1. మది నిండుకుండైంది_నీ చెలిమి చెంత చేరగనే...!!
2. హరివిల్లు చిన్నబోయింది_వేల వర్ణాల నీ భావాల వన్నెల ముందు...!!
3. మది నిన్నే తలుస్తుందేమెా అమాసలో_అలంకారాలన్నీ వదిలేసి...!!
4. నీ భావాలు చేరికయ్యాయి_అక్షరాలను మాలిమి చేసుకున్నాక...!!
5. గాయం మానుతోంది_దేహానికి లేపనాలతో అతుకులేస్తుంటే....!!
6. మరక కూడ మంచిదే_జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ..!!
7. సంతసం పక్కనే ఉంది_నీ సహవాసం కోరుతూ...!!
8. వాక్యాల వరుసలు నిండుకున్నాయి_అక్షర భావాల అలంకరణతో...!!
9. నిరీక్షణకు తెర లేచింది_వియెాగానికి విరహానికి వారధిగా...!!
10. సంఘర్షణలకు చరమగీతమే_సంబరాలు మనవైనప్పుడు...!!
11. అలవికాని అనుబంధం_నిర్వచనాలకు చిక్కని మన చెలిమి...!!
12. మనసు కూడ ముఖ్యమే_మౌనాన్ని దాచేందుకు...!!
13. వెరవని ఉషోదయాలే అన్నీ_ముసిరిన చీకట్లను తరిమేయడానికి...
!!
14. వరద వెల్లువ ప్రేమకావ్యం మనది_యుగ యుగాలుగా నిలిచిపోతూ....!!
15. నీవని నేనని వేరెక్కడా_మనమైన మనసుల మమేకమే కదా...!!
16. రేపటి సంతోషాలకు సాక్ష్యాలు_గడచిన గత జ్ఞాపకాలు....!!
17. లంకలోనూ సీతమ్మ పదిలమే_రామయ్య తలపులతో...!!
18. శుక్లపక్షం వెన్నంటే ఉంటుందని ధీమా_చీకటి చీర చుట్టుకున్న ఆకాశానికి...!!
19. ఆకతాయిల అల్లరే అక్షరాలది_గుంభనమైన భావాల గుట్టు విప్పాలని....!!
20. తెలిసిన పరిచయమే_గతజన్మ అనుబంధమనుకంటా...!!
21. పరిచయముందనే పరిగెట్టుకు వచ్చింది_గతం స్పురణకు వచ్చి..!!
22. కనురెప్ప చాటున పదిలమే_మరచిపోలేని గతాలన్నీ...!!
23. చరిత్రెప్పుడూ చారిత్రాత్మకమే_అనుబంధాలకు దాసోహమైనా...!!
24. విడిపోని బంధమే మనది_మనసులొకటైన మమతలతో...!!
25. నిత్యమూ నీతోనే ఉంటున్నా_ఏకమైన మన భావాల సాక్షిగా...!!
26. అక్షరాలు కలిపిన చెలిమిది_విడదీయరాని మమతానుబంధమై...!!
27. ఇష్టసఖినై ఎదలో నిండిపోయా_అష్ట సఖులు వేల గోపికలెందరున్నా....!!
28. పాత కాలం కనుమరుగౌతోంది_కొత్తగా వచ్చి చేరిన నీ సందడితో....!!
29. వనవాసం సీతమ్మకేగా_రామరాజ్యంలో పట్టపురాణైనా...!!
30. పరిమళాలు వీడని తలపులే అవి_ కాలపు గాలికి కొట్టుకెళ్ళినా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి