన మాటల వల్ల కాని ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధ పడుతున్నారేమో అని మాత్రం ఆలోచించం...వయసు తో పాటు కొంత మందికి బుద్ది పెరుగుతుంది...మరి కొంతమందికేమో...మందగిస్తుంది....!! మన గొప్ప మనం డబ్బా కొట్టుకుంటే ఎలా..!! నలుగురూ డప్పు కొడితే...బావుంటుంది కదూ..!!

నా వరకు నేను అనుకుంటాను నేను చాలా బాగా నా బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తున్నానని...కాని లోటుపాటులు ఎన్ని వున్నాయో....నాకు తెలియదు కదా...!! బాధితులకు తెలుస్తుంది...!! కాకపొతే ఏంటంటే...ఈ రోజుల్లో అన్ని బంధాలు బాధ్యతలు డబ్బుతో మాత్రమె ముడి పడి వున్నాయి...అది ఏ బంధమైనా కానివ్వండి..డబ్బే మూలం...!!
అయినా దేవుడే అందరికి మంచివాడు కాదు..అలాంటప్పుడు మనం మాత్రం ఎంత వరకు మంచిని డబ్బిచ్చి కొనుక్కోగం చెప్పండి..?? -:)
పుడుతూ ఏమి తీసుకురాము...పోతూ ఏమీ తీసుకువెళ్ళలేము...అయినా ఎందుకో అహాన్ని వీడలేము...అదే మన బలహినతేమో..!! మహాత్ములకు మనకు మధ్య తేడా అదే కదా...-:)...!!

గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు కోపం తెచ్చుకోకండి ఎవరూ...!!
కాస్త ఆలోచించండి అంతే..!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chinni చెప్పారు...

నన్ను కూడా ఇలాంటి ఆలోచనలే మనసులో తొలిచేస్తుంటాయి.

శ్రీ చెప్పారు...

.మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!!
దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!!దేముడే కాదు అందరి దగ్గరా మనం నేర్చుకోనేది చాలా ఉంటుంది...
ఇది మర్చిపోయి అహంకారాన్ని ప్రదర్శించడమే కూడదు...
ఆత్మాభిమానం ఉండడం మంచిది...అహంకారం మాత్రం మనల్ని అగాధంలోకి తోసేసేదే...
బాగా వ్రాసారు మంజు గారూ!...@శ్రీ

భాస్కర్ కె చెప్పారు...

పెద్దపెద్ద విషయాలు రాసేసారండి, ఏదో చదవడమే వ్యాఖ్యానించడం కష్టమేనండి.హ,.హ.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు సో మచ్ శ్రీ గారు మీరు కూడా చక్కగా చెప్పారు
చిన్ని గారు చాలా వరకు మనం చూస్తున్న విషయాలే కదా మీరు అనుకున్నట్లుగానే చెప్పానా...!! థాంక్యు...-:)
పెద్ద పెద్ద విషయాలు కాదండి నాకు అనిపించినా విష్యం రాశాను అంత....పెద్ద విషయాలు చెప్పడానికి నాకేం తెలుసు చెప్పండి భాస్కర్ గారు...థాంక్యు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner