1. తరలినా తరగనివే_చెలిమి పరిమళాలైనందుకేమెా...!!
2. కవిత్వం సజీవమైనదే_ప్రతి అక్షరంలోనూ జీవకళతో నిండిపోతూ...!!
3. మనసు తేలికైనట్లుంటుంది_కొన్ని కన్నీళ్ళు పలకరించినప్పుడు...!!
4. మాటలన్నీ మౌనంలో కలిసిపోయాయి_శబ్దం సద్దుమణిగాక....!!
5. ముచ్చట్లన్నీ ముసురుకున్నాయి_మనసు మౌనం వీడిందని తెలిసి...!!
6. మనసు ముగ్దమెాహనమైంది_మౌనం ముచ్చట్లకు...!!
7. మౌనం వినిపిస్తోంది_జీవితపు చివరి అంకానికి తెర తీయబడి...!!
8. పగిలింది నిశ్శబ్దం_మౌనం మాటలు నేర్చిందని..!!
9. మనసు మాట్లాడేస్తుంది_కొందరి సమక్షంలో... !!
10. మౌనాన్ని పటాపంచలు చేయాలి_మూర్కుల మూఢత్వానికి సమాధానంగా..!!
11. మౌనం మనతోనే_మానసికోల్లాసానికి ప్రతిరూపంగా...!!
12. మాలిమి చేసుకున్నావు మనసుని_మరలి పోనియకుండా....!!
13. చేరువయ్యింది చెలిమి_చెదిరిన మనసులనొకటి చేస్తూ...!!
14. మాటల యుద్ధం ముగిసింది_సుశ్శబ్దమైన నీ అంతరంగపు అలికిడి విని....!!
15. కాకమ్మ కతలన్నీ నిజాలే_నీళ్ళెన్ని ఉన్నా నిండని కుండలతో ఇప్పుడు...!!
16. కడలి ఘోషిస్తోంది_వెల్లువెత్తిన కన్నీటి సంద్రాలను మెాయలేక..!!
17. మనసుకెరుకయ్యిందేమెా_మమతలతో ముడి పడిన జీవితమని..!!
18. నేనూ ఓ ఆత్మకథ రాసేయాలి_సమయం మించకుండానే....!!
19. తూరుపు సింధూరమై మెరుస్తోంది_
పడమటి కనుమలు చేరని ప్రేమ....!!
20. అమాసను వెన్నెల వారించినట్లుంది_కృష్ణపక్షంలో చోటిస్తానని చెప్పి..!!
21. వన్నెలన్నీ భావాలవే_మనసాక్షరాలైనందుకేమెా....!!
22. అక్షరమే ఆటవిడుపు_అలుపెరగని జీవితపు ఆటలో...!!
23. తలపే తన్మయత్వం _అలసిన మనసుకు ఊరటగా...!!
24. పద ముద్రితాలై మదిని తాకుతున్నాయి_నను వీడిన నీ పాద ముద్రలు...!!
25. మెలకువ రాని కలే ఎప్పుడూ_వాస్తవాన్ని ఏమార్చేస్తూ ....!!
26. స్వప్నమూ మెలకువలోనే_గాయాలను నిదురపుచ్చలేక...!!
27. నిష్క్రమణం అనివార్యమైంది_జ్ఞాపకమై జత చేరుతూ.... !!
28. కలలై వరిస్తూనే_కన్నీరై వర్షిస్తూ...!!
29. సమయమూ సమాయత్తమైంది_నిరీక్షణకు తెర దించేయాలని....!!
30. సమయం మిగిలేవుంది_ఆశలకు ఊపిరి పోస్తూ...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి