7, జనవరి 2013, సోమవారం

తేడా.....!!

అబ్బాయిలకేం ఇంచక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళిపోతారు.....ఏ బాదరబంది లేకుండా...!! అదే అమ్మాయి ఐతే పెళ్లి కాక ముందు అమ్మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి....పెళ్లి అయితే మొగుడి పర్మిషన్...తరువాత పిల్లల పర్మిషన్ కూడా తీసుకోవాలి...అప్పుడప్పుడు....!! ఏం చేస్తాం సృష్టి కర్త కూడా మొగవాడే కదా....అందుకే తేడా చూపించాడు తన సృష్టి లో కూడా....!!
ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా వదిలేసి వెళిపోగలడు మగాడు...అమ్మాయి వెళ్ళలేదు...ఎంత ముఖ్యమైన అవసరమైనా....ఇంటిని పిల్లల్ని వదిలి వెళ్ళలేదు...!! అదీను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పనక్కరలేదు...అబ్బాయి..!! ఎంత వెసులుబాటో కదా...అబ్బాయికి...!! అదే అమ్మాయి ఐతే ఎన్ని ప్రశ్నలో....ఎన్ని ఆరాలో...!!! బయటికి వెళ్ళాలంటే...!!
ఏ పని చేయాలన్నా కూడా ముందుగా అందరి దగ్గరా ఆమోదముద్ర వేయించుకోవాలి అమ్మాయి...!!
అబ్బాయికైతే....నాకు అనిపించింది...నేను అది చేసేసాను...అని చెప్పేస్తే అబ్బో వాడు అది చేసేసాడంటా...వాడికి చాలా ధైర్యం అని గొప్పగా చెప్తారు...!!
అందరూ కాదండి కాని చాలా మంది ఇలానే ఉన్నారు ఇంకా...!!
ఎందుకో ఈ తారతమ్యం...ఎప్పటికి మారుతుందో....ఈ పరిస్థితి....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

anrd చెప్పారు...

సృష్టి కర్త కూడా మొగవాడే కదా....అందుకే తేడా చూపించాడు తన సృష్టి లో కూడా....!!
ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా వదిలేసి వెళిపోగలడు మగాడు...అమ్మాయి వెళ్ళలేదు...ఎంత ముఖ్యమైన అవసరమైనా....ఇంటిని పిల్లల్ని వదిలి వెళ్ళలేదు...!! అదీను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పనక్కరలేదు...అబ్బాయి..!! ఎంత వెసులుబాటో కదా...అబ్బాయికి...!! అదే అమ్మాయి ఐతే ఎన్ని ప్రశ్నలో....ఎన్ని ఆరాలో...!!! బయటికి వెళ్ళాలంటే...!!
ఏ పని చేయాలన్నా కూడా ముందుగా అందరి దగ్గరా ఆమోదముద్ర వేయించుకోవాలి అమ్మాయి...!!
....................................
నిజమేనండి, ఆడవాళ్ళు పై విధంగా అనుకుంటారు ,.............

* అయితే, ఆడవాళ్ళు గర్భం ధరించి కొంతకాలం కష్టపడినా , పుట్టిన సంతానం తమ సంతానమే అని ఖచ్చితంగా చెప్పుకోగలరు.....
* అందుకే, ఆడవాళ్ళు వారి ఇష్టం వచ్చినట్లు వారు బయటకు వెళ్ళవద్దు ..... అని చెప్పటానికి సరైన కారణాలున్నాయనిపిస్తుంది.
* అరటాకు ముల్లుపై పడినా, ముల్లు అరటాకుపై పడినా నష్టం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా..
................

సృష్టిలో స్త్రీలకు కొన్ని బాధ్యతలు + హక్కులు ఉన్నాయి.
సృష్టిలో మగవారికి కొన్ని బాధ్యతలు + హక్కులు ఉన్నాయి.
.....................

ఇలా వ్రాసినందుకు మీరు దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దండి. మీరు వ్రాసిన టపాకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించాలన్నది నా అభిప్రాయం కాదండి.

చాలామంది స్త్రీలు ,సృష్టి కర్త కూడా మొగవాడే కదా....అందుకే తేడా చూపించాడు తన సృష్టి లో కూడా....!! అని అపోహపడటం జరుగుతోంది.
సృష్టికర్త స్త్రీలకు, పురుషులకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. అని నాకు అనిపించింది. అందుకే నా అభిప్రాయాలు చెప్పాలనిపించి ఇలా వ్రాసాను.

* ఈ వ్యాఖ్యను వెయ్యనా ? వద్దా ? వేస్తే మీరు అపార్ధం చేసుకుంటారా ? అని చాలాసేపు ఆలోచించాను. మీరు అపార్ధం చేసుకోరన్న నమ్మకంతో వ్యాఖ్యను వేస్తున్నానండి.

anrd చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

anrd గారు నా టపా కి మీ స్పందనకి ముందు గా నా ధన్యవాదాలు...అపార్ధం చేసుకోవడానికి ఏముందండి....అందరికి తెలిసినవే కదా...!!
ఇద్దరికి హక్కులు + బాధ్యతలు ఉంటాయి కాక పొతే మగవాళ్ళకి ఉన్న వెసులుబాటు ఆడవారికి లేదనేది నేను చెప్పాలనుకున్నది....!!
అందరు మొగవారు చెడ్డ వారు కాదు...అలా అని అందరు ఆడవారు మంచి వారు కాదు....మంచి చెడు ఇద్దరిలో ఉన్నాయి.....!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner