వావి వరుసలు పక్కన పెడితే....కనీసం వయసు తారతమ్యాలు కూడా చూడకుండా ఏది పడితే అది వాగుతున్నారు...అలా వాగడం గొప్పగా అనుకుంటున్నారేమో....మరి...తెలియని అమ్మాయిని కాదు అమ్మని కూడా రమ్మని అడిగేంతగా మన ఈ నాటి యువత దిగజారిపోతోంది...!! వేలకు వేల జీతాలు తీసుకుంటూ ఇంత కుసంస్కారం అలవరచుకుంటున్న యువతతో రేపటి సమాజం ఎలా ఉండబోతోందో అని తలచుకుంటేనే భయంగా అనిపిస్తోంది...!! అందరూ ఇలా ఉంటున్నారని కాదు కొందరు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే....రేపటి గురించే కాదు ఈ రోజు కూడా భయంకరంగానే అనిపిస్తోంది....!!
మనకు ఎంత భావ ప్రకటన స్వేచ్చ ఉంటే మాత్రం ఎదుటి వారిని బాధ పెట్టె హక్కు లేదని తెలుసుకుంటే బావుంటుంది... ఎవరైనా...!! నోటికి ఎంత వస్తే అంతా వాగకుండా పదాలు...మాటలు ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అందరికి...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి