కాకపొతే మరీ మనకు సాయం చేసిన చేతిని నరికేంత మంచితనం మాత్రం పెంచుకోకండి....చేసిన సాయం గుర్తు ఉంచుకోక పోయినా పర్లేదు కానీ....మన స్వార్ధం కోసం అమ్మని నాన్నని కూడా విడదీసేంత మంచితనం ముసుగు వేసుకోకండి...దయచేసి....!!
మనవి మాత్రమే డబ్బులు కాదు ఎదుటివారివి కూడా డబ్బులే....ఎవరికీ ఊరికినె డబ్బులు రాలవు...మన సొమ్ము మనకి ఎంత జాగ్రత్తో అంతే జాగ్రత్తగా ఎదుటివారి కష్టాన్ని కూడా చూడాలి....మన అవసరం తీరిపోతే చాలు...వాళ్ళు ఎలా పొతే మనకెందుకు అనుకుంటే అదీ ఓ రకంగా ఈరోజుల్లో మంచితనమేమో...!!
అన్ని మనం అనుకున్నట్లుగా జరిగిపోతే....దేవుడు అనేవాడు మనకి గుర్తు ఉండడు...అంతా మన గొప్పే అనుకుంటాము....కాకపొతే మన మంచితనానికి లెక్క మన పైవాడి దగ్గర భద్రంగా ఉంటుంది....:)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి