2, జనవరి 2013, బుధవారం

నాలుగో పుట్టినరోజు....!!

మొత్తానికి అదిగో ఇదిగో అంటూ నాలుగో పుట్టినరోజు చేసుకుంటోంది నా బ్లాగు...తీపి చేదు కబుర్లు కాకరకాయలతో...నాకు రాయాలనిపించిన కవితలతో...!!
నా కబుర్లను కవితలను....మొత్తంగా నా రాతలను అభిమానిస్తున్న...ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు....!!
బ్లాగు మొదలెట్టి నాలుగేళ్ళు అయినా రాయడం మొదలు పెట్టి మూడు ఏళ్ళు పూర్తి అయింది...తారిఖు గుర్తు లేదు కాని జనవరి నెల అని గుర్తు కాబట్టి ఈ నెలంతా నా బ్లాగు పుట్టినరోజే....!!
మా ట్రస్ట్ కోసం బ్లాగు మొదలెట్టి నాఆలొచనలు పంచుకుందామని...
నాలోనేను అని పేరు పెట్టి..చాలా ఉన్నాయి ఆ పేరుతొ....అని మళ్ళి కబుర్లు కాకరకాయలుగా రూపాంతరం చెందిన నా బ్లాగు ఇలా నాలుగో పుట్టినరోజు చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది...ఎందుకంటే...ఇన్ని టపాలు రాస్తానని కాని...ఇంత మంది చూస్తారని కాని...అభిమానిస్తారని కాని..అనుకోలేదు...ఏదో నాకు అనిపించింది రాయడం తప్ప చేయి తిరిగిన రచయితను కాదు...నా కోపాన్ని రాయడం...ఉత్తరాలు రాయడం తప్ప రాయడానికి వేరే ఏమి రాదు...!!
ఆవేదనను...ఆక్రోశాన్ని...సంతోషాన్ని...బాధను...ఇలా ప్రతి అనుభూతిని పంచుకునే ప్రియ నేస్తం..అదే నాకు నా బ్లాగుతో ఉన్న అనుబంధం...!!
మరి నాకు ఇంత ఇష్టమైన నా కబుర్లు కాకరకాయలు కి మీ అభినందనలు చెప్పరూ...!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chinni చెప్పారు...

మంజు గారు, మీ కబుర్లు,కాకరకాయలు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆశిస్తున్నాను..మీ బ్లాగు రూపకర్త అయిన మీకు అభినందనలు.:)

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చిన్ని గారు మీ అభిమానానికి అభినందనలకు -:)

Unknown చెప్పారు...

4 samvatsaraala mee prayaananiki abinandanalu ee prayaanam ilaage konasaaguthu andarini alarainchaalani korukuntunnaanu

శ్రీ చెప్పారు...

మంజు గారూ!...నాలుగు వసంతాలు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు మీకు...@శ్రీ

మాలా కుమార్ చెప్పారు...

మీ బ్లాగ్ నాలుగో పుట్టినరోజు కు శుభాకాంక్షలు .

రసజ్ఞ చెప్పారు...

మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు!

జ్యోతిర్మయి చెప్పారు...

మీ కబుర్లు కాకరకాయలు కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు ఎస్ కే వి రమేష్ గారు, రసజ్ఞ గారు,
మాలా కుమార్ గారు, శ్రీ గారు,
జ్యోతిర్మయి గారు....మీ అభినందనలకి సంతోషంగా ఉంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner