రాలిపోయిన పువ్వులా వాడి పోయిన మొగ్గలా
వన్నెలు తరిగి వెలసి పోయిన రంగుల జీవితం
అక్కడక్కడా మట్టి చారికలు వెక్కిరిస్తూ
అంతలోనే పక్కన వాన నీటి గుర్తులు
ఇంకిన కన్నీటి సంద్రానికి సరిహద్దుగా
గుంటలు పడిన పై కప్పులో కనిపిస్తూ
గొంతును నొక్కేసిన రక్కసి ఉక్కు పాదాలు
జరుగుతున్న రాక్షస క్రీడలో తమ భాగంగా
న్యాయం నోరు నొక్కేసి చట్టం కళ్ళను కప్పేసి
అన్యాయానికి పట్టం కట్టే అఖండ సింహాసనం
కబంధ హస్తాల నడుమ నలిగి రాలిపోయిన
లేత చివురాకుల జ్ఞాపకాల చుక్కల ముక్కలు
ఆకాశంలో తారాడే అందమైన నక్షత్రాలు
చీకటి చుట్టానికి నేస్తాలు
పగిలిన మనసుకు బంధాలు
ఒంటరిగా మిగిలి పోయిన జీవశ్చవాలు....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"న్యాయం నోరు నొక్కేసి చట్టం కళ్ళను కప్పేసి
అన్యాయానికి పట్టం కట్టే అఖండ సింహాసనం
కబంధ హస్తాల నడుమ నలిగి రాలిపోయిన
లేత చివురాకుల జ్ఞాపకాల చుక్కల ముక్కలు"
ఎంత అద్భుత భావనావేసం, చిక్కని వర్ణన .... చాలా బాగుంది. అభినందనలు మంజు గారు!
మనఃపూర్వక వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి