నాకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ రాంగ్ ప్లేస్ లో చేసారు ...మరి బాగా పేరు అనుభవం ఉన్న డాక్టరే...అది కాక మళ్ళి అమేరికాలో అమెరికనే....నా టైం బాలేదని సరిపెట్టుకున్నా!!
కాన్సర్ మహమ్మారి అసలే తగ్గని రోగం...!! చచ్చిపోతాము అని తెలిసి కూడా మృత్యువుతో చివరి ఘడియ వరకు పోరాడుతాం...ప్రాణం మీద తీపితోనే కదా..!! కిమో ఇచ్చి ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది కాకపొతే మళ్ళి రాకుండా ఉండటానికి రేడియేషన్ తీసుకోండి అని చెప్తే ఎవరైనా తీసుకోకుండా వుండరు కదా...!! కనీసం రేడియేషన్ ఇచ్చినది ఎక్కడో కూడా ప్రిస్కిప్షన్ లో నోట్ చేయకుండా ఇచ్చిన డాక్టర్ ది తప్పా..!! లేక చూసి కూడా చూడనట్లు వున్న రేడియేషన్ తీసుకోవాలి అని చెప్పిన డాక్టర్ ది తప్పా...!! ఏ దారి లేకపోతె ఆఖరున ఇచ్చే ట్రీట్మెంట్ ముందే తీసుకోమని చెప్పిన డాక్టర్ ది తప్పా...!!
ఎంతో మంచి పేరున్న వైద్యులున్న మనకి ఇప్పుడు ఇంత నిర్లక్ష్య వైద్యమా...!! మా పెదనాన్న గారూ వైద్యులే....నాడి చూసి మనకేంటో చెప్పగల మంచి వైద్యులు...మరి ఆ రోజుల్లో ఆయన చదివింది ఎం బి బి ఎస్ మాత్రమే....!!
మొత్తానికి వైద్యం కూడా ఎవరి ఖర్మానికి వాళ్లకి రాసిపెట్టినట్లుంది....రోగం రావడం ఒక ఎత్తయితే సరియైన డాక్టర్ దొరకడం మన అదృష్టం దురదృష్టం మీద ఆధారపడినట్లుంది....!! మొత్తానికి దేవుడు ఆయుష్షు ఇచ్చినా ధన్వంతరి ఆ ఆయుష్షు తగ్గించేస్తున్నాడు....!! కనీసం రోగం వస్తే అది ఎందుకు వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో డాక్టర్లు ఉంటే ....!! తప్పు ఎవరిది..??
నాయనా ధన్వంతరీ.....మీరే దిక్కని వచ్చిన జనాలకి దేవుడిచ్చిన ఆయుష్షుని మీరు మధ్యలోనే పూర్తి చేయకుండా కాస్త ప్రాణం నిలపండి....!!
6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అవునండి నిజమే...మొన్న మా బాబు పన్నుకి దెబ్బ తగిలితే dentist దగ్గరకి వెళ్ళా, ఆవిడ ఏమేమో చెప్పేసింది......infection ఉంది x-ray theeyali,పన్ను లోపల విరిగిపోయి ఉండవచ్చు...ఊడిపోతుంది....మల్లి వచ్చే పన్ను root దెబ్బ తిని ఉండవచ్చు.....ఇవన్ని చెప్పి నన్ను హడలగోట్టేసింది....కానీ ఏమి చేయకుండానే అది తెల్లారికి నెప్పి తగ్గి normal అయిపోయింది ....అప్పుడు అనిపించింది అసలు doctors ని నమ్మొచ్చా అని :(
ధన్యవాదాలండి కావ్యాంజలి గారు మీ అనుభవాన్ని జత చేసినందుకు కొంత మందైనా కొద్దిగా ఆలోచిస్తే బావుండు మనకు కస్టాలు కాస్త తప్పుతాయి
తండ్రిని పోగొట్టుకొన్న ఒక వ్యక్తి యదార్థ గాధను నిన్ననే విని వీస్తూ పోయాను. అది చావు కాదు - హత్య. అసలు రోగానికి చికిత్స చేయకుండా డబ్బు కోసం అన్నట్లు ఏవేవో పనికిమాలిన వైద్యాలు చేసి తనంతట తాను నడుస్తూ తిరుగుతున్న వ్యక్తిని పొట్టనబెట్టుకున్న ఉదంతం అది.
అవును అండి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మనకు తెలియకుండా...!!
మరి వాళ్ళ నిర్లక్ష్యమో లేక చదువుని డబ్బులతో కొనుక్కున్నారో.....!!
nenu ee post ee roje chusanu andi.
naku acute tonsils vaste oka doctor operation cheyali ani cheppadu.
vere ENT specialist daggariki velete,ayana nannu tittina titlu anni inni kavu.
chaduvukunna valle kada, aa matram net lo chusi oka sari disease details and treatment chudalera.
doctors cheppindanta nijam kadu ani full class ichadu.
and tablets tho naku tonsils taggipoyindi.
appati nunchi doctor confirm chesina ,oka sari net lo kuda check chesukontanu.
so doctors ni guddiga nammakudadu
Thank u Sravya mi experence panchukunnanduku
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి