స్నేహం చాలా విలువైనది, తీయనైనది. 1977 లో మొదలైన చిన్నప్పటి స్నేహం 2017 కి .. ఇప్పటికి అలానే ఉందంటే నిజంగా అదృష్టం అనే చెప్పాలి. 36 ఏళ్ల క్రిందట చూసిన చిన్ననాటి మిత్రుడు మొన్నీమధ్యన వచ్చి వెళితే ఆ ఆనందాన్ని పంచడానికి కాస్త సమయమే పట్టింది.
గత రెండు నెలలుగా జరిగిన కొన్ని సంఘటనల మూలంగా స్నేహంలో అతి హేయమైన కోణాన్ని చూసిన నా మనసు కుదుటబడటానికి చాలా సమయమే పట్టింది. నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇప్పటి స్నేహాల్లో చాలా వరకు వ్యాపార సంబంధిత స్నేహాలే ఎక్కువ. అవసరాలకు నటించడం వారి నైజంగా మారింది. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం, నమ్మిన స్నేహాన్ని నట్టేట ముంచడం, వారి స్వార్థం కోసం ఎంతకైనా దిగజారడం చాలా హేయంగా ఉంది. బెదిరింపులు, అరవడాలు అనేవి కొంత వరకే పని చేస్తాయి. మనిషి మీద నమ్మకం పోవడానికి ఒక్క మాట చాలు. మనమేమయినా శిభి చక్రవర్తులమా అన్న మాట మీద నిలబడటానికి, ప్రాణ త్యాగం చేయడానికి. నా దగ్గర ఒక ఆడియో రికార్డ్ ఉంది. అది వింటే ఏమి జరిగింది అన్నది అందరికి తెలుస్తుంది. కాకపొతే అది వినడానికి ఓపిక కావాలి. మధుర కలయిక అంటూ ఓ పెద్ద మాయని మచ్చకలయికగా మార్చిన కొందరిని జీవితంలో మరచిపోలేము. వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి పబ్బం గడుపుకోవాలని చూసే కొందరికి ఇప్పటికికయినా తెలిస్తే బావుండు నటనకు ఎక్కువ రోజులు అవకాశం ఉండదని. సూక్తులు పెట్టడం కాదు అవి మనకే వర్తిస్తాయని తెలుసుకుంటే బావుంటుంది. ఓ ఇద్దరు సూక్తి సుధలు నా కళ్ళు బాగా తెరిపించారు.
ఒకరు పుస్తకం వేయమని వేరే వాళ్ళతో అడిగిస్తే భువన విజయం తరపున వేస్తాము అనిచెప్పాము. డి టి పి చేయించి ఇవ్వమని చెప్పాము. డిసెంబర్లో వేసి ఇస్తాము అని చెప్పినా వారు తన పుస్తకాలు వేయడానికి దాతలు కావాలని ముఖపుస్తకంలో పోస్ట్ పెట్టారు కనీసం మాకు చెప్పకుండా. ఆ పోస్ట్ చూసి నేను మాట్లాడదామని ప్రయత్నం చేసినా వారు మాట్లాడలేదు. భువన విజయం ఎవరికైనా తమ మొదటి పుస్తకం అచ్చులో చూసుకోవాలని కోరికగా ఉండి అచ్చు వేయించుకోలేని వారి కోసమే స్థాపించబడిన సాహితీ సంస్థ. వ్యవస్థాపకులు శ్రీ వంకాయలపాటి చంద్రశేఖర్ గారు. అంతరించిపోతున్న తెలుగుకు జీవం పొసే సాహితీ కృషిలో తర తమ బేధం లేని నిస్వార్ధపరులు. మన కుటుంబం మధుర కలయికలో పెట్టిన ఖర్చులో కొంత అయినా ఇస్తాము అన్న డబ్బులు కూడా ఇవ్వని వారు, ఈ పుస్తక ప్రచురణలో నా మూలంగా నష్ట పోయిన చంద్రశేఖర్ గారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
ఒకరి మూలంగా జరిగిన చాలా నష్టాలు ఇవి. వారు వారి స్నేహితులు అందరు ఒక్కటే. మంచితో పాటు ఇలాంటి పంటి క్రింద గులకరాళ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలని 2017 పోతూ పోతూ నాకు నేర్పిన గుణపాఠం. అందుకే కొత్తవారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలనే ఈ పోస్ట్.