వదలలేని మమకారం పెంచుకుంటే....!!
మనసు బంధం పెనవేసుకుంటుంది...!!
అలవికాని ఆశల సౌధాలు ఊరిస్తాయి...!!
పెనవేసుకున్న పాశం పిలుస్తుంటే....!!
వెళ్ళలేని నిస్సహాయత వెక్కిరిస్తుంది వంకరగా...!!
పంచుకోలేని మాటలకు మౌనమే సాక్ష్యం....!!
పెంచుకోలేని అనుబంధానికి వేదనే నిదర్శనం....!!
జారి పోతున్న కన్నీటి చుక్కలే చెప్తున్నాయి...!!
నా ఉనికి నీలోనే...నీతోనే...ఉందని...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి