తెలియని తీరాలు మనవి
చేరే గమ్యం ఎక్కడో...!!
కలవని సమాంతర రేఖలే...
అందుకు సాక్ష్యం...!!
ప్రళయమైనా...ప్రణయమైనా...
అనుభవానికి రెండూ ఒక్కటే...!!
విలయంలో వినిపించే గీతమైనా
లయబద్దంగా సాగే సంగితమైనా
శూన్యమైన మనసుకు ఒక్కటే...!!
వేదనలో కనిపించే విషాదమైనా
మనస్పూర్తిగా లేని సంతోషమైనా
ఫలితం ఒక్కటే...!!
చేరే దారి తెలిసినా...
చేరలేని జన్మకు ఎంత కష్టమో..!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ప్రళయమైనా...ప్రణయమైనా...
అనుభవానికి రెండూ ఒక్కటే...!!chaala baagundi
maju gaaroo!...@sri
thank u sri
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి