పుస్తకాలు చదివినంత మాత్రాన కాని..వార్తలు చూసినంతనే కాని..ఉత్తరాలు చదివినంత మాత్రాన జనాలు మారతారా...!! అంటే ఏమో తెలియదు కాని ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ మూడు వుండేది...కొత్తగా వచ్చిన శివారెడ్డి ఆ క్లాసు తీసుకునేవారు. ఒక రోజు పరీక్ష పెడితే ముందుగా నేనే రాయకుండా బయటికి వెళిపోయాను...నా తరువాత చాలా మంది వచ్చేసారు...అందరివి పేర్లు ఆయన నోట్ చేసుకున్నారనుకుంటా..!! ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రాక్టికల్స్ లో ఆ లాబ్ లో వరుసగా క్లాసు లో పరీక్ష రాయని అందరిని ఎదో ఒక వంక పెట్టి ఫెయిల్ చేస్తున్నారు...ఇక నా వంతు వచ్చింది....నేను సర్క్యూట్స్ కాని, రీడింగ్స్ కాని కరక్ట్ గా వుంటాను....కాక పొతే ఇక్కడ ఏమైందంటే...ముందు మనకి వచ్చిన దానికి సర్క్యూట్స్ , టేబుల్స్, ఫార్ములా వేసి సార్ కి చూపించి కరక్ట్ అంటే మిగిలినది చేయాలి...అందుకని ముందు వేసి చూపిస్తే...రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో అన్నారు....సరిగానే వేసా కదా ఇలా అంటున్నారేంటా అని నాకు డౌట్ వచ్చి మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళి వేరేది వేసి చూపించా..!! ఉచ్ ఒన్ యు వాంట్ టు డు..డు ఇట్ అన్నారు...మళ్ళి వెంటనే వైవా కి రమ్మని పిలిచారు...అడిగి పంపేసారు....ఆ రోజు హాస్టల్ కి వచ్చేసాక ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేసాను...తెలుగులోనే సుమా రాసింది...ఆయనకు తెలుగు చదవడం రాదనుకుంటా..!! వాళ్ళ ఫ్రెండ్ తో చదివించుకున్నట్లు వున్నారు....!!
మరుసటి రోజు నా ఫ్రెండ్ తమిళ్ అమ్మాయి లాబ్ ఎగ్జామ్ కి వెళితే....తనకి బాగా హెల్ప్ చేసారంట...మొహం బాగా చిన్నబోయి వుంది మంజు నాకు మాత్రమె కాదు అందరికి చాలా బాగా హెల్ప్ చేసారు ఈ రోజు అని చెప్పింది...హాస్టల్ కి రాగానే...ఇప్పట్లా అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండీ వెంటనే చెప్పడానికి....!!
అలా మొత్తానికి అప్పుడు నా లాబ్ పోయింది....తరువాత వెళ్ళినప్పుడు ఆ సారే చాలా చక్కగా మాట్లాడారు లాబ్ లో....అప్పుడు నేను కుడా ముందు ఏమి అడగలేదు మొత్తం చేసి ఫైనల్ గా చూపించాను....మద్యలో వచ్చినా..నా పని నేను చేసుకున్నాను..తప్ప ఏమి అడగలేదు...!! వైవా కుడా బాగానే అడిగి పంపేసారు....!!
ఉహించని మార్పు అది...!! ఇలాంటివి ఇంకా కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా...!!
మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకసారి తప్పుని ఒప్పుకుని కాస్త మారితే...చాలా ఇబ్బందులు తప్పుతాయి అందరికి...!! నాకు అన్ని తెలుసు వీళ్ళ మాట నేనెందుకు వినాలి అని కాకుండా తప్పు ఎక్కడ వుంది అని కాస్త తరచి చూసి మార్చుకుంటే...అందరు మంచివారే....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆఖరున చెప్పిన మాటలు నిజంగా ఆలోచించాల్సినవండీ.. మీ అనుభవం బాగుంది.. మీకే కాక అందరికీ మేలు జరిగింది. చాల సంతోషకరమైన విషయం ఇది.
థాంక్యు సుభ గారు నాకు అప్పుడు చెడు జరిగినా అందరికి మంచి జరిగింది మనం మారితే చాలు మనతో పాటు మరి కొందరు....-:)
అందుకే కదండి నేను చేసిన తప్పుని వెంటనే ఒప్పేసుకుంటాను:-) మంచి సందేశం!
అందుకే మీరు చాలా మంచి అమ్మాయి కదా...!! పద్మార్పిత గారు....థాంక్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి