28, మార్చి 2014, శుక్రవారం

ఇలానే నిలిచి పోవాలని....!!

ఈ మధ్య పాడుతా తీయగా చూస్తూ ఉంటే చాలా రోజుల క్రిందట నేను బాలు గారిని వారం వారం విజేతల ఎంపిక విషయంలో కొన్ని వారాలు ఆఖరులో చివరి పోటి నిర్ణయానికి ముందు విమర్శించాను....నాతొ పాటు నన్ను సమర్ధించిన నా సహా బ్లాగర్లను వారు చివరిలో చాలా కోపంగా మాట్లాడారు.....ఇది జరిగి చాలా రోజులు అయ్యిందిలెండి...తరువాతి నుంచి చక్కని వ్యాఖ్యానంతో పాటు పిల్లలకు....పెద్దవారికి చక్కని సలహాలను ఇస్తూ వారి వారి వయసుకు తగిన స్థాయిని గుర్తు చేస్తూ వారికి సూచనలు సలహాలను  అనేది చాలా సంతోషదాయక విషయం నాకైతే...!! ఎప్పుడైనా కాస్త పొరపాటుగా మాట్లాడినా దాన్ని ఒప్పుకుంటూ వారి గౌరవాన్ని మరింత పెంచుకుంటున్నారు...ఈ మధ్య ఒక ఇంటి పేరును పొగిడి మళ్ళి తన మాటను తిరిగి గుర్తు చేసి పొరపాటును ఒప్పుకున్న సహృదయం వారిది...నాకు వీలైనంత వరకు నేను అతి ఇష్టంగా చూసే పాడుతా తీయగాలో బాలు గారు ఇంత మంచి మనసును తీయని గాత్రాన్ని తద్వారా అందరికి మంచి విషయాలను విలువలను అందిస్తున్నందుకు మనఃపూర్వక నమస్సులు...నేను విమర్శించినప్పుడు దానిలో నిజాన్ని అప్పుడు కోపంగా మా మిద మాట్లాడినా తరువాతి నుంచి న్యాయ నిర్ణయాలు చాలా చక్కగా విమర్శలకు తావు లేకుండా ఉంటున్నాయి....అందుకు చాలా సంతోషం...నేను నాతొ పాటు తిట్లు తిన్న చాలా మందిమి ఆయన పాటలకు దాసోహులమే కాని ఆయన ముందు సంగీతంలో సాహిత్యంలో ఓనామాలు తెలియని మేము ఎంత చెప్పండి....!! ఇంట చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ టి వి వారు ఒక్క బ్లాక్ కార్యక్రమం పేరును కూడా అప్పటిలో మార్పు చేసి ఉంటె చాలా బావుండేది..!! పాటల ప్రియుల మనసులు దోచే కార్యక్రమాలు అందిస్తున్న ఈ టి వి వారికి మా ప్రత్యెక అభినందనలు..!! అందరి మనస్సులో బాలు గారు ఇలానే నిలిచి పోవాలని మా అందరి కోరిక కూడా...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

voleti చెప్పారు...

ఇంటి పేరు గురించి వివరణ ఇచ్చారు అని రాశారు కదా..ఆ ఎపిసోడ్ తాలుకా లింక్ ఇవ్వగలారా..

చెప్పాలంటే...... చెప్పారు...

అది కనుక్కుని చెప్తాను అండి ఈ మధ్యనే నాకు ఆరోగ్యం బాలేక కొన్ని చూడలేదు వేరే వారిని కనుక్కుని ఆ లింక్ మీకు పంపుతాను

చెప్పాలంటే...... చెప్పారు...

యు టూబ్ లో మొన్నటి వారం కాని ఆ ముందు వారం కాని అండి ఆ లింక్ చుడండి మొదట్లోనే చెప్పారు 24/03 లేదా 17/03

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner