నిన్న హైదరాబాద్ లోబాంబ్లు పేలిన తరువాత దృశ్యాలు టి వి లో చూస్తుంటే అప్పటి సంగతి గుర్తు వచ్చింది.
మనకు కోపం ఉంటె ఎవరి మీద కోపమో వాళ్ళ మీద తీర్చుకోవాలి అంతేకాని ఏమి తెలియని అమాయకుల మీద మన ప్రతాపం చూపడం కాదు....!! బాంబ్ పేల్చినంత బాగా పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా...!! ఉగ్రవాదులమంటూ చేసే ఈ అకృత్యాలు ఏం సాధించదానికి...?? అమాయకుల ఉసురు పోసుకోవడం తప్ప...!!
వందల మంది ప్రాణాలు తీసిన వారిని హాయిగా కూర్చోపెట్టి రాస మర్యాదలు చేస్తున్నారు...మన చట్టం కూడా మారాలి తప్పుకు వెంటనే శిక్ష అమలు చేయాలి...ఆ శిక్ష కూడా ఎవరు మళ్ళి తప్పు చేయాలన్నా భయపడేటట్లు ఉండాలి...!!
క్షమకు కూడా అర్ధాన్ని మార్చేస్తున్నాయి జరుగుతున్న సంఘటనలు...గోకుల్ చాట్...లుంబినిపార్క్...తాజ్ హోటల్స్ ...బెంగుళూరు ఇలా ఎన్ని జరుగుతున్నా కేసులు, సాక్ష్యాలు అంటూ తాత్సారం చేస్తూ...సాక్ష్యాలతో దొరికిన వాళ్ళని శిక్షలు వేసి కూడా అమలు చేయకుండా వాళ్ళని రాజాల్లా మేపుతూ మీన మేషాలు లెక్కేస్తుంటే రేపటి రోజుల్లో మరెన్ని దాడులు చూడాలో....!! చూడటానికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి