13, ఫిబ్రవరి 2013, బుధవారం

లెక్కలో వేసుకోవాలా....!!

మెత్తగా ఉన్నాం కదా అని అందరు పెత్తనం చెలాయించే వాళ్ళే....హన్నా మరీ గాంధీ గారి లానో...మదర్ థెరీసానొ అనుకుంటే ఎలా కుదురుతుంది...!! గాంధి గారి సిద్దాంతాలలో కాని...వివేకానందుడి బోధనలలోనూ....రామకృష్ణ పరమహంస చెప్పిన మాటల్లోనూ....మదర్ థెరీసా ఓర్పులోనూ కాస్త కాస్త మాత్రమే ఒంటబట్టించుకోగలం...!! వాళ్ళు చెప్పినవి..చేసినవి..అన్నీ..మనం చేయలేము....!!
చెప్పింది చేయాలంటే ముందు మనం ఆచరించి తరువాత చెప్పాలి వాళ్ళలో నాకు నచ్చింది కూడా అదే....!!
అంతే కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే అంత సాదు స్వభావం లేదు...కాకపొతే కాస్త...సమయం...!!
అదే ఎదుటి వాళ్ళు చాతకానితనం అనుకుంటే అది వాళ్ళ ఖర్మ....దానికి మనమేం చేయగలం చెప్పండి...-:)....!!
వయసు పెరిగినా బుద్ది మారని వాళ్ళని ఎప్పటికి ఏం చేయలేము...పిల్లలు....చిన్నవాళ్ళు అని తప్పుగా ప్రవర్తించినా సరిపెట్టుకోకుండా పెద్దవాళ్ళే వెధవ  బుద్దులు చూపిస్తుంటే....వాళ్ళని ఎన్నిసార్లు పోనిలే అని వదిలేయాలి....!!
బంధాలతో...బాధ్యతలతో...పని లేకుండా ఒక్క  డబ్బు దాహాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని వయసుకు...తగినట్టుగా ప్రవర్తించక పోతున్న పెద్ద మనుష్యులను లెక్కలో వేసుకోవాలా....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

ఏమైంది మంజు అంత హాట్ హాట్ గా వున్నారు :)

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమి లేదండి పడే వాళ్ళనే అంటూ ఉంటారు ఎప్పుడూ.....అలానే చూసే వాళ్ళనే మాటలు అంటారు....ఎంత బాగా చూసినా ఎదురు మాటలు....మరి కోపం రాదేంటి.....
నేనేం గాంధీ ని కాదు కదా అంత ఓర్పు లేదు -:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner