27, మార్చి 2018, మంగళవారం

కాలం..!!

కదలిపోయే కాలం చేసే వింతలెన్నో
విచిత్రాల సచిత్ర కథనాల కన్నీళ్లెన్నో
గతపు గాయాల గాధల వ్యధలెన్నో
జ్ఞాపకాల చెమరింతల చేవ్రాలులెన్నో
వాస్తవాల వ్యాపకాల అంతర్మథనాలెన్నో
నిలువరించలేని శ్వాసల ఆక్రోశాలెన్నో
వర్తమానాల ఆశల ఊహల విహంగాలెన్నో
రాలిపడే రాచిలుకల రెక్కల లెక్కలెన్నో
నజరానాలు అక్కర్లేని అనుబంధాలెన్నో
నయగారాల్లో మునిగి తేలే మురిపాలెన్నో
అస్తవ్యస్తపు జీవితాల ఆటవిడుపులెన్నో
గెలుపోటముల చిరునామాల్లో
కాలగతిలో నిలిచిపోయే చరిత్రలెన్నో
మరలిరానిది మార్పు లేనిది
ఎవ్వరితో నిమిత్తం లేనిదీ కాలచక్రం
హరిహరాదులకు సైతం అంతుచిక్కనిది..!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

హరిహరాదులకు సైతం అంతుచిక్కనిది-ఈ వాక్యం అర్థం తెలిసే వ్రాసారా. ఎందుకమ్మా ఈ బుచికి తవికలు రాస్తారు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు తెలిస్తే చెప్పండి. నాకు వచ్చింది నేను రాశాను. మీకు నచ్చకపోతే చదవకండి. తమది చాలా దొడ్డ మనసు ...మీ సలహాకి ధన్యవాదాలండి పేరు కూడ చెప్పలేని తమరు సలహాలివ్వడం.

Zilebi చెప్పారు...


అదురహో జవాబు :)
ఇంకా నాలుగు వడ్డించి వుండాల్సింది :)

జిలేబి

చెప్పాలంటే...... చెప్పారు...

tappaledandi ..Thank u

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner