ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి...!! చేతికందిన కొడుకు చేయిదాటిపోతే దిగులు గుబులు దాచుకుని ఉన్న వాళ్ళకో ఆసరా కావాలని తాపత్రయ పడుతుంటే మేము మలిచిన శిల్పమే మమ్ము కాదంటుంటే...!! ఎవరికీ అక్కరలేని ఈ మూడుకాళ్ళ ముసలి జీవితం తట్టుకోగలదా...!! రేపో మాపో అంటున్న మా జీవితాలు మీరు చీ కొడుతున్నా, దులపరిస్తున్నా...భరిస్తున్నాయే కాని కొడుకు గుర్తుగా మిగిలిన రక్త బంధాన్ని చూడకుండా దూరంగా పోగలవా...!! అన్ని చేస్తూ అంత దూరంగా దూర దూరంగా ఉండటమంటే ఎంత కష్టం...!! పగవారికి కూడా ఈ బాధ వద్దు అని కోరుకుంటాము. మీ అవసరాలకి పనికి వచ్చిన మేము ఇప్పుడు మీరు అందలాలెక్కారని మీ హోదాకి సరిపోవడం లేదా...!! లేక మీ ఆనందాలకు అడ్డుగోడగా ఉన్నామని అనుకుంటున్నారా....!!
చదువు సంస్కృతి, సంస్కారం నేర్పాలి, ఉద్యోగం బాధ్యతను గుర్తు చేయాలి కాని బంధాలను తెంచాలనుకోకూడదు. పెద్దలు చెప్పిన ఓ మాట గుర్తు వస్తోంది తాతకు పెట్టిన ముంత తల వేపునే ఉంటుంది మనకు. గత జన్మ ఖర్మ ఫలితాలు కొన్ని అయితే మనం చేతులారా చేసుకునే ఖర్మలు కొన్ని. చేతిలో కాస్తో కూస్తో డబ్బున్న మా పరిస్థితే ఇలా ఉంటె ఏమి లేని వారి గతి ఏమిటో మరి....!! జీవిత చరమాంకంలో ఉన్నా వదల లేని బంధాల పాశాలు పెనవేసుకుని వదలలేక రోజు చస్తూ బతుకుతున్న మాలాంటి వారు ఎందరో ఈ ప్రపంచంలో....!! కొందరికేమో అన్ని ఉన్నా, అందరు ఉన్నా ఏకాకిలా బతకడం ఇష్టం...!! బంధాలను బాధ్యతలను గాలికి వదలి ఏక్ నిరంజన్ అంటూ బతకడం వాళ్ళకిష్టం....!! ఏం చేస్తాం ఎవరి నుదుటి రాత వారిది....!! మా జీవితాలు ఎలా తెలవారిపోనున్నాయో ఈ చివరి దశలో....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పగవారికి కూడా ఈ బాధ వద్దు అని కోరుకుంటాము. మీ అవసరాలకి పనికి వచ్చిన మేము ఇప్పుడు మీరు అందలాలెక్కారని మీ హోదాకి సరిపోవడం లేదా...!! లేక మీ ఆనందాలకు అడ్డుగోడగా ఉన్నామని అనుకుంటున్నారా....!!
బాగా చెప్పారు మంజు గారు. బాధ్యతలనుండి తప్పుకుంటున్న కొడుకులకు కనువిప్పు కలిగేట్టు. అభినందనలతో..
బాగాచెప్పారు.
చరమాంకంలో ఆర్ధిక సమస్యలుండకూడదు!చివరి క్షణాలదాకా ఇతరులమీద ఆధారపడకూడదు!యెక్కువ అనుబంధాలు ఆపేక్షలు పెంచుకొని విలవిలలాడరాదు!మన బతుకు మనం బతకాలి!ఉన్నదంతా ముందే పిల్లలకు పంచిపెట్టకూడదు!ఇక్కడ అమెరికాలో వృద్ధాశ్రమాలు చూస్తున్నాను!ఎవరికి వారే!మనవద్దకూడా ఆ పద్ధతి రావడానికి ఇంకా ఎంతోకాలం పట్టకపోవచ్చు!
ధన్యవాదాలు వర్మ గారు కొడుకులే కాదండి కొడుకులను కోల్పోయిన తలిదండ్రులకు కోడలే కూతురు కావాలని నా ఆశ....
ధన్యవాదాలు చిన్ని గారు
అవును ప్రకాష్ గారు మీరు చెప్పింది నిజమే ఇప్పటికే అలా ikkada కుడా వచ్చేసాయండి కాకపొతే పెద్ద వాళ్లకు ప్రేమలు ఆప్యాయతలు తగ్గలేదు అది సంగతి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి