26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఎవరు స్ట్రాంగ్...!!

మొన్న ఒకరోజు దోమల్ని చంపుదామని మొదలు పెట్టి పాపం అవి రోజు మమ్మల్ని కుడుతున్నాయని మేము వాటిని చంపడం....మా ఇంట్లో గత ఐదు ఆరు నెలల నుంచి రోజు జరిగే దినచర్య...సినిమా చూస్తూ ఎందుకో అనుకోకుండా అప్పటికప్పుడు బాట్ పట్టుకుని గదిలోకి వెళ్లాను...కొన్నిటిని చంపాను...అవి మరి బాగా తిట్టేసుకుని ఉంటాయి...మంచం మీద నుంచి మరి కాలు ఎలా జారిందో తెలియలేదు మొత్తానికి మోకాళ్ళ మీదకి పడి నుదురు ఒక పక్క గోడకి ఎంత బాగా కొట్టుకుందంటే గోడకి తడి అలా ఉండి పోయింది నుదురు బొప్పి అంతే ఉన్ది..!! కాని గోడ పగలలేదు నా నుదురు పగలలేదు...కాళ్ళు విరగలేదు...మొత్తానికి గోడ నేను రెండూ గట్టే...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

"కొన్నిటిని చంపాను...అవి మరి బాగా తిట్టేసుకుని ఉంటాయి"
చంపినవి ఇంకేం తిట్టుకొంటవిలెండి!!

చెప్పాలంటే...... చెప్పారు...

అంటే అజ్ఞాత గారు నా ఉద్దేశ్యం చంపుతున్నప్పుడు బాగా తిట్టేసుకుని ఉండి ఉంటాయి అని -:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner