నాకు నువ్వు కావాలి
నీకు అందరు కావాలి...!!
ఒక్క నేను తప్ప...!!
ఏమిటో ఈ బంధం...!!
దగ్గరే ఉంటూ...
దూరం జరిగి పోతున్నావు
చేరువనే ఉన్నా తెలియని..
అంతరమే...మన మధ్య !!
ఏమిటో ఈ అగాధం...!!
చేజారిపోతోంది జీవిత కాలం....
మనకు తెలియకుండానే...!!
చేయి జారిపోతోంది
మన జీవితం....!!
చివరి మజిలి చేరకుండానే....!!
ఏమిటో ఈ అర్ధం లేని ప్రయాణం...!!
జీవితానికి అర్ధం సార్ధకత
పరిణితి పరిపక్వత
బంధాలను బాధ్యతలను
ఆనంద విషాదాలను
కలిసి పంచుకుంటేనే...పరిపూర్ణత...!!
అదే ఈ విన్నపం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి