29, నవంబర్ 2012, గురువారం

దూరం చేయకండి....!!

నాకేనా ఇలా అనిపిస్తుంది లేక అందరికీ ఇలానే అనిపిస్తుందా....!! తప్పకుండా కొందరికైతే అనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను....!! చిన్నప్పటి జ్ఞాపకాలు కాని....చదువుకునేటప్పుడు చేసిన చిలిపి పనులు కాని...మనం స్నేహితులకు చెప్పిన మాటలు కాని...నేస్తాలు మనకు చెప్పిన ఊసులు కానీ....చాలా వరకు ప్రతి పరిచయంతో మనకున్న మంచైనా...చెడైనా...కొంతైనా జ్ఞాపకం లేకుండా వుండదు కదా..!!
ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి దూరంగా వెళిపోతారు....ఏమి కారు...అనుకున్న వారు దగ్గరగా వస్తారు....!! కొన్ని పరిచయాలు పెంచుకోవాలనిపిస్తే...మరికొన్ని తుంచుకోవాలనిపిస్తాయి..!! పరిచయం పరిమళ భరితంగా ఉండాలి కాని....!!
నాకున్న పరిచయాలలో...కొందరేమో మనం దగ్గరగా వెళ్ళినా దూరం జరిగి పోతున్నారు....మరికొందరేమో ఆప్యాయంగా దగ్గరకి వస్తున్నారు....ఎప్పుడూ ఒకేలా అందరితో ఉన్నా మరి ఈ తేడా ఎందుకో...!!
అవసరానికి మాత్రమె....స్నేహమా.....!! చుట్టరికమా.....!! అనుబంధమా.....!! అవసరం తీరినా....ఇల్లు దాటినా ఇక నువ్వెవరో....!! నేనెవరో....!! అన్నట్లుంది ఈ రోజుల్లో...డబ్బులు అడుగుతారనో....సాయం చేయమంటారనో....లేక ఇంకేదైనా అడుగుతారనో....భయపడక...కనీసం కొన్ని పరిచయాలనైనా....అనుబందాలనైనా గుర్తు ఉంచుకోండి....!!
మనమే....ఇలా ఉంటె మన తరువాత తరాలకు అమ్మ...నాన్న బంధం కూడా గుర్తు లేకుండా పోతుంది....!! బంధాలకు మారు పేరైన భరతావనిని అనుబంధాలకు....అభిమానాలకు దూరం చేయకండి....!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chinni చెప్పారు...

మంజు గారు, మనతోపాటే ఉండాలనుకున్న వాళ్లు మనం వద్దనుకున్న్న వస్తారు. ఇక మనల్ని వదిలిపోయే వాళ్లను మనం దూరం చేసుకోకుండా బంధం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. మరీ అవతలివ్యక్తి మొండిగా ఉంటే ఏం చేయలేము. వాళ్లతో గడిపిన ఙ్ఞాపకాలతో ముందుకు సాగిపోవడమే.

జలతారు వెన్నెల చెప్పారు...

మంచి మాట చెప్పారు మంజు గారు.

శ్రీ చెప్పారు...

మంజు గారూ!చాలా బాగా చెప్పారు...కొన్ని బంధాలు పాకులాడినా దగ్గరకు రావు...కొన్ని బంధాలు వాటంతట అవే దగ్గరౌతాయి....@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

అవును చిన్ని గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను ధన్యవాదాలు మీ స్పందనకి
థాంక్యు వెన్నెలా
అవును శ్రీ గారు కొన్ని అలా మరికొన్ని ఇలా -:) థాంక్యు

భాస్కర్ కె చెప్పారు...

బాగా రాశారు,.కాని బంధాలు క్రమంగా దూరమవుతున్నట్లే వున్నాయండి,....

చెప్పాలంటే...... చెప్పారు...

అవును భాస్కర్ గారు అందుకే....
థాంక్యు అండి

కావ్యాంజలి చెప్పారు...

చాలా బాగా చెప్పారు మంజు గారు, అవతలి వాళ్ళు మరీ busy గా ఉంది,మాట్లాడనప్పుడు, మనమే కలుపుకుపోతే సరి....మరీ కావాలని దూరం అవ్వాలనుకునే వాళ్ళని కలుపుకోలేం అనుకోండి

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అంజలీ వద్దు అనుకునే వాళ్ళ వెనుక ఎంత వరకు పోగలం....థాంక్యు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner